PM Modi Visit Israel: భారత్‌తో మినహా ఏ దేశంలోను డిఫెన్స్ డీల్ చేసుకోమని గతంలోనే ప్రకటించారు ఇజ్రాయెల్ ప్రధాని బెంజిమెన్ నెతన్యాహు. ఇరు దేశాల మధ్య ఇప్పటికే అనేక అంశాల్లో సహకారం ఉంది. కీలక సమయంలో ఇజ్రాయెల్ భారత్‌కు సహాయం అందిస్తోంది. ఆపరేషన్ సిందూర్ సమయంలోను అండగా నిలిచింది. ఈ క్రమంలో తాజాగా ప్రధాని మోదీ ఫిబ్రవరి 25న ఇజ్రాయెల్ పర్యటనకు వెళ్లనున్నారు. రెండు రోజులు ఆ దేశంలో పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలో మోదీ పర్యటన వెనుక పెద్ద ప్లాన్ ఉన్నట్లు తెలుస్తోంది. 2017 తర్వాత మోదీ ఇజ్రాయెల్ వెళ్లడం ప్రాధాన్యత సంతరించుకుంది..
పర్యటన ప్రకటన రహస్యం
ఇదిలా ఉంటే నెతన్యాహూ అమెరికన్ యూదు నాయకుల ముందు మోదీ కనెసెట్‌లో ప్రసంగించనున్నారని వెల్లడించారు. భారత్ శక్తివంతమైన శక్తిగా మారుతుందని అభినందించారు. ఇలాంటి సమయంలో భారీ ప్రణాళికతో తొమ్మిది సంవత్సరాల తర్వాత మోదీ ఇజ్రాయెల్ పర్యటన కీలకంగా మారింది.
సహకార రంగాల్లో కొత్త మలుపు
మోదీ పర్యటనలో టెక్నాలజీ, రక్షణ, వ్యవసాయరంగాల్లో లోతైన చర్చలు జరిగే అవకాశం. ఇజ్రాయెల్‌తో భారత్ ఆర్థిక–సైనిక ఒప్పందాలు బలపడి, మధ్యప్రాచ్యంలో భారత ప్రభావం మరింత పెరిగే అవకాశం ఉంది. 140 కోట్ల జనాభాతో భారత్ భారీ మార్కెట్‌గా పరిగణించబడుతోంది. రక్షణ పరికరాలు, సాంకేతిక సంతకాలు, పెట్టుబడుల ఒప్పందాలు జరిగే అవకాశం ఉంది.
ప్రపంచ రాజకీయాల్లో భారత్ స్థానం బలోపేతం చేసే దృష్టిలో మోదీ పర్యటన ఉంటుందని విశ్లేషకులు ఊహిస్తున్నారు. భవిష్యత్ కారిడార్లకు ఆధారం పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.