Pakistan Nuclear Weapons Threat To World: ఇరాన్ వద్ద అణ్వాయుధాలు ఉండటం ప్రపంచానికి ప్రమాదమని అమెరికా చెబుతోంది. అందుకే యుద్ధం ప్రారంభించామంటోంది. అయితే యుద్దం మొదలైన కొన్ని రోజులకు అమెరికా ఇంటలిజెన్స్ ఏజెన్సీ ఇరాన్ వద్ద అణ్వాయుధాలు లేవని నివేదిక ఇచ్చింది. యురేనియం నిల్వలు ఉన్నట్లు పేర్కొంది. దీంతో ట్రంప్ ఇప్పుడు ఆ యురేనియం అప్పగించాలంటున్నాడు. ఇస్లామిక్ దేశాల వద్ద అణ్వాయుధాలు ప్రమాదకరమని అమెరికా భావన. కానీ ఇస్లామిక్ దేశాలైన పాకిస్తాన్, ఇజ్రాయెల్ వద్ద కూడా అణ్వాయుధాలు ఉన్నాయి. ఇజ్రాయెల్ అణ్వాయుధాల ప్రయోగం గురించి ఎప్పుడూ మాట్లాడదు. పాకిస్తాన్ మాత్రం తమ అణ్వాయుధాలను చూపించి బెదిరిస్తోంది. పాకిస్తాన్ వద్ద ఉన్న అణ్వాయుధాలు మరింత ప్రమాదకరమని అమెరికా ఇంటెలిజెన్స్ స్వయంగా ఒప్పుకున్నప్పటికీ చర్యలు తీసుకోవడం లేదు. ఫ్లోరిడాలో పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ఫీల్డ్ మార్షల్ ఆసిమ్ మునీర్ ‘తమ వద్ద అణ్వాయుధాలు ఉన్నాయి, తమ జోలికి వస్తే దాడి చేస్తాం’ అని బెదిరించారు. ఇది అమెరికా ద్వంద్వ వైఖరిని బహిర్గతం చేస్తోంది.
Also Read: 27 కోట్లు పెట్టి కొంటే.. నిండా ముంచాడు.. పాపం ఆయన కష్టం పగవాడికి కూడా రావద్దు
అమెరికా ద్వంద్వం విధానం..
అమెరికా అణ్వాయుధ విషయంలో ద్వంద్వ వైఖరి అవలబిస్తోంది ‘ఇస్లామిక్ దేశాల చేతిలో అణ్వాయుధాలు ప్రమాదకరం‘ అని చెప్పి యుద్ధం చేస్తోంది. తమ ఇంటెలిజెన్స్ ‘పాకిస్తాన్ అణ్వాయుధాలే ప్రమాదకరం‘ అని ప్రకటించినా చర్యలు లేవు. పాకిస్తాన్ అణ్వాయుధాలు ఉన్నాయని అధికారికంగా ప్రకటించింది. పాకిస్తాన్ వద్ద అణ్వాయుధాలు ఫీల్డ్ మార్షల్ చేతిలో ఉంటాయి. భారత్ అణ్వాయుధాలు సెంట్రలైజ్డ్ చేయబడి ఉంటాయి. అంటే పాకిస్తాన్ సైనికాధికారి చెబితే ఏ దేశంపైన అయినా ప్రయోగించే ప్రమాదం ఉంది.
ఎందుకు ప్రమాదకరం?
అమెరికా ఇంటెలిజెన్స్ పాకిస్తాన్ అణ్వాయుధాలను ప్రమాదకరంగా చూస్తోంది. ఎందుకంటే ఆర్మీ చేతిలోనే ఆపరేటింగ్ సిస్టం ఉండడం. ఫ్లోరిడాలో ఆసిమ్ మునీర్ ‘ఎవరైనా జోలి చేస్తే దాడి చేస్తాము‘ అని బెదిరించారు. ఇస్లామిక్ ఉగ్రవాదులు అణ్వాయుధాలపై చేతిపెట్టే అవకాశం ఉంది. తక్కువ సాంకేతికత, పాకిస్తాన్ రాజకీయ అస్థిరత వల్ల ప్రమాదం. భారత్ ‘నో ఫస్ట్ యూస్‘ పాలసీకి కట్టుబడి ఉంది. ఎప్పుడైనా ఉపయోగించవచ్చు. ఆర్మీ చీఫ్ అధికారం.
అమెరికా తర్వాత లక్ష్యం పాకిస్తాన్?
ఇరాన్ యుద్ధం తర్వాత అమెరికా పాకిస్తాన్‌పై దృష్టి పెట్టనుందని తెలుస్తోంది. పాకిస్తాన్ అణ్వాయుధాలు ప్రమాదకరమని అమెరికా ఇంటెలిజెన్స్ వెల్లడించింది. తాలిబాన్, అల్–ఖైదాతో పాకిస్తాన్‌కు లింక్‌లు ఉన్నాయి. పాకిస్తాన్ చైనా మిత్రుడు. అమెరికాకు వ్యతిరేకి. అందుకే అమెరికా వద్ద కూడా అణ్వాయుధాలు లేకుండా చేసే అవకాశం ఉంది.
అమెరికా మిత్రరాజ్యాల అణ్వాయుధాలను సమస్యగా భావించడం లేదు. శత్రువులది మాత్రమే ప్రమాదం అన్నట్లు ద్వంద్వ విధానాలు అవలంబిస్తోంది. పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ బెదిరింపులు, అణ్వాయుధాలు, ఉగ్రవాద లింక్‌లు అమెరికాకు మంచిది కాదు. భారత్‌తో మైత్రి పెరుగుతున్న నేపథ్యంలో పాకిస్తాన్‌పై ఒత్తిడి పెరిగే అవకాశం ఉంది. ప్రపంచ అణ్వాయుధ విస్తరణను ఆపాలంటే అమెరికా మొదట తన ద్వంద్వాన్ని మానాలి.
