iPhone : గూగుల్ కూడా ఇప్పుడు యాపిల్‌ను కాపీ కొడుతోందా ఏంటి.. ఆండ్రాయిడ్ ఫోన్లు వాడుతున్న యూజర్లకు త్వరలోనే ఐఫోన్‌లో ఉండే ఒక సూపర్ ఫీచర్ రాబోతోంది. గత చాలా ఏళ్లుగా ఐఫోన్‌లో ఉన్న బ్యాటరీ హెల్త్ ఫీచర్‌ను ఇప్పుడు ఆండ్రాయిడ్ 16లో యూజర్ల కోసం యాడ్ చేస్తున్నారు. అసలు ఈ ఫీచర్ ఏం చేస్తుంది? ఇది ఏయే ఫోన్లలో వస్తుంది? వివరంగా ఈ కథనంలో తెలుసుకుందాం.
ఈ కొత్త ఫీచర్‌ను ఆండ్రాయిడ్ 16 బీటా 3 వెర్షన్‌లో గుర్తించారు. ఇది మీ ఫోన్ బ్యాటరీ మాగ్జిమమ్ బ్యాటరీ కెపాసిటీ(maximum battery capacity), బ్యాటరీ హెల్త్ స్టేటస్ గురించి సమాచారం అందజేస్తుంది. మీ ఫోన్ బ్యాటరీ బ్యాకప్ హఠాత్తుగా తగ్గిపోవడానికి కారణం ఏంటో తెలుసుకోవడానికి ఇది ఒక మంచి డయాగ్నొస్టిక్ టూల్ లాంటిది.
Also Read : ఐఫోన్ యూజర్లకు గుడ్ న్యూస్.. ట్రూకాలర్‌కు పోటీగా ఆపిల్ కొత్త యాప్!
ఈ యూజర్లకు మాత్రమే ఈ ఫీచర్!
మీడియా రిపోర్ట్స్ ప్రకారం, ఈ ఫీచర్ త్వరలోనే పిక్సెల్ స్మార్ట్‌ఫోన్లు వాడుతున్న యూజర్లకు అందుబాటులోకి రానుంది. ఒకవేళ మీరు పిక్సెల్ 8ఏ, పిక్సెల్ 9, పిక్సెల్ 9 ప్రో లేదా పిక్సెల్ 9 ప్రో ఫోల్డ్ వాడుతుంటే త్వరలోనే కంపెనీ మీకోసం అప్‌డేట్ విడుదల చేయనుంది. అయితే, పాత పిక్సెల్ మోడల్స్ అయిన పిక్సెల్ 8, పిక్సెల్ 8 ప్రో వాడుతున్న యూజర్లకు మాత్రం కొన్ని లిమిట్స్ వల్ల ఈ అప్‌డేట్ రాదని గూగుల్ డెవలపర్ కన్ఫర్మ్ చేశారు. ఈ కొత్త ఫీచర్ రాని వాళ్లకు కాస్త నిరాశ కలగవచ్చు.
యాపిల్ ఐఫోన్‌లో ఈ ఫీచర్ ఎప్పటినుంచి ఉందో తెలుసా?
యాపిల్ ఐఫోన్‌లో అయితే 2018లో iOS 11.3 వచ్చినప్పటినుంచే బ్యాటరీ హెల్త్ ఫీచర్ ఉంది. కానీ గూగుల్ తీసుకొస్తున్న ఈ కొత్త అప్‌డేట్ మాత్రం చాలా లిమిటెడ్‌గా ఉంది. ఈ ఫీచర్ ప్రస్తుతం టెస్టింగ్ దశలో ఉంది. కానీ రాబోయే నెలల్లో ఆండ్రాయిడ్ 16 స్టేబుల్ అప్‌డేట్‌తో పాటు, సపోర్ట్ చేసే స్మార్ట్‌ఫోన్లలో ఈ ఫీచర్ అందుబాటులోకి వస్తుంది.
ఇతర స్మార్ట్‌ఫోన్లలో కూడా ఈ ఫీచర్ వస్తుందా?
ఆండ్రాయిడ్ 16లో రాబోతున్న ఈ కొత్త ఫీచర్ ఇతర స్మార్ట్‌ఫోన్ యూజర్లకు కూడా వస్తుందా లేదా అనే దానిపై ప్రస్తుతం ఎలాంటి క్లారిటీ లేదు. కానీ శామ్‌సంగ్, వన్‌ప్లస్ వంటి కంపెనీలు ఇప్పటికే తమ ఆండ్రాయిడ్ స్కిన్‌లో యూజర్ల కోసం బ్యాటరీ హెల్త్ టూల్ లాంటి ఫీచర్లను అందిస్తున్నాయి.
Also Read : యాపిల్ కేరాఫ్ ఇండియా.. ఇక అన్ని ఫోన్లు ఇక్కడే!