Pakistan: ఏదైనా ఒక విషయాన్ని నేరుగా చెబితే నమ్మనివారు.. సోషల్ మీడియాలో ఒక పోస్టు రాగానే స్పందించేవారు ఎక్కువగా ఈ కాలంలో ఉన్నారు. అందుకే ప్రజల్లో ఉన్న కొందరి మనస్తత్వాలను మార్చడానికి కొందరు సోషల్ మీడియా ద్వారా ప్రచారం చేస్తూ ఉంటారు. అది మంచైనా.. చెడైనా.. ఈ మార్గాల ద్వారా ప్రచారం చేస్తే మనుషుల మనసులు మారుతాయని వారు నమ్ముతారు. ఇదే విధానాన్ని ఇప్పుడు పాకిస్తాన్ పాటిస్తోంది. భారత్లో ఉన్న కొందరి మనస్తత్వాలను మార్చడానికి పాకిస్తాన్ కొత్త ఎత్తుగడలు వేస్తోంది. ఇందులో భాగంగా సోషల్ మీడియాను ఎంచుకొని పోస్టులు పెడుతుంది. మరి ఆ ప్రచారం ఏంటో ఇప్పుడు చూద్దాం..
భారత్, పాకిస్తాన్ మధ్య పుల్వామా సంఘటన విషయంలో యుద్ధం జరిగిందని మనందరికీ తెలిసిందే. ఈ సమయంలో అమెరికా మధ్యవర్తిత్వం గా ఉండి ఇది దేశాలను శాంత పరిచాయని ప్రచారం జరిగింది. అయితే ఇది నిజమో.. కాదో తెలియదు. కానీ రెండు దేశాల మధ్య యుద్ధం అయితే ఆగిపోయింది. ఆ తర్వాత అమెరికా, భారత్ మధ్య వ్యతిరేక పవనాలు వీచాయి. పాకిస్తాన్ మాత్రం తమ పెద్దన్న అమెరికా అని అంటూ ప్రచారం చేసుకుంది. అంటే పాకిస్తాన్ దేశానికి అమెరికా పూర్తిగా అండగా ఉంటుందని అర్థమైంది. అంతేకాకుండా పాకిస్తాన్లో అవసరమైన నిధులు అమెరికానే ఇస్తుందని కూడా కొందరు ప్రచారం చేస్తుంటారు.
వాస్తవానికి పాకిస్తాన్ దేశానికి సొంతంగా ఎటువంటి ఉత్పత్తి, ఆదాయ వనరులు లేవు. ఇతర దేశాలపై ఆధారపడి జీవించడమే. ఇలాంటి సమయంలో ఆర్థికంగా ఉన్నత స్థితిలో ఉన్న దేశాలతో డీల్ కుదుర్చుకున్నట్లు ప్రచారం చేస్తోంది. ఇటీవల పాకిస్తాన్ దేశం జర్మనీతో ఒప్పందాలు చేసుకున్నట్లు ప్రచారం చేసింది. ఇది అసత్య ప్రచారం అని కొందరు మేధావులు నమ్మారు. కానీ భారత్ లోనే ఉంటూ పాకిస్తాన్ దేశానికి సపోర్ట్ చేసే వారు మాత్రం ఇది నిజమే అంటూ ఈ విషయాన్ని మరింతగా ప్రచారం చేస్తున్నారు. దీంతో కొందరి మనస్తత్వాలు భవిష్యత్తులో పాకిస్తాన్ అభివృద్ధి చెందే అవకాశం ఉంటుందని నమ్ముతున్నట్లు తెలుస్తోంది. అందుకే కొందరు ఇలాంటి పోస్టులను విపరీతంగా షేర్ చేస్తున్నారు.
గత 50 ఏళ్లుగా పాకిస్తాన్ సొంతంగా ఎటువంటి అభివృద్ధి చెందలేదని తెలుస్తోంది. పాకిస్తాన్తో సమానంగా విడిపోయిన భారత్ మాత్రం ప్రపంచ దేశాలతో పోటీపడుతుంది. ఇలాంటి నేపథ్యం ఉన్న పాకిస్తాన్ భవిష్యత్తులో ఎలా అభివృద్ధి చెందుతుందని మరి కొందరు కామెంట్లు చేస్తున్నారు. అంతేకాకుండా భారత్ లో లేదా ఇతర దేశాల్లో ఉన్న వారిని మచ్చిక చేసుకునేందుకు ఇలా అసత్య ప్రచారం చేస్తూ పాకిస్తాన్ దేశం కొత్త ఎత్తుగడ వేస్తున్నట్లు కొందరు నిపుణులు అంటున్నారు. అయితే ఇందులో కొందరు అమాయకులైన వారు నమ్మే ప్రమాదముంది. మీరు ఇలాంటి పోస్టులకు రియాక్ట్ అయి పాకిస్తాన్ కు సపోర్ట్ చేసి చిక్కుల్లో పడే అవకాశం ఉంది. అందువల్ల పాకిస్తాన్ చేసే ఏ ప్రచారం అయిన నమ్మే అవసరం లేదు. ఎందుకంటే పాకిస్తాన్లో ప్రస్తుతం ఆహార కొరత తీవ్రంగా ఉంది. తినడానికి తిండి దొరకని పరిస్థితి ఏర్పడింది. వస్తువుల ధరలు విపరీతంగా ఉన్నాయి. సొంతంగా ఆర్థిక సంక్షోభం నుంచి ఎదుర్కొనే ప్రయత్నాలు ప్రారంభించని పాకిస్తాన్ దేశం విదేశాలతో కొత్త ఒప్పందాలు చేసుకోవడం ఎలా అనే సందేహం వస్తోంది… అని అంటున్నారు.