Asim Munir a big conspiracy: పాకిస్తాన్ వారం రోజులుగా అట్టుడుకుతోంది. మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఆరోగ్య పరిస్థితి, అసలు బతికే ఉన్నారా లేదా అనే విషయంలో స్పష్టత లేక దేశవ్యాప్తంగా తీవ్ర గందరగోళం నెలకొంది. తెహ్రీకే ఇన్‌సాన్ పార్టీ కార్యకర్తలు ఖైబర్ ఫక్తూన్‌గ్వాలో ఆందోళనలు పెంచుతున్నారు. అక్కడి ప్రభుత్వ మద్దతుతో ఇమ్రాన్‌ను ప్రజలకు చూపాలని డిమాండ్ చేస్తున్నారు. అయితే ఇంత గందరగోళం, ఉద్యమం, ఆందోళనలు, నిరసన వెనుక సైన్యం ప్రోత్సాహం ఉందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
ఆర్మీ చీఫ్ గేమ్..
పాకిస్తాన్ ఆర్మీ చీఫ్, ఫీల్డ్ మార్షల్ ఆసిమ్ మునీర్ పదవీకాలం నవంబర్ 30తో ముగిసింది. ఇప్పటికే ఆయన తన పదవీకాలం రెండేళ్లు పొడిగించుకున్నారు. తాజాగా మరోమారు డిఫెన్స్ చీఫ్‌గా మరో ఐదేళ్లు పదవిలో కొనసాగేందుకు ప్లాన్ చేశారు. అతడి పదవీ పొడగింపుపై రాజ్యాంగ సవరణ (27వ సవరణ) తీసుకొచ్చారు. దీన్ని అమలు చేయడానికి ప్రధాని షెహబాజ్ షరీఫ్ సంతకం అవసరం, కానీ ఆయన ప్రస్తుతం దేశంలో లేరు. దీంతో ఆసిమ్ మునీర్ పదవి కోసం దేశంలో అల్లర్లు సృష్టిస్తున్నారని తెలుస్తోంది. ఇంత ఆందోళనలు కొనసాగుతున్నా ఎవరినీ అరెస్ట్ చేయకపోవడమే ఇందుకు కారణంగా భావిస్తున్నారు.
సుదీర్ఘకాలం సైనికాధికారిగా..
ఆసిమ్ మునీర్ 2020లో మూడు ఏళ్ల కాలానికి సైన్యాధిపతిగా నియమించబడ్డాడు. ఆ తర్వాత పదవీ కాలాన్ని రెండేళ్ల పొడిగించుకున్నారు. సుదీర్ఘకాలం సైనికాధికారిగా కొనసాగుతున్నారు. తాజాగా 27వ రాజ్యాంగ సవరణ ద్వారా ఆయన్ను చీఫ్ ఆఫ్ డిఫెన్స్ ఫోర్సెస్‌గా కూడా నియమించి, సైన్యం యొక్క అన్ని శాఖలను (ఆర్మీ, ఎయిర్ ఫోర్స్, నేవీ) నియంత్రించే అధికారం అందాలను ఆసిమ్ ప్లాన్. ఈ విధంగా ఆయన పదవి 2030 వరకు కొనసాగనుంది. ఈ విస్తారమైన అధికారాల కారణంగా పాకిస్తాన్ సైన్యం పూర్తిగా ఆసిమ్ చేతిలో ఉంటుంది.
ప్రధాని సంతకం కోసమే..
పాకిస్తాన్ ప్రధాని సంతకం లేకుండా రాజ్యాంగ సవరణ అమలు కాదు. దీంతో వారం రోజులుగా ఆసిమ్ మునీర్ ఈ నిరసనల గేమ్ ఆడిస్తున్నారు. అయినా షెహబాజ్ స్పందించడం లేదు. దీంతో పదవిపై ఉత్కంఠ నెలకొంది. మరోవైపు పదవి పొడగింపు జరగకపోతే.. అంతర్యుద్ధం, తిరుగుబాటు వంటి విపరీత పరిస్థితులు ఏర్పడే అవకాశం కూడా ఉందని సమాచారం. ఇమ్రాన్ ఖాన్ కోసం అల్లరులు పెరగడం ద్వారా దేశం అంతర్గతంగా రాజకీయ సంక్షోభంలోకి వెళ్లే అవకాశం ఉంది.
మొత్తంగా ఆసిమ్ మునీర్ గేమ్ ప్లాన్ స్పష్టంగా కనిపిస్తోంది. ఆసిమ్‌కు చెక్ పెట్టేందుకు షెహబాజ్ కూడా వ్యూహాత్మకంగా దేశంలో లేనట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో రాబోయే 48 గంటలు చాలా కీలకంగా మారాయి.