Pakistan Indian Roots: మాది ముస్లిం దేశం. మాది ముస్లిం వ్యవహార శైలి.. మేము ఇస్లాం వ్యవహారాలను పాటిస్తూ ఉంటాం. మాకు అల్లా బోధనలు నిత్య కృత్యం.. ఖురాన్ మాకు అత్యంత పరమ పవిత్రం.. ఇదిగో ఇలా సాగిపోతుంటాయి పాకిస్తాన్ పాలకులు.. ఇతర వ్యక్తులు చెప్పే మాటలు. కానీ ఇస్లాం దేశాలకు.. పాకిస్తాన్ కు చాలా తేడా ఉంటుంది.
పాకిస్తాన్ పాలకులు చెబుతున్నట్టు అరబ్ సంస్కృతి ఉండదు. అలాగని మక్కా మదీనా మాదిరిగా వ్యవహారాలు కూడా వ్యవహారాలు సాగవు. దక్షిణాసియా మాదిరిగా ఇస్లాం మతం అక్కడ కనిపించదు. స్థూలంగా చెప్పాలంటే పాకిస్తాన్ థర్డ్ రేట్ అరబ్ కూడా కాదు. ముమ్మాటికి ఇండియన్ సంస్కృతి కనిపిస్తూ ఉంటుంది. పాకిస్తాన్ మన దేశం నుంచి వేరు పడిపోయింది. అంతేతప్ప మన మూలాల నుంచి కాదు.
పాకిస్తాన్ దేశంలో ప్రతి నగరాన్ని తరచి చూస్తే భారతీయ మూలాలు కనిపిస్తాయి.. కాకపోతే ఇస్లాం చాందసవాదులు పాకిస్తాన్ కోసం అనేక రకాలుగా మార్పు తీసుకొచ్చారు. ఈ క్రమంలో మెజారిటీ మతంగా వ్యాప్తి చెందిన హిందూ సంస్కృతిని నాశనం చేయడానికి అనేక రకాలుగా ప్రయత్నాలు చేశారు. కాకపోతే వారు పూర్తిస్థాయిలో విజయం సాధించలేకపోయారు. ఇప్పుడు పాకిస్తాన్ తన మూలాలను వెతుక్కునే పనిలో పడింది. ఆ మూలాలు కనుక వెలుగులోకి వస్తే పాకిస్తాన్ ప్రపంచం ముందు తలవంచుకునే పరిస్థితి ఏర్పడుతుంది.
ఇటీవల లాహోర్ నగరంలో అక్కడ హెరిటేజ్ ను కాపాడుకునేందుకు.. చరిత్రను పరిరక్షించుకునే పనులు చేస్తున్నారు. పాకిస్తాన్లో లాహోర్ అనేది అత్యంత కీలకమైన నగరం. ఈ నగరంలో ఉన్న ఇస్లాంపూర అనే ప్రాంతాన్ని కృష్ణా నగర్ గా మార్చేశారు. బాబ్రీ మసీద్ ప్రాంతాన్ని జైన్ మందిర్ గా మార్చారు. రెహమాన్ గల్లీ కాస్త రామ్ గల్లి అయిపోయింది. ఫాతిమా జీనా రోడ్డు క్వీన్స్ రోడ్డు అయిపోయింది.. మిగతా ప్రాంతాలకు కూడా పేర్లు మార్చే ప్రక్రియ అక్కడ జోరుగా సాగుతోంది. దీనికోసం 50 బిలియన్ పాకిస్తాన్ రూపాయలను ఖర్చు పెడుతున్నారు. గత ఎడాది మాజీ ప్రధానమంత్రి నవాజ్ షరీఫ్ కుమార్తె మరియం నవాజ్ లాహర్లో ఈ పనికి శ్రీకారం చుట్టగా.. ఇన్నాళ్లకు అది కార్యరూపం దాల్చింది. మరియం పంజాబ్ ముఖ్యమంత్రిగా కొనసాగుతున్నారు.
ఇటీవల కాలంలో మన దేశంలో త్రివేండ్రం పేరు కాస్త తిరువనంతపురం అయింది.. కలకత్తా పేరు కాస్త కోల్కతా అయింది. కేరళ పేరు కాస్త కేరళం అయిపోయింది.. ఇలా భారతదేశంలో మూలాలను పరిరక్షించుకునే పని మొదలైన నేపథ్యంలో.. పాకిస్తాన్ కూడా హెరిటేజ్ ను కాపాడుకునేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టింది. ఇంతవరకు బాగానే ఉన్నప్పటికీ లాహోర్లో ఈ ప్రాంతాలను పేరు మార్చడం పట్ల ముస్లిం మత ఛాందసవాదులు రంగంలోకి వచ్చారు. ఇలా పేర్లు మార్చి లాహోర్ నగరాన్ని పూర్తిగా భారతదేశంలో విలీనం చేస్తున్నారని ఆరోపిస్తున్నారు.
అక్కడ కొద్దిరోజులుగా ఉద్యమాలు కూడా మొదలయ్యాయి. దీనిపై పంజాబ్ ముఖ్యమంత్రి మరియం వెనక్కి తగ్గడం లేదు.. ఆమెకు పాకిస్తాన్ ప్రధానమంత్రి సపోర్టు ఉంది. అయితే ఇది ఎక్కడదాకా దాడి తీస్తుందో తెలియదు గానీ.. పాకిస్తాన్ చేస్తున్న పని వల్ల ఇప్పుడు ఆ దేశ మూలాలు ప్రపంచానికి తెలిసే అవకాశం ఉంది. ఇన్నాళ్లపాటు భారత్ మీద నిత్యం విషం చిమ్మి.. లేనిపోని ప్రచారాలు చేసిన పాకిస్తాన్ పాలకులు.. వారికి అనుకూలంగా ఉండే ఉగ్రవాదులు ఇప్పుడు ప్రపంచం ముందు తల వంచుకోవలసిన పరిస్థితి ఏర్పడుతుందని అంతర్జాతీయ విశ్లేషకులు అంటున్నారు.
