Homeఅంతర్జాతీయంFirst divorce case in India : భారత్‌లో తొలి విడాకుల కేసు.. ఏకంగా బ్రిటన్‌...

First divorce case in India : భారత్‌లో తొలి విడాకుల కేసు.. ఏకంగా బ్రిటన్‌ రాణి జోక్యం..!

First divorce case in India : భారతీయ వైవాహిక బంధానికి, భార్య, భర్తల అనుబంధానికి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు ఉంది. ప్రపంచ దేశాలన్నీ మన సంస్కృతిని గొప్పగా భావిస్తున్నాయి. అయితే ఇప్పుడు భారతీయులు విదేశీ మోజులో పడి పాశ్చాత్య సంస్కృతికి అలవాటు పడుతున్నారు. ఒకప్పుడు దంపతులు కడవరకు కలిసి ఉండేవారు. కష్టసుఖాలను కలిసి పంచుకునేవారు. నేడు ఎవరికి కష్టం వచ్చినా వదిలేయడమే తుది నిర్ణయంగా భావిస్తున్నారు. ఇదిలా ఉంటే.. భారత్‌లో తొలి విడాకుల కేసు, విడాకులు తీసుకున్న మొదటి హిందూ మహిళ చరిత్రకెక్కింది. ఆమె విడాకుల కేసులో ఏకంగా బ్రిటన్‌ క్వీన్‌ జోక్యం చేసుకోడం, తనకు అనుకూలంగా తీర్పు పొందింది. నాడు దీనిని అందరూ విమర్శించారు. ఇంతకీ ఆమె ఎవరు. ఎందుకు విడాకులు తీసుంది. రాణి ఎందుకు జోక్యం చేసుకున్నారనే వివరాలు తెలుసుకుందాం.

1885లో తొలి విడాకుల కేసు..
1885లో జరిగిన ఘటన ఇది. భారత్‌లో మొట్ట మొదటి విడాకుల కేసు కూడా ఇదే. ఆ మహిళపేరు రఖ్మాబాయి రౌత్‌. మన దేశంలో విడాకులు కనిపించని రోజుల్లో ధైర్యంగా కోరుట్లో పోరాడిన రఖ్మాబాయి భర్త నుంచి విడాకులు తీసుకున్న తొలి మహిళగా గుర్తింపు పొందారు. కేవలం 11 ఏళ్ల వయసులోనే రుఖ్మాబాయికి తల్లిదండ్రులు పెళ్లి చేశారు. నాడు అబ్బాయి వయసు 19 ఏళ్లు. అయితే మెడిసిన్‌ చదవాలన్న తపనతో తన తల్లిదండ్రుల వద్దే ఉండేది. అయితే భర్తకు అది నచ్చలేదు. తన వద్దే ఉండాలని పట్టు పట్టాడు. అందుకు రుఖ్మాబాయి నిరాకరించింది. దీంతో అతడు ఆమెపై కేసు పెట్టాడు.

కలిసి జీవించలేనని…
ఇక రఖ్మాబాయి తనకు చిన్నతనంలో వివాహం అయిందని, అందుకే కలిసి ఉండలేకపోతున్నామని కోర్టుకు తెలిపింది. రుఖ్మాబాయి ధైర్యం అప్పట్లో వివాదాస్పదమైంది. ఆమెను అంతా ఆడిపోసుకున్నారు. అయితే కోర్టు భర్తతో కలిసి ఉండకపోతే.. ఆరు నెలలు జైలుకు వెళ్లాలని సూచించారు. ఆమె ఆశ్చర్యకరంగా జైలుకు వెళ్లడానికి కూడా వెనుకాడలేదు. ఆమె జైల్లో శిక్షణ అనుభవిస్తుండగానే ఎ హిందూ లేడీ అనే పేరుతో లింగ సమానత్వం, సామాజిక సంస్కరణలు, మహిళల హక్కులు మొదలైనవాటి గురించి రాశారు.

రచనలు..
ఇదిలా ఉంటే రుఖ్మాబాయి అనేక రచనలు చేశారు. వాటిలో కొన్ని క్వీన్‌ విక్టోరియా దృష్టికి రావడంతోపాటు ఆమె రచనలను రాణి విక్టోరియా మెచ్చుకున్నారు. అయితే విడాకుల తీర్పు ఇచ్చే ముందు అనుకూలంగా తీర్పు వచ్చేలా చేసుకోవాలని సూచించారు. అలాగే విడాకులు కూడా మంజూరయ్యేలా చేశారామె. అయితే ఆమె లండన్‌ స్కూల్‌ ఆఫ్‌ మెడిసిన్‌ ఫర్‌ ఉమెన్‌లో చదవాలని నిర్ణయించుకుంది. అలా 35 ఏళ్ల పాటు సూరత్‌లోని ఉమెన్స్‌ హాస్టిల్‌ చీఫ్‌గా పనిచేశారు. భారత దేశానికి తిరి వచ్చారు.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.
Exit mobile version