spot_img
Homeఅంతర్జాతీయంPakistan Internal Conflict 2026: ఇంట్లో ఈగల మోత.. పాకిస్తాన్‌కు చుక్కలు చూపిస్తున్న టీటీపీ, బీఎల్‌ఏ...

Pakistan Internal Conflict 2026: ఇంట్లో ఈగల మోత.. పాకిస్తాన్‌కు చుక్కలు చూపిస్తున్న టీటీపీ, బీఎల్‌ఏ చుక్కలు

Pakistan Internal Conflict 2026: పాకిస్తాన్‌కు ఇంట్లో ఈగల మోత తప్పడం లేదు.ఉత్తరాన ఖైబర్‌ పఖ్తూన్ఖ్వాలో టీటీపీ (తెహ్రీక్‌–ఇ–తాలిబాన్‌ పాకిస్తాన్‌) దాడులు కొనసాగుతుండగా, నైరుతిన బలూచిస్తాన్‌లో బీఎల్‌ఏ (బలూచ్‌ లిబరేషన్‌ ఆర్మీ) వీరులు పాకిస్తాన్‌ సైన్యాన్ని చెల్లిచెదురు చేస్తున్నారు. మరోవైపు ఆఫ్గానిస్తాన్‌ దాడులు కొనసాగిస్తోంది. అంతర్గత సంక్షోభంతోపాటు ధరలు ప్రభావితం అవుతున్నాయి. అయినా పాకిస్తాన్‌ భారత్‌పై దాడులకు కుట్ర చేస్తోంది. తాజాగా మార్చి 30–31 తేదీల్లో కేవలం 36 గంటల్లో 30కి పైగా దాడులు జరిగాయి. ఇవన్నీ ’ఆపరేషన్‌ హెరాఫ్‌’లో భాగంగా జరిగాయని బీఎల్‌ఏ ప్రకటించింది.

క్వెట్టా మినహా మిగతాదంతా స్వతంత్రం?
బలూచిస్తాన్‌లో పాకిస్తాన్‌ పట్టు పూర్తిగా సడలిపోయింది. ప్రావిన్షియల్‌ రాజధాని క్వెట్టా మినహా మిగతా ప్రాంతమంతా బీఎల్‌ఏ, ఇతర బలూచ్‌ సంస్థల ఆధీనంలో ఉన్నట్లు సమాచారం. మార్చి 30–31 తేదీల్లో 36 గంటల్లో 30కి పైగా దాడులు జరిగాయి. గతంలో రెండు–మూడు రోజుల్లో 48 సైనిక స్థావరాలపై దాడులు జరిగాయి. పలుమార్లు ఈ రైలుపై దాడులు జరిగాయి, ప్రయాణికులు హత్యకు గురయ్యారు.

శంషీ ఎయిర్‌బేస్‌పై దాడి..
తాజా దాడుల్లో బలూచ్‌ వీరులు కీలకమైన లక్ష్యాలను ఛేదించారు. ఇక్కడ ఉన్న రాడార్‌ సిస్టమ్‌ను ధ్వంసం చేశారు. ఇది మొదటిసారి రాడార్‌ స్టేషన్‌పై దాడి చేసే శక్తి బీఎల్‌ఏకు వచ్చిందని నిరూపిస్తోంది. శంషీ ఎయిర్‌బేస్‌ గతంలో అమెరికా ఎయిర్‌బేస్‌గా ఉండేది.నురానీ రోడ్‌లోని పోలీస్‌ స్టేషన్‌పై దాడి జరిగింది, పలువురు గాయపడ్డారు. నురానీ రోడ్‌లోని మిలటరీ బేస్‌పై దాడి జరిగింది. క్వెట్టా ఈస్టర్న్‌ బైపాస్, వెస్టర్న్‌ బైపాస్‌ వద్ద నుంచి పంజాబ్‌కు గ్యాస్‌ సరఫరా చేసే పైప్‌లైన్‌లను బలూచ్‌ వీరులు ధ్వంసం చేశారు. ఒక్కో చోట 30 నిమిషాల నుంచి 60 గంటల వరకు కాల్పులు జరిగినా పాకిస్తాన్‌ సైన్యం సైలెంట్‌గా ఉండటం గమనార్హం.

ఖైబర్‌ పఖ్తూన్ఖ్వాలో టీటీపీ దాడులు
ఉత్తరాన ఖైబర్‌ పఖ్తూన్ఖ్వాలో టీటీపీ దాడులు కొనసాగుతున్నాయి. 2025 సెప్టెంబర్‌లో పాక్‌ సైన్యం, టీటీపీ మధ్య భీకర పోరులో 19 మంది జవాన్లు మృతి. 2025 అక్టోబర్‌లో మరో ఘర్షణలో 11 మంది సైనికులు మృతి. 2025 జూన్‌లో ఆత్మాహుతి దాడిలో 16 మంది జవాన్లు మృతి చెందారు. 2026 జనవరిలో 40 గంటల్లో జరిగిన ఘర్షణల్లో 145 మంది తీవ్రవాదులు, పదుల సంఖ్యలో భద్రతా సిబ్బంది, పౌరులు మృతి.

పాకిస్తాన్‌ పట్టు ఎందుకు సడలిపోయింది?
బలూచిస్తాన్‌లో పాకిస్తాన్‌ పట్టు కోల్పోవడానికి ప్రధాన కారణాలు. మొదటిది స్థానికుల ఆగ్రహం. బలూచిస్తాన్‌లో ఉన్న గ్యాస్, బొగ్గు, రాగి, బంగారం నిల్వలను పాకిస్తాన్‌ దోచుకుంటోంది. వేల మంది బలూచ్‌ యువకులను పాక్‌ సైన్యం నిర్బంధంగా అదృశ్యం చేసింది. స్థానికులకు ఉద్యోగాలు లేవు. బీఎల్‌ఏ వద్ద ఆధునిక ఆయుధాలు, డ్రోన్లు, ఐఈడీలు ఉన్నాయి. మహిళా సూసైడ్‌ బాంబర్లు మహిళా సూసైడ్‌ బాంబర్లతో దాడులు చేస్తోంది. 50 మందిని చంపిన మహిళా సూసైడ్‌ బాంబర్‌ దాడి జరిగింది. పాక్‌ సైన్యం కదలికలపై పూర్తి నిఘా ఉంది. మూడోది పాక్‌ సైన్యం బలహీనత. గత 6 నెలల్లో 700 మంది పాక్‌ సైనికులు మృతి. నిరంతరం దాడులతో సైనికుల మనోధైర్యం దెబ్బతింది. గ్యాస్‌ పైప్‌లైన్లు, రోడ్లు ధ్వంసం కావడంతో సరఫరాలు నిలిచిపోయాయి.

బలూచిస్తాన్, ఖైబర్‌ పఖ్తూన్ఖ్వాలో పాకిస్తాన్‌ పట్టు పూర్తిగా సడలిపోయింది. క్వెట్టా మినహా మిగతా ప్రాంతమంతా బలూచ్‌ వీరుల ఆధీనంలో ఉంది. గ్యాస్‌ పైప్‌లైన్లు, ఎయిర్‌బేస్‌లు, రాడార్‌ స్టేషన్లు ధ్వంసం కావడం పాకిస్తాన్‌ రక్షణ వ్యవస్థ కుప్పకూలిందని నిరూపిస్తోంది.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version