Pakistan Parliament: పాకిస్తాన్ గురించి నిత్యం ఏదో ఒక వార్త మీడియాలో కనిపిస్తూనే ఉంటుంది. ప్రపంచ దేశాలు అభివృద్ధి దిశగా సాగుతూ ఉంటే.. కొత్త కొత్త నిర్ణయాలు తీసుకొని బంగారు మయంగా మార్చుకోవాలి అనుకుంటుంటే.. పాకిస్తాన్ మాత్రం చిత్రమైన నిర్ణయాలు తీసుకుంటూ ఉంటుంది. ఆ నిర్ణయాలు కేవలం రాజకీయ నాయకుల జేబులు నింపడానికి మాత్రమే పనికి వస్తాయి. ప్రజలకు మేలు చేసే ఏ ఒక్క నిర్ణయం అక్కడి పరిపాలకులు తీసుకోలేరు.
పాకిస్తాన్ లో బాంబుల మోత నిత్యం కొనసాగుతూనే ఉంటుంది. హక్కుల హననం జరుగుతూనే ఉంటుంది. అక్కడ సాధన ప్రజలకు మాత్రమే కాదు, చట్టసభలకు కూడా భద్రత ఉండదు. ఇది అనేక సందర్భాల్లో నిరూపితమైంది. తాజాగా అక్కడ మరొక సంఘటన జరిగింది. ఇది కాస్త పాకిస్థాన్లో ఉన్న భద్రత లోపాలను బట్టబయలు చేసింది. వాస్తవానికి పాకిస్థాన్లో దాడులు, ప్రతి దాడులు, బాంబు మోతలు, తుపాకీలతో కాల్చివేతలు సర్వసాధారణమైనప్పటికీ.. ఈసారి మాత్రం అక్కడ భిన్నమైన సంఘటన చోటుచేసుకుంది.
పాకిస్తాన్లో చట్టసభలు ఉంటాయి. అక్కడి కార్యాలయాలను సెనెట్ లు అని పిలుస్తారు. అక్కడి సెనెట్ కార్యాలయంలో ఇటీవల సమావేశం జరుగుతుండగా.. ప్రజా ప్రతినిధులు తీవ్రమైన చర్చలో ఉండగా.. అందులోకి ఆకస్మాత్తుగా ఒక గాడిద వచ్చింది. గాడిద రావడమే కాదు, చట్టసభలో ఉన్న నాయకుల మీదికి దూసుకుపోయింది. దీంతో సెనెట్ లో ఉన్నవారు మొత్తం ఒక్కసారిగా భయభ్రాంతులకు గురయ్యారు. అంతేకాదు, ఏం చేయాలో తెలియక పరుగులు పెట్టారు.
ఈ వీడియో సోషల్ మీడియాలో కలకలం రేపుతోంది. కొంతమంది దీనిని కృత్రిమ మేధ ద్వారా రూపొందించారని అంటుంటే.. మరికొందరేమో ఇది నిజంగానే జరిగిందని పేర్కొంటున్నారు. ఏది ఏమైనప్పటికీ ఈ వీడియో పట్ల చాలామంది ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పాకిస్థాన్లో పరిస్థితి ఇంత దారుణంగా మారిపోయిందని వ్యాఖ్యానిస్తున్నారు. ప్రజలకు రక్షణ కల్పించాల్సిన వారు, మెరుగైన పరిపాలన అందించాల్సిన వారు దారి తప్పితే గాడుదులే చట్టసభల్లోకి వస్తాయని నెటిజన్లు వ్యంగ్యంగా పేర్కొంటున్నారు.
Pakistani Senate sees sudden entry of a unnamed senator in Parliament pic.twitter.com/pea5ez5m72
— THE UNKNOWN MAN (@Theunk13) December 4, 2025