PM Modi Mohamed bin Zayed: మారుతున్న ప్రపంచ రాజకీయాలను నిశితంగా గమనిస్తున్న భారత్.. మరోవైపు పొరుగుఉన్న ఉన్న శత్రు దేశాలు అయిన పాకిస్తాన్, చైనా విషయంలోనూ వ్యాహాత్మక అడుగులు వేస్తోంది. ఇక చిన్న పెద్ద అని తేడా లేకుండా భవిష్యత్ అవసరాల దృష్ట్యా భారత ప్రధాని పలు దేశాల్లో పర్యటిస్తున్నారు. కీలక వాణిజ్య ఒప్పందాలు చేసుకుంటున్నారు. భారత వ్యాపారాన్ని విస్తరిస్తున్నారు. ఈ క్రమంలోనే బ్రిటన్, ఆస్ట్రేలియాలో కొత్త వాణిజ్య ఒప్పందాలు చేసుకున్నారు. తాజాగా ఓ విశిష్ట అతిథి భారత పర్యటనకు వచ్చారు. ప్రధాని మోదీ స్వయంగా ఎయిర్ పోర్టుకు వెళ్లి స్వాగతం పలికారు. ఇద్దరూ కలిసి ఒకే కారులో ప్రయాణించడం ఇప్పుడు ప్రపంచం దృష్టిని ఆకర్షించింది. ఆ విశిçష్ట అతిథి యూఏఈ అధ్యక్షుడు మొహమ్మద్ బిన్ జాయెద్. మోదీ జాయెద్ ఆత్మీయ ఆలింగనం, ఒకే వాహనంలో ప్రయాణం గతంలో రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో మాత్రమే సాగింది.
2 గంటల పర్యటన కీలక చర్చలు..
యూఏఈ అధ్యక్షుడు మొహమ్మద్ బిన్ జాయెద్ సోమవారం (జనవరి 19న) భారత్‌లో కేవలం రెండు గంటలు మాత్రమే పర్యటించారు. ఇరాన్–అమెరికా ఉద్రిక్తతలు, యెమెన్ సంక్షోభం, గాజా అశాంతి నేపథ్యంలో మోదీతో కీలక చర్చలు జరిపినట్లుల తెలిసింది. అయితే అధికారికంగా మాత్రం చర్చల వివరాలు వెల్లడించలేదు.
గల్ఫ్ దేశాలతోబలమైన భాగస్వామ్యం
యూఏఈ, సౌదీ, కతార్ వంటి దేశాలు భారత్‌కు 50% చమురు, సహజవాయువు సరఫరాదారులు. 90 లక్షల మంది భారతీయులు అక్కడ పనిచేస్తున్నారు. సౌదీ 100 బిలియన్ డాలర్లు, యూఏఈ 75 బిలియన్ డాలర్ల పెట్టుబడులు పెట్టారు. ఈ దేశాలు కాశ్మీర్‌ను భారత అంతర్గత విషయంగా గుర్తించడం పాకిస్తాన్‌కు తీవ్ర దెబ్బ. ఇస్లామిక్ దేశాలే అయినా.. పాకిస్తాన్‌కు దూరం అవుతూ భారతంతో సత్సంబంధాలు బలోపేతం చేసుకుంటున్నాయి. కతార్‌లో భారత నేవీ అధికారుల విడుదల దీనికి ఉదాహరణ.
చైనా ఆధిపత్యానికి చెక్..
భారత్ ఐఎంఈసీ(ఇండియా–మిడిల్ ఈస్ట్–యూరప్ ఆర్థిక మార్గం) ద్వారా చైనా బీఆర్‌ఐఆధిపత్యాన్ని ఎదుర్కొంటోంది. భారత్ నుంచి యూరప్‌కు సరుకుల ప్రయాణం 40% వేగవంతమవుతుంది. రైలు మార్గాలతోపాటు గ్రీన్ హైడ్రోజన్ పైప్‌లైన్లు, డేటా కేబుల్స్ ఏర్పాటు. అప్పుల బాధ్యత లేకుండా అన్ని దేశాలు సమాన భాగస్వాములు. ఇది చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్‌కు సవాల్. êరత్ ప్రపంచ వాణిజ్య హబ్‌గా ఎదుగుతుంది.
పశ్చిమ ఆసియా క్వాడ్ శక్తి
ఇండియా, ఇజ్రాయెల్, యూఏఈ, అమెరికా వాణిజ్యం, ఇంధనం, నీటి, రవాణా, అంతరిక్షం, ఆరోగ్యం, ఆహార భద్రతలో ఉమ్మడి ప్రాజెక్టులు. గల్ఫ్ సంబంధాలను చమురు మించి టెక్నాలజీ, భద్రత వైపు మలిచింది. యూఏఈలో 7 ఎమిరేట్లు (అబుదాబి, దుబాయ్, షార్జా మొదలైనవి) సమాఖ్య.
ఈ దౌత్య చర్యలు భారత్‌ను ప్రపంచ ఆర్థిక, భౌగోళిక రాజకీయాల్లో కీలకంగా నిలుపుతాయి. చైనా–పాక్ కూటమికి గట్టి సమాధానం. మోదీ ఆత్మీయత ఈ బంధాలను మరింత బలపరుస్తోంది.
