Putin warning to Trump: పశ్చిమాసియాలో మళ్లీ యుద్ధ జ్వాలలు రాజుకుంటున్నాయి. తాత్కాలిక కాల్పుల విరమణ కారణంగా ఇరాన్–అమెరికా మధ్య 20 రోజులుగా దాడులు ఆగాయి. అయితే శాంతి ఒప్పందంకోసం రెండు దఫాలు జరిగిన చర్చలు విఫలమయ్యాయి. మరోమారు చర్చలు జరిగే అవకాశం కనిపించడం లేదు. ఈ పరిస్థితిలో ఇరాన్‌పై దాడులకు అమెరికా సిద్ధమవుతోంది. చేతిలో గన్ పట్టుకుని తన సొంత సోషల్ మీడియాలో ఒక పోస్టు చేసిన ట్రంప్.. మరుసటి రోజే దాడులకు సిద్ధమవుతున్నారు. దీంతో పశ్చిమాసియాలో మళ్లీ ఉద్రిక్తతలు పెరుగుతున్నాయి. ఈ పరిస్థితిలో ట్రంప్–పుతిన్ ఫోన్ సంభాషణ ఇరాన్ యుద్ధాన్ని దౌత్య మార్గాల్లోకి మళ్లించే అవకాశాన్ని సృష్టించింది. ఇరాన్‌పై మరో దాడి చేస్తే ప్రపంచవ్యాప్త ఆగ్రహానికి గురవుతారని పుతిన్ హెచ్చరించగా, ట్రంప్ ఉక్రెయిన్ కాల్పుల విరమణ సూచనలు ఇచ్చారు.
90 నిమిషాలు సంభాషణ..
అమెరికా, రష్యా అధ్యక్షులు ట్రంప్, పుతిన్ సుమారు 90 నిమిషాల ఫోన్ కాల్లో మాట్లాడుకున్నారు. ఇరాన్, ఉక్రెయిన్ పరిస్థితులపై చర్చించారు. ఇరాన్‌తో కాల్పుల విరమణను పొడిగించిన ట్రంప్ నిర్ణయాన్ని పుతిన్ స్వాగతించారు. ఇరాన్‌పై అమెరికా–ఇజ్రాయెల్ మరోసారి దాడి చేస్తే పశ్చిమాసియా మొత్తం ప్రపంచానికి ఇబ్బందికర పరిస్థితులు తప్పవని క్రెమ్లిన్ సహాయకుడు యూరీ ఉషాకోవ్ వెల్లడించారు.
యురేనియం ఆఫర్
ఇరాన్ శుద్ధి చేసిన యురేనియం నిల్వలను రష్యా తీసుకునేందుకు సిద్ధమని పుతిన్ ప్రతిపాదించారు. ‘మీరు సహాయం చేసే ముందు ఉక్రెయిన్ యుద్ధాన్ని ముగించాలి‘ అని ట్రంప్ బదులిచ్చారు. రష్యా దౌత్య పరిష్కారాలకు సిద్ధమని పుతిన్ పునరుద్ఘాటించారు. త్వరలో ఉక్రెయిన్‌లో కాల్పుల విరమణకు అవకాశమని ట్రంప్ సంకేతాలు ఇచ్చారు. పుతిన్ కొద్ది రోజులపాటు విరమణ సూచించారని చెప్పారు. ఇది మూడేళ్ల యుద్ధానికి మలుపుగా మారనుంది.
గ్లోబల్ పరిణామాలు
ఇరాన్ యుద్ధం, ఉక్రెయిన్ సంక్షోభం రెండింటినీ ఒకేసారి పరిష్కరించాలని ఇద్దరూ ఒక్కసారి కోరారు. హార్మూజ్ జలసంధి, చమురు సరఫరా ఒత్తిడి తగ్గే అవకాశం ఉంది. భారత్ వంటి దేశాలకు ఇంధన ధరలు స్థిరపడే అవకాశం కలుగుతుంది.
రష్యా ఇరాన్‌తో ఉద్రిక్తతల తగ్గింపుకు మధ్యవర్తిగా రంగంలోకి రానుంది. ట్రంప్ రెంబో విధానం దౌత్యానికి మార్పు చెందుతుంది. దీంతో యుద్ధ ఉద్రిక్తతలు తగ్గిపోయి. చర్చల మార్గం తెరుచుకుంటుంది.