Homeఅంతర్జాతీయంRussia And Ukraine: రష్యా–ఉక్రెయిన్‌ మధ్య ఈస్టర్‌ సంధి.. సడెన్‌గా కాల్పుల విరమణ..

Russia And Ukraine: రష్యా–ఉక్రెయిన్‌ మధ్య ఈస్టర్‌ సంధి.. సడెన్‌గా కాల్పుల విరమణ..

Russia And Ukraine: ఉక్రెయిన్‌– రష్యా మధ్య మూడేళ్లుగా యుద్ధం జరుగుతోంది. ఉక్రెయిన్‌కు నాటోలో సభ్యత్వం, అమెరికా, నాటో దేశాల సహకారం నచ్చని రష్యా.. ఉక్రెయిన్‌(Ucrain)పై సైనిక చర్యలకు దిగింది. ఆరు నెలలు, ఏడాదిలో యుద్ధం ముగుస్తుందని అందరూ భావించారు. కానీ అమెరికా(America) సహాయంతో ఉక్రెయిన్‌ యుద్ధాన్ని సమర్థవంతంగా ఎదుర్కొంటోంది. వీలు చిక్కినప్పుడు ప్రతిదాడులు చేస్తోంది.

Also Read: మాయ చేసిన మెలోనీ.. భేటీ తర్వాత మెత్తబడ్డ ట్రంప్‌..!

తాను అధికారంలోకి వస్తే యుద్ధాలన్నీ ఆపేస్తానని ప్రకటించారు. డొనాల్డ్‌ ట్రంప్‌(Donald Trump). అధికారంలోకి వచ్చారు. అయితే ఉక్రెయిన్‌–రష్యా యుద్ధం ఆపేందుకు ప్రయత్నాలు చేశారు. కానీ అవి కూడా ఫలించలేదు. ఉక్రెయిన్‌ కాల్పుల విరమణకు ముందుకు వచ్చినా.. రష్యా అంగీకరించలేదు. కానీ, సడెన్‌గా రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌(Vlodimir Puthin) ఈస్టర్‌(Estar) సందర్భంగా శనివారం నుంచి ఆదివారం అర్ధరాత్రి వరకు ఉక్రెయిన్‌లో సైనిక దాడులను నిలిపివేయాలని తన సైన్యానికి ఆదేశించారు. మానవతా దృక్పథంతో ఈ తాత్కాలిక కాల్పుల విరమణ ప్రకటించినట్లు ఆయన తెలిపారు. ఉక్రెయిన్‌ కూడా ఈ సంధిని గౌరవిస్తుందని ఆశిస్తున్నట్లు పుతిన్‌(Puthin) పేర్కొన్నారు. అయితే, ఉక్రెయిన్‌ సంధి ఉల్లంఘనలకు పాల్పడితే తిప్పికొట్టేందుకు సైన్యం సిద్ధంగా ఉండాలని రష్యా జనరల్‌ స్టాఫ్‌ చీఫ్‌ వాలెరీ గెరాసిమోవ్‌కు ఆదేశాలు జారీ చేశారు. ఈ సంధి యుద్ధ–పీడిత ప్రాంతాల్లో తాత్కాలిక ఉపశమనం కల్పించే అవకాశం ఉంది, కానీ దీని విజయం రెండు వైపుల సహకారంపై ఆధారపడి ఉంది.

శాంతి చర్చల్లో కానరాని పురోగతి..
రష్యా–ఉక్రెయిన్‌ శాంతి చర్చలు ఫలప్రదంగా సాగకపోవడంపై అమెరికా తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. యుఎస్‌(US) విదేశాంగ మంత్రి మార్కో రుబియో, వారాలు, నెలల తరబడి ఫలితం లేని చర్చలను కొనసాగించబోమని, పురోగతి కనిపించకపోతే అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ మధ్యవర్తిత్వ ప్రయత్నాల నుంచి తప్పుకుంటారని స్పష్టం చేశారు. ట్రంప్‌ ఇప్పటికీ ఒప్పందంపై ఆసక్తి కలిగి ఉన్నప్పటికీ, తక్షణ పురోగతి లేకపోతే ప్రయత్నాలను విరమించేందుకు సిద్ధంగా ఉన్నట్లు రుబియో తెలిపారు. గతవారం పారిస్‌లో యూరప్, ఉక్రెయిన్‌ నేతలతో జరిగిన భేటీ, రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్‌తో జరిగిన చర్చలు ఈ సందర్భంలో కీలకమైనవి.

శాంతి యత్నాల్లో కొత్త ఆశలు
శాంతి చర్చలతోపాటు, ఉక్రెయిన్‌ ఖనిజ ఒప్పందంపై దృష్టి సారించినట్లు అధ్యక్షుడు ట్రంప్‌ వెల్లడించారు. వచ్చే వారంలో ఈ ఒప్పందం కుదిరే అవకాశం ఉందని ఆయన పేర్కొన్నారు. ఈ ఒప్పందం ఆర్థిక సహకారాన్ని పెంచడంతోపాటు, రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలను తగ్గించే దిశగా ఒక అడుగుగా భావిస్తున్నారు. అయితే, ఈ ఒప్పందం శాంతి చర్చలకు ఎలాంటి ప్రభావం చూపుతుందనేది ఇంకా స్పష్టంగా తెలియలేదు.

భవిష్యత్‌ అనిశ్చితి..
ఈస్టర్‌ సంధి తాత్కాలిక శాంతిని తీసుకొచ్చినప్పటికీ, రష్యా–ఉక్రెయిన్‌ సంక్షోభానికి శాశ్వత పరిష్కారం ఇప్పట్లో కనిపించడం లేదు. అంతర్జాతీయ సమాజం, ముఖ్యంగా యూరప్, అమెరికా నుంచి శాంతి చర్చలను వేగవంతం చేయాలని ఒత్తిడి పెరుగుతోంది. రష్యా, ఉక్రెయిన్‌ రెండూ సంధి నిబంధనలను గౌరవిస్తాయా, లేక ఈ సంధి మరో విఫల ప్రయత్నంగా మిగిలిపోతుందా అనేది రాబోయే రోజుల్లో తేలనుంది. ఈ సందర్భంలో, యుఎన్, నాటో వంటి సంస్థల పాత్ర కూడా కీలకంగా మారనుంది.

2022లో రష్యా ఉక్రెయిన్‌పై దాడులు ప్రారంభించినప్పటి నుంచి అనేక సైనిక, ఆర్థిక, మానవతా సవాళ్లను సృష్టించింది. ఈస్టర్‌ సంధి వంటి తాత్కాలిక చర్యలు గతంలో కూడా చోటు చేసుకున్నాయి, కానీ శాశ్వత శాంతి కోసం రాజకీయ ఒప్పందాలు, అంతర్జాతీయ మధ్యవర్తిత్వం అవసరమని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఉక్రెయిన్‌లోని పలు ప్రాంతాల్లో మానవతా సంక్షోభం తీవ్రమవుతున్న నేపథ్యంలో, ఈ సంధి సామాన్య ప్రజలకు కొంత ఉపశమనం కల్పించే అవకాశం ఉంది. అదే సమయంలో, రష్యాపై ఆర్థిక ఆంక్షలు, ఉక్రెయిన్‌కు సైనిక సాయం వంటి అంశాలు శాంతి చర్చలను మరింత సంక్లిష్టం చేస్తున్నాయి.

Also Read: అమెరికా వీసా రూల్స్‌.. జీవిత భాగస్వామి వీసా అంత ఈజీకాదు..

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
Exit mobile version