https://oktelugu.com/

Trump  Cabinet : ట్రంప్‌ క్యాబినెట్‌లోకి మరో కీలక నేత.. వ్యాక్సిన్లు వద్దన్నాడు.. ఆరోగ్య మంత్రి అయ్యాడు!

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో గ్రాండ్‌ విక్టరీ కొట్టిన డొనాల్డ్‌ ట్రంప్‌.. అధికారం చేపట్టేందుకు ఇంకా రెండు నెలల సమయం ఉంది. దీంతో ఆయన ఈ సమయంన్ని తన క్యాబినెట్, వైట్‌ హౌస్‌ కార్యవర్గం నియామకానికి ఉపయోగించుకుంటున్నారు.

Written By: , Updated On : November 16, 2024 / 12:14 AM IST
Trump  Cabinet

Trump  Cabinet

Follow us on

Trump  Cabinet :  అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్‌ పార్టీ నేత డొనాల్డ్‌ ట్రంప్‌ గ్రాండ్‌ విక్టీరీ సాధించారు. 47వ అమెరికా ప్రెసిడెంట్‌గా వైట్‌హౌస్‌లో అడుగు పెట్టబోతున్నారు. 2025, జనవరి 20 అధికారిక మార్పిడి జరిగే అవకాశం ఉంది. బాధ్యతల స్వీకరణకు రెండు నెలల సమయం ఉండడంతో ట్రంప్‌ నూతన క్యాబినెట్‌ రూపకల్పనలో నిమగ్నయమ్యారు. వైట్‌హౌస్‌ కీలక పదవులకు సమర్థత ఉన్న అధికారులను ఎంపిక చేస్తున్నారు. క్యాబినెట్‌లో విధేయులను, ఎన్నికల్లో తన గెలుపు కోసం కష్టపడినవారిని ఎంపిక చేస్తున్నారు. ఇప్పటికే ఎలాన్‌ మస్క్, వివేక్‌ రామస్వామికి కీలక బాధ్యతలు అప్పగించారు. తాజాగా మరో కీలక నేతను కీలక కేబినెట్‌ పదవికి ఎంపిక చేశారు. కొత్త ఆరోగ్య మంత్రిగా మాజీ డెమోక్రటిక్‌ నేత రాబర్ట్‌ ఎఫ్‌.కెన్నyీ జూనియర్‌ను నామినేట్‌ చేశారు. ఈమేరకు నిర్ణయం ప్రనకటించారు. ఆరోగ్యం, మానవ సేవల మంత్రిత్వ శాఖ హెడ్‌గా రాబర్ట్‌ ఎఫ్‌.కెన్నడీ జూనియర్‌ పేరు ప్రకటించడం ఆనందంగా ఉంది. శాస్త్రీయ పరిశోధనల్లో ప్రమాణాలు పెంచి, ఆరోగ్య విభాగాల్లో పారదర్శకత తీసుకువస్తారని విశ్వసిస్తున్నా. దీర్ఘకాల వ్యాధుల వ్యాప్తిని అరికట్టి అమెరికా మళ్లీ ఆరోగ్య దేశంగా మారుస్తారని నమ్ముతున్నా. అని ట్రంప్‌ తన సోషల్‌ మీడియా ట్రూత్‌లో పోస్టు చేవారు. ఈ నియామకాన్ని సెనేట్‌ ఆమోదించాల్సి ఉంటుంది.

ప్రముఖ రాజకీయ వారసుడు..
రాబర్ట్‌ ఎఫ్‌.కెన్డీ ప్రముఖ రాజకీయ కుటుంబ వారసుడు. లాయర్‌గా జూనియర్‌ కెన్నడీ సుపరిచితం. మాజీ అటార్నీ జనరల్‌ రాబర్ట్‌ ఎఫ్‌.కెన్నీడీ కుమారుడే ఇతను. అమెరికా మాజీ అధ్యక్షుడు జాన్‌ ఎఫ్‌.కెన్నడీకి దగ్గరి బంధువు. గతంలో వ్యాక్సిన్లకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తు ప్రచారం చేశారు.

డెమొక్రటిక్‌ పార్టీ అభ్యర్థి కోసం పోటీ..
డెమొక్రటిక్‌ పార్టీలో ఉన్న రాబర్ట్‌ ఎఫ్‌.కెన్నడీ జూనియర్‌.. గతేడాది ఆ పార్టీ అధ్యక్ష అభ్యర్థిత్వం కోసం జోబైడెన్‌తో పోటీ పడ్డారు. తర్వాత స్వతంత్ర అభ్యర్థిగా అధ్యక్ష ఎన్నికల్లో పనోటీ చేశారు. అయితే మధ్యలోనే రేసు నుంచి తప్పుకుని ట్రంప్‌కు మద్దతు ప్రనకటించారు. రిపబ్లికన్‌ నేతలతో కలిసి ప్రచార కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ట్రంప్‌ విజయంలో కీలక పాత్ర పోషించారు. దీంతో తన విధేయుడిగా ట్రంప్‌.. కెన్నడీ జూనియర్‌ను క్యాబినెట్‌లోకి తీసుకున్నారు.