Putin India visit: రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ మరి కొన్ని గంటల్లో భారత్‌కు రానున్నారు. చాలా కాలం తర్వాత ఆయన ఇండియాకు వస్తున్నారు. 2023 మార్చిలో ఉక్రెయిన్‌పై దాడి సందర్భగా రష్యా అధ్యక్షుడు పుతిన్‌పై అంతర్జాతీయ కోర్టు వారెంట్ జారీ చేసింది. దీంతో ఆయన రెండేళ్లుగా విదేశీ పర్యటనలు తగ్గించారు. చైనా, అమెరికా, తజకిస్తాన్, కజకిస్తాన్‌లో మాత్రమే పర్యటించారు. తాజాగా ఇండియాకు వస్తున్నారు. ఈ నేపథ్యంలో ఐసీసీ కోర్టు ఆదేశాలను 1125 దేశాల్లో అమలు చేయాలన్న చర్చ జరుగుతోంది.
భారత్ ఐసీసీ సభ్యత్వం లేకపోవడం..
భారత్ ఐసీసీలో సభ్యదేశం కాదు కాబట్టి, ఈ వారెంట్ ఇక్కడ చట్టబద్ధంగా అమలు చేయలేదు. దీంతో పుతిన్ భారత్‌కు సురక్షితంగా వచ్చే అవకాశం ఉంది, ఎందుకంటే దేశీయ చట్టాల ప్రకారం అతన్ని అరెస్టు చేయాల్సిన అవసరం లేదు. రష్యాతో దీర్ఘకాలిక వాణిజ్య, రక్షణ సంబంధాలు (ఎస్–400 ఒప్పందాలు, ఆయుధ ఎగుమతులు) భారత్‌ను ఐసీసీ డిమాండ్‌కు తిరస్కరించే స్థితిలో ఉంచాయి. ఒకవేళ ఐసీసీ అప్పగించాలని కోరినా, భారత్ దౌత్య సంబంధాలు, దేశ సార్వభౌమత్వం ఆధారంగా నిరాకరించే అవకాశం ఎక్కువ.
పుతిన్ పర్యటన ప్రభావాలు
ఇక పుతిన్ భారత్ పర్యటన సాధారణంగా జరగనుంది, ఎందుకంటే భారత్ ఐసీసీ బాధ్యతలు లేకుండా రష్యాతో సహకారాన్ని కొనసాగిస్తుంది. ఇది భారత్ దౌత్య విధానంలో స్వతంత్రతను హైలైట్ చేస్తుంది. ఇదిలా ఉంటే.. రష్యా అధ్యక్షుడు భారత పర్యటనను అమెరికా నిశితంగా గమనిస్తోంది. ఇప్పటికే రష్యా, భారత్ బంధాలపై గుర్రుగా ఉన్న అమెరికా.. ఇప్పుడు ఏం జరుగుతుంది.. ఎలాంటి ఒప్పందాలు చేసుకుంటాయని అమెరికా నిఘా వర్గాలు గమనిస్తున్నాయి.