Hafiz Saeed news: ఒకప్పుడు భారత్‌పై జిహాద్ పేరుతో భారత్‌పై దాడి చేస్తామని, కశ్మీర్‌ను ఆక్రమించుకుంటామని హడావుడి చేసిన లష్కర్ ఎ తోయిబా స్థాపకుడు హాఫీజ్ సయ్యిద్ ఇప్పుడు భయంతో గజగజ వణికిపోతున్నాడు. గడపదాటి బయటకు రావడానికి జంకుతున్నాడు. మసీదుకన్నా.. ఇల్లే నయం అన్నట్లుగా, కనుగులో ఎలకలా దాక్కుంటున్నాడు. తాజాగా నవంబర్ 2న లష్కర్ అనుబంధ సంస్థ ముస్లిం మర్కజ్ లాహోర్‌లో భారీ సభ ఏర్పాటు చేయగా, సయ్యిద్ హాజరు కావడం లేదన్న కారణంతో సభను తాత్కాలికంగా రద్దు చేశారు.
ఆపరేషన్ సిందూర్ ప్రభావం..
భారత్ ‘‘ఆపరేషన్ సిందూర్’’తో లష్కర్ ప్రధాన కేంద్రాలను లక్ష్యంగా చేసుకోవడంతో ఉగ్రబలగానికి పెద్ద దెబ్బ తగిలింది. అనేక మంది లష్కర్ సభ్యులు దారుణంగా హతమయ్యారు. హాఫీజ్ సయ్యిద్ ఆ దాడికి కష్టపడి తప్పించుకున్నా, ఆ తరువాత బహిరంగంగా కనిపించడం తగ్గించాడు. ఇక పాకిస్తాన్‌లో షాడో హంటర్స్ పెరిగిపోయారు. ఇటీవలి నెలల్లో లష్కర్ నేతల్లో తొమ్మిది మందిని కాల్చి చంపారు. మొయిద్ ముజాహిద్ హత్యతో పరిస్థితి మరింత ఉత్కంఠభరితమైంది. ‘తర్వాత నేనేనా?’ అన్న భయం సయ్యిద్‌ను గడప దాటడానికి భయపడుతున్నాడు.
గతంలో తప్పించుకుని..
2019లో లష్కర్ లో సయ్యిద్ కుటుంబ సభ్యులపై బాంబు దాడి జరగగా తప్పించుకున్నారు. 2023లో నివాసం ముందు జరిగిన ఆత్మాహుతి దాడి జరిగింది. ఇక్కడ హఫీజ్ తప్పించుకున్నాడు. ప్రతిసారీ చివరి నిమిషంలో ప్రాణం దక్కింది. ఈ భయంతో ప్రస్తుతం బయటకు రావడానికే భయపడుతున్నాడు.
భయపెడుతున్న భారత్ సైనిక విన్యాసాలు..
భారత్ సముద్రతీర సైనిక విన్యాసాలు పాకిస్తాన్‌లో ప్రబల ఆందోళన కలిగిస్తున్నాయి. కరాచీ సమీపంలో జరుగుతున్న ఈ కసరత్తులు ఏ సమయానైనా విస్తరించవచ్చనే భయంతో, లష్కర్ నాయకత్వం మరింత జాగ్రత్త పడుతోందని ఇంటెలిజెన్స్ వర్గాలు సూచిస్తున్నాయి.
ఒకప్పుడు తనను జననాయకుడుగా పిలిపించుకున్న హాఫీజ్ సయ్యిద్ ఇప్పుడు చీకటిలో దాగి ఉన్న వ్యక్తిగా మారాడు. ఎటు వెళ్లినా అగంతకుల నీడలు, బయటకు వస్తే కాల్పుల భయం వెంటాడుతున్నాయి. భారత క్షిపణి దాడులు, పాకిస్తాన్ అంతర్గత విభేదాలు, గత ఆత్మాహుతుల జ్ఞాపకాలు ఆయనను వెంటాడుతున్నాయి.