Pakistan Terrorist Leader Deaths: దురంధర్ సినిమాను భారతీయ థియేటర్లలో రన్ అవుతోంది, పార్ట్ 2 పది రోజుల్లోనే రికార్డుస్థాయిలో వసూళ్లు రాబట్టింది. ఈ సినిమాను పాకిస్తాన్ నిషేధించింది. కానీ పాకిస్తాన్లో దురంధర్ ఆపరేషన్లు నిజంగానే జరుగుతున్నాయి. లష్కర్–ఎ–తొయిబా, జైష్–ఎ–మహ్మద్, హిజ్బుల్ ముజాహిద్దీన్, ఐఎస్కేపీ వంటి ఉగ్ర సంస్థల కీలక నేతలు వరుసగా అజ్ఞాతులు చేతిలో మరణిస్తున్నారు. పాకిస్తాన్ ప్రభుత్వం ఈ మరణాలపై మౌనం వహిస్తోంది, కారణాలు వెల్లడించడం లేదు.
మసూద్ అజర్ కుటుంబానికి భారీ దెబ్బ
తాజాగా జైష్–ఎ–మహ్మద్ అధినేత మౌలానా మసూద్ అజర్ సోదరుడు మొహమ్మద్ తాహెర్ అన్వర్ (అబూ తాహెర్ అన్వర్) బహవల్పూర్లో మరణించాడు. ఉగ్ర సంస్థ అధికారిక ఛానెల్ ద్వారా మరణ వార్తను ధ్రువీకరించింది, కానీ మరణ కారణాన్ని మాత్రం బయటపెట్టలేదు. మార్చి 31న రాత్రి జామియా మసీదు ఉస్మాన్ వలీలో అంత్యక్రియలు జరిగాయి.
ఎవరీ తాహెర్ అన్వర్?
తాహెర్ అన్వర్ జైష్ సైనిక వ్యవహారాలను చూసుకునే బాధ్యతలు నిర్వహించేవాడు. 2001 పార్లమెంట్ దాడి, 2016 పఠాన్‌కోట్, 2019 పుల్వామా దాడుల్లో ఈతని పాత్ర కీలకం. 2025 మేలో జరిగిన ఆపరేషన్ సిందూర్‌లో మసూద్ అజర్ కుటుంబానికి చెందిన 14 మంది చనిపోయారు. తాహెర్ అన్వర్ ఆ దాడి నుంచి తప్పించుకున్నాడు, కానీ ఇప్పుడు మరణించడం ఉగ్ర శిబిరాల్లో కలకలం రేపుతోంది.
లష్కర్–ఎ–తొయిబా నేతల వరుస మరణాలు
హాఫీజ్ సయ్యిద్ నాయకత్వంలోని లష్కర్–ఎ–తొయిబా కూడా భారీ నష్టాన్ని చవిచూసింది. బిలాల్ ఆరిఫ్ సరాఫి ్ఢ మార్చి 20, 2026 ్ఢ మురిద్కే, లాహోర్ ్ఢ కుటుంబ కలహాలు/హత్యకు గురయ్యాడు. దీంతో ఇతర కమాండర్లు అజ్ఞాతంలోకి వెళ్లారు. మురిద్కేలోని లష్కర్ ఎ తోయిబా ప్రధాన కార్యాలయం ధ్వంసమైన తర్వాత ఈ హత్య జరగడం గమనార్హం.
ఉగ్ర సంస్థలపై ఒత్తిడి..
వరుస మరణాలతో జైష్–ఎ–మహ్మద్, లష్కర్–ఎ–తొయిబా టాప్ లీడర్లు అండర్గ్రైండ్కు వెళ్తున్నారు. ఎవరు చంపుతున్నారో తెలియక ఉగ్రవాదులు ఒకరినొకరు నమ్మడం మానేశారు. 2025 మే 7న భారత్ జరిపిన ఈ ఆపరేషన్‌లో బహవల్పూర్లోని జైష్ హెడ్‌క్వార్టర్స్ (జామియా మసీదు సుబ్హాన్ అల్లాహ్) ధ్వంసమైంది. హిజ్బుల్ ముజాహిద్దీన్, ఐఎస్కేపీ సంస్థల ఆపరేటర్లు కూడా లక్ష్యంగా మారార.
పాకిస్తాన్ మీడియా మౌనం
పాకిస్తాన్ మీడియా ఈ మరణాలపై విస్తతంగా కవర్ చేయడం లేదు. కేవలం ‘మరణించారు‘ అనే వార్త మాత్రమే బయటకు వస్తోంది, కారణాలు మాత్రం దాచిపెట్టబడుతున్నాయి.. సోషల్ మీడియాలో మాత్రం ఈ వార్తలు వైరల్ అవుతున్నాయి.
దురంధర్ సినిమాలో చూపించినట్లుగానే, పాకిస్తాన్లో ఉగ్రవాదులు ఇప్పుడు తమకే లక్ష్యంగా మారారు. మసూద్ అజర్ కుటుంబానికి 15వ దెబ్బ తగలడం, లష్కర్ కమాండర్ల హత్యలు ఉగ్ర ముఠాలను అస్తవ్యస్తం చేశాయి. పాకిస్తాన్ ప్రభుత్వ మౌనం ఈ మరణాల వెనుక ఉన్న రహస్యాన్ని మరింత పెంచింది.
