Rahul Gandhi: కాంగ్రెస్ అగ్రనేత.. గతేడాది చేపట్టిన భారత్ జోడో యాత్రద్వారా రాజకీయ పరిణతి సాధించారని, పార్టీని బలోపేతం చేశారని రాజకీయ పండితులు భావించారు. మొన్నటి ఎన్నికల్లో ఫలితాలు కూడా అలాగే వచ్చాయి. కాంగ్రెస్ అధికారంలోకి రాకపోయినా ప్రధాన ప్రతిపక్ష హోదా దక్కింది. 2019తో పోలిస్తే పరిస్థితి మెరిగైంది. ఇక పార్లమెంటులో ప్రతిపక్ష నేతగా కూడా రాహుల్ ఎంపికయ్యారు. సభలో ఆయన మాట్లాడుతున్న తీరు కూడా పరిణతితో కనిపించాయి. దీంతో రాహుల్ గాంధీలో మార్పు వచ్చిందని విశ్లేషకులు భావించారు. 2029 ఎన్నికల నాటికి మరింత పరిణతి సాధిస్తే ప్రధాని అయ్యే అవకాశం ఉంటుందని అంచనా వేశారు. కానీ, మూడు రోజుల పర్యటన నిమిత్తం అమెరికా వెళ్లిన రాహుల్‌గాంధీ అక్కడ వివిధ యూనివర్సిటీల్లో విద్యార్థులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా భారత దేశంలో రిజర్వేషన్ల అంశంపై, ఎన్నికల జరిగిన తీరుపై, భారత్‌లో ప్రస్తుత పరిస్థితులపై, బీజేపీ, ఆర్ఎస్ గురించి చేసిన వ్యాఖ్యలపై కమలం నేతలు మండిపడుతున్నారు. ప్రధాని కాలేకపోయానన్న బాధతో మాట్లాడుతున్నారని మండిపడుతున్నారు. రాహుల్ వ్యాఖ్యలు దేశాన్ని కించపరిచేలా ఉన్నాయని హోం మంత్రి అమిత్‌షా ఆగ్రహం వ్యక్తం చేశారు. పరాయి దేశంలో భారత వ్యతిరేక వ్యాఖ్యలు చేయడంపై మండిపడ్డారు.
సిక్కుల పరిస్థితిపై..
భారతదేశంలో సిక్కులు అభద్రతా భావంతో ఉన్నారని, భారత భూభాగాన్ని చైనా ఆక్రమిస్తోందని చేసిన వ్యాఖ్యలపై రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. భారత్–చైనా సరిహద్దు వివాదానికి సంబంధించి అమెరికా గడ్డపై అతను చేసిన వాదనలు తప్పుదారి పట్టించేలా ఉన్నాయన్నారు. వాస్తవాలకు అతీతమైనవి పేర్కొన్నారు. ఇక సిక్కుల గురించి చేసిన వ్యాఖ్యలపై బీజేపీ అనుబంధ సిక్కు సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. కాంగ్రెస్ పాలనతోనే తాము ఇబ్బంది పడ్డామని, మోదీ పాలనలో ఇప్పుడు ప్రశాంతంగా ఉన్నామని పేర్కొంటున్నారు.
రిజర్వేషన్ల అంశం అక్కడ ఎందుకు..
భారత్‌లో రిజర్వేషన్ల అంశాన్ని అమెరికాలో ప్రస్తావించడాన్ని చాలా మంది తప్పు పడుతున్నారు. దేశం అంతర్గత విషయం గురించి విదేశాల్లో ఎందుకు మాట్లాడారన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. విదేశీ నేతలు భారత దేశానికి వచ్చినప్పుడు వారి దేశం గురించి గొప్పగా చెబుతారు. కానీ, రాహుల్ మాత్రం విదేశాలకు వెళ్లి భారత్‌ను కించపరిచేలా వ్యాఖ్యలు చేయడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. రిజర్వేషన్ల రద్దు ఆలోచన రాహుల్‌ది అని, అందుకే ఆయన దానిని విదేశీ గడ్డపై ప్రస్తావించారని అమిత్‌షా విమర్శించారు. బీజేపీ ఉన్నంతవరకు రిజర్వేషన్లను ఎవరూ టచ్ చేయరని స్పష్టం చేశారు.
భారత వ్యతిరేక మహిళతో భేటీ..
ఇదిలా ఉంటే.. అమెరికా శాసనసభ్యురాలు ఇల్హాన్ ఒమర్‌ను రాహుల్ కలిశారు.
సాధారణంగా, అమెరికా లామేకర్‌లతో సమావేశం అవడం పెద్ద సమస్య కాదు. కానీ ఇల్హాన్ ఒమర్‌తో రాహుల్ గాంధీ సమావేశం కావడంపై దేశ ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇల్హాన్ ఒమర్ పాకిస్తాన్‌కు అనుకూలంగా, భారత వ్యతిరేకంగా పేరుంది. ఆమె ఒకసారి పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ (పీఓకే)లో పర్యటించారు. దీనిని భారత్ వ్యతిరేకించింది. ఆమె ‘సంకుచిత రాజకీయాలు‘ భారతదేశ ‘ప్రాదేశిక సమగ్రత మరియు సార్వభౌమాధికారాన్ని‘ ఉల్లంఘించాయని పేర్కొంది. ఆమెను రాహుల్ కలవడంపై బీజేపీ మండిపడుతోంది. విదేశీ వేదికలపై భారతదేశానికి వ్యతిరేక ప్రకటనలు చేసిన రాహుల్ గాంధీ ఎల్లప్పుడూ దేశ భద్రతను బెదిరిస్తూ, మనోభావాలను దెబ్బతీస్తున్నారని రాజ్‌నాథ్‌సింగ్ విమర్శించారు.
మంత్రుల మండిపాలు..
– గాంధీ విదేశీ గడ్డపై భారతీయులను బాధపెట్టే విధంగా ప్రకటనలు చేశారని మరియు ‘‘భారత వ్యతిరేక’’ వ్యక్తులను కూడా కలిశారని కేంద్ర వాణిజ్య మరియు పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ మండిపడ్డారు. ‘‘మిస్టర్ రాహుల్ గాంధీ భారతదేశానికి మాత్రమే క్షమాపణలు చెప్పాలి, కానీ ప్రతి పౌరుడికి క్షమాపణలు చెప్పాలి’ అని డిమాండ్ చేశారు.
– కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాలు, మైనారిటీ వ్యవహారాల శాఖ మంత్రి కిరెన్ రిజిజు మాట్లాడుతూ ‘‘ప్రపంచ వ్యాప్తంగా తెలిసిన భారత వ్యతిరేక అంశాలతో తరచూ తిరుగుతూ, విషం చిమ్ముతూ, వ్యతిరేకంగా మాట్లాడుతున్న మన దేశంలో రాజకీయ నాయకులు ఎవరో అందరూ చూడాలని అన్నారు’ అని ఆగ్రహం వ్యక్తం చేశారు.
– ఇదిలా ఉంటే రాహుల్ గాంధీ ఇల్హాన్ ఒమర్‌ను కలవడంపై వచ్చిన విమర్శలను కాంగ్రెస్ తోసిపుచ్చింది. కాంగ్రెస్ మీడియా, ప్రచార విభాగం అధిపతి పవన్ ఖేరా స్పందిస్తూ.. ప్రధాని విదేశాలకు వెళ్లి భారతదేశానికి, భారతీయులకు వ్యతిరేకంగా భయంకరమైన వ్యాఖ్యలు చేస్తారు, అది దేశ వ్యతిరేకం కాదా? రాహుల్‌గాంధీ భారత రాజ్యాంగాన్ని సమర్థించడం గురించి మాట్లాడుతున్నారని తెలిపారు. అది దేశ వ్యతిరేకమా? రాజ్యాంగాన్ని పరిరక్షించడం గురించి మాట్లాడినప్పుడల్లా బీజేపీకి ఎందుకు ఇబ్బంది? అని ప్రశ్నించారు.
– జాతీయ ప్రయోజనాలు, రిజర్వేషన్ల గురించి బోధించే వారు ముందుగా సామాజిక న్యాయంపై ఆర్ఎస్ఎస్ సొంత ట్రాక్ రికార్డును పరిశీలించాలని కాంగ్రెస్ ఎంపీ మాణికం ఠాగూర్ అన్నారు. గాంధీ ఎల్లప్పుడూ ఐక్యత మరియు సమానత్వం కోసం నిలబడతారని, బీజేపీ, దాని సైద్ధాంతిక మార్గదర్శకులు దీనికి విరుద్ధంగా చేశారని ఠాగూర్ అన్నారు.
Raj Sekhar is a senior content writer with good knoledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.
Read MoreWeb Title: Rahul is making anti india comments in america
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com