Homeఅంతర్జాతీయంRiots In Pakistan 2025: పాకిస్తాన్‌లో అల్లర్లు.. భారత్‌లో హై అలర్ట్‌.. ఏం జరగనుంది?

Riots In Pakistan 2025: పాకిస్తాన్‌లో అల్లర్లు.. భారత్‌లో హై అలర్ట్‌.. ఏం జరగనుంది?

Riots In Pakistan 2025: పాకిస్తాన్‌లో మాజీ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌ మరణించినట్లు వార్తలు రావడంతో ఆ దేశంలో అల్లర్లు, ఆందోళనలు పెరుగుతున్నాయి. ఇమ్రాన్‌ మద్దతుదారులు రోడ్లపైకి వస్తున్నారు. ప్రజలు కూడా ఉద్యమిస్తున్నారు. అద్యాల జైలు వద్దకి భారీగా ర్యాలీలు నిర్వహిస్తున్నారు. ఆయనకు ఏం జరిగిందో తెలియాలని డిమాండ్‌ చేస్తున్నారు.

ఆరోగ్యంగా ఉన్నాడని చెప్పినా..
పాకిస్తాన్‌ సైన్యం పాలనా ప్రమాణాలపై ప్రజల నమ్మకం తగ్గింది. ఇమ్రాన్‌ఖాన్‌ ఆరోగ్యంగా ఉన్నాడని సైనికాధికారి ఆసిమ్‌ మునీర్‌ తెలిపారు. అయినా ఆందోళనలు ఆగడం లేదు. తమకు ఒకసారి చూపించాలని డిమాండ్‌ చేస్తున్నారు. ఇమ్రాన్‌ సోదరీమణులు జైలు వద్దకు వెళిలితే ములాఖత్‌కు అవకాశం ఇవ్వడం లేదు. ఖైబర్‌ఫక్తూంగ్వా ముఖ్యమంత్రి కూడా ఇటీవల అద్యాల జైలు వద్దకు వెళ్లారు. అతనికి కూడా ఇమ్రాన్‌ను కలిసే అవకాశం ఇవ్వలేదు. దీంతో ఇమ్రాన్‌ఖాన్‌ పార్టీ నేతల్లో ప్రజల్లో ఆందోళనలు మరింత పెరుగుతున్నాయి. పాకిస్తాన్‌ నేషనల్‌ అసెంబ్లీలో కూడా పాకిస్తాన్‌ తెహ్రీక్‌ ఏ ఇన్‌సాన్‌ పార్టీ ప్రతినిధులు ఆందోళన చేస్తున్నారు. ఇమ్రాన్‌ఖాన్‌ గురించి సైన్యం గోప్యత పాటించడం, సైన్యం కారణంగానే ఇమ్రాన్‌ మరణించారని ఆరోపణలు వస్తుండడంతో ఆగ్రహాలు వ్యక్తమవుతున్నాయి. ఇక పాకిస్తాన్‌ ప్రధాని షహబాజ్‌ షరీఫ్‌ ప్రభుత్వాన్ని కూడా ప్రజలు చీదరించుకుంటున్నారు.

భారత్‌లో అలర్ట్‌..
పాకిస్తాన్‌ లోపల ఉన్న ఉద్రిక్తతల కారణంగా భారత్‌కు భారత్‌లో హై అలర్ట్‌ ప్రకటించారు. మన ఇంటలిజెన్స్‌ వర్గాలు భారత ప్రభుత్వానికి, సైన్యానికి కీలకసమాచారం అందించింది. పాకిస్తాన్‌లో ప్రజల దృష్టిమళ్లించేందుకు భారత్‌పై ఉగ్రదాడులు చేసే అవకాశం ఉందని తెలిపింది. సైనిక దాడులు చేసే ధైర్యం లేదు. ఇప్పటికే జైష్‌ ఏ మహ్మద్‌ కుట్రను భగ్నం చేయగలిగాం. ఢిల్లీ పేలుడు తర్వాత ఉగ్ర డాక్టర్లు పట్టుపడ్డారు. 2,900 కిలోల అమ్మోనియం నైట్రేట్‌ పట్టుకున్నారు. ఇప్పుడు పాక్‌ ప్రజల దృష్టిని మళ్లించేందుకు భారత్‌లో పాకిస్తాన్‌ ఉగ్రదాడులు చేయించే అవకాశం ఉంది. ఈమేరకు పాకిస్తానీల సంభాషణలు గుర్తించారు. అయితే పాకిస్తాన్‌ ఏ దాడి చేసిన భారత్‌ ప్రతిదాడి చేస్తుంది. దీంతో ఈసారి బంగ్లాదశ్‌ వైపు నుంచి దాడికి ప్లాన్‌ చేస్తోందని సమాచారం.

సైన్యం అలర్ట్‌..
మన భద్రతా బలగాలు కూడా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశాయి. లష్కర్‌ ఏ తోయిబాకు చెందిన చాలా మంది బంగ్లాదేశ్‌లో ఉన్నారు. అక్కడి హుజి సంస్థ ద్వారా బిహార్, యూపీ, అసోం, ఢిల్లీలో పేలుళ్లు నిర్వహించే ప్రయత్నం చేస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో పాకిస్తాన్‌ ప్రజల దష్టి మళ్లుతుందని పాకిస్తాన్‌ ప్రభుత్వం ఆలోచన చేస్తుందని సమాచారం. దీంతో పాకిస్తాన్‌ కూడా పాక్‌కు చెందిన పలు ఉగ్ర సంస్థల కార్యకలాపాలపైనా నిఘా పెట్టింది. ఉగ్రవాదుల మాటలను ట్రేస్‌ చేస్తున్నారు. కోడ్‌ లాంగ్వేజ్‌ను డీ కోడ్‌ చేస్తున్నారు. మొత్తంగా భారత్‌ హై అలర్ట్‌లోఉంది.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular