MH370 Flight: రెండు రోజుల క్రితం కంబోడియాకు చెందిన ఓ కార్గో విమానం హైజాక్‌కు యత్నించాడు ఓ అగంతకుడు. కానీ పైలట్ చాకచక్యంగా ఆకాశంలోనే గంటలపాటు తిప్పాడు. తర్వాత ఇంధనం అయిపోయిందని కిందకు దించి నిందితుడిని పట్టించాడు. అయితే 2014లో హైజాక్ అయిన ఓ విమానం ఇప్పటికీ దొరకలేదు. దాని కోసం సెర్చింగ్ కొనసాగుతోంది.
2014లో 239 మందితో
మలేషియా ఎయిర్‌లైన్స్‌కు చెందిన ఎంహెచ్ 370 విమానం 2014, మార్చి 8న 239 మంది ప్రయాణికులతో కౌలాలంపూర్ నుంచి బీజింగ్ దిశగా ప్రయాణం మొదలైంది. అయితే కొద్ది సేపటికి రాడార్ నుంచి సంబంధాలు తెగిపోయాయి. టేకాఫ్ తర్వాత 40 నిమిషాల్లో ట్రాన్స్‌పాండర్ మూతపడి, ఉపగ్రహ సిగ్నల్స్ ప్రకారం దక్షిణ భారత మహాసముద్రం వైపు 7 గంటలు ప్రయాణించింది.
సముద్రంలో కూలిందని..
అయితే విమానం సముద్రంలో కూలి ఉంటుందని భావించారు. దీంతో 50 విమానాలు, 60 ఓడలతో 1,20,000 చదరపు కిలోమీటర్ల ప్రాంతాన్ని గాలించారు. ఇందుకు 150 మిలియన్ డాలర్లు ఖర్చు చేశారు. కానీ ఇప్పటికీ విమానం జాడ దొరకలేదు. అయితే 2015లో రియూనియన్ దీపం సముద్ర తీరంలో ఒక రెండింగ్ ఫ్లాపరాన్, తర్వాత ఆఫ్రికా తీరాల్లో ముక్కలు లభించాయి, కానీ పూర్తి డెబ్రీలు దొరకలేదు.
తాజాగా గాలింపు..
మలేషియా ప్రభుత్వం డిసెంబర్ 30 నుంచి ఓషన్ ఇన్‌ఫినిటీ సంస్థతోమరోమారు విమానం కోసం ఆలించాలని నిర్ణయించిది. ఇందుకు 70 మిలియన్ డాలర్ల బడ్జెట్ కేటాయించింది. అమెరికా ఆధారిత మెరైన్ రోబోట్లు, డ్రోన్ సెన్సార్లతో సముద్రాంతర్గ ప్రాంతాలను స్కాన్ చేస్తారు.
పైలట్ జహారీ అహ్మద్ షా హోమ్ సిమ్యులేటర్ డేటా ప్రకారం ఉద్దేశపూర్వక మలుపు తీసుకున్నారని అనుమానాలు ఉన్నాయి. లేదా ఆక్సిజన్ సరఫురా, ఫైర్ సిస్టమ్ లోపాలు సాధ్యమని నిపుణులు చెబుతున్నారు. హైజాక్ లేదా సైబర్ దాడి అంశాలు కూడా చర్చలో ఉన్నాయి. ఈ ప్రయత్నం ఏవియేషన్ చరిత్రలోని అతిపెద్ద రహస్యంగా మారింది.