Homeఅంతర్జాతీయంPakistan Vs Afghanistan: అప్ఘనిస్తాన్‌ పై యుద్ధానికి దిగిన పాకిస్తాన్‌

Pakistan Vs Afghanistan: అప్ఘనిస్తాన్‌ పై యుద్ధానికి దిగిన పాకిస్తాన్‌

Pakistan Vs Afghanistan: పాకిస్తాన్‌ బరి తెగించింది. మొన్నటి వరకు కుక్కిన పేనులా పడి ఉండే పాకిస్తాన్‌.. ఇప్పడు ఇటు అమెరికా.. అటు ఇస్లామిక్‌ నాటో అండ చూసుకుని రెచ్చిపోతోంది. ఇటు భారత్‌తో కయ్యానికి లాలుదువ్వుతోంది. భారత్‌కు మిత్రదేశంగా మారుతున్న ఆఫ్గానిస్తాన్‌ను టార్గెట్‌ చేసింది. మొన్నటి వరకు తన మిత్ర దేశంగా భావించిన ఆఫ్గానిస్తాన్‌.. ఇప్పుడు భారత్‌ అనుకూల వైఖరి అవలంబించడాన్ని పాకిస్తాన్‌ జీర్ణించుకోలేకపోతోంది. ఈ క్రమంలోనే తాజాగా ప్రత్యక్ష యుద్ధానికి దిగింది. ఆఫ్గానిస్తాన్‌ రాజధాని కాబూల్‌ పరిసరాల్లో దాడులకు తెగబడింది. పాకిస్తాన్‌ వైమానిక దళం సభ్యులు తెహ్రీక్‌–ఇ–తాలిబాన్‌ పాకిస్థాన్‌ (టీటీపీ) ఉగ్రవాద శిబిరాలను లక్ష్యంగా చేసుకున్నారని సమాచారం. ఈ దాడుల లక్ష్యం పాక్‌ భద్రతా బలగాలపై వరుసగా దాడులు జరపుతున్న టీటీపీ మిలిటెంట్లని స్థానిక వర్గాలు చెబుతున్నాయి.

పాక్‌ ఆరోపణలు..
ఇటీవల పాక్‌ రక్షణ మంత్రి చేసిన వ్యాఖ్యల్లో, కాబూల్‌లోని తాలిబాన్‌ ప్రభుత్వం టీటీపీ మిలిటెంట్లకు ప్రత్యక్ష సహకారం అందిస్తున్నదనే స్పష్టమైన ఆరోపణలు ఉన్నాయి. ఈ ఉగ్రవాదులకు అఫ్గాన్‌ భూభాగాన్ని ఆశ్రయంగా ఉపయోగించుకుంటున్నారని, పాక్‌ భద్రతను సవాలు చేస్తున్నారని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో, దాడులు పాక్‌ భూభాగ రక్షణ చర్యలో భాగంగా ఉన్నాయని పాక్‌ వర్గాలు చెబుతున్నాయి. అఫ్గాన్‌ ప్రభుత్వం ఈ వైమానిక దాడులను అంతర్జాతీయ చట్టాలకు విరుద్ధంగా పేర్కొంది. కాబూల్‌ పైన జరిగిన పేలుళ్లు పౌరులను భయభ్రాంతులకు గురిచేశాయి. తాలిబాన్‌ వర్గాలు కూడా పాక్‌ తరఫు చర్యను ఆగ్రహంగా ఖండించాయి. అయితే, తాలిబాన్‌ అనుబంధ వనరులు తమ దేశంలో టీటీపీ కార్యకలాపాలు లేవని, పాక్‌ చేసే ఆరోపణలు రాజకీయ పన్నాగంగా ఉన్నాయని వాదిస్తున్నాయి.

టీటీపీ చీఫ్‌ ఆరోగ్యంపై గందరగోళం
వైమానిక దాడుల్లో తాను మరణించాడనే వార్తలపై టీటీపీ నాయకుడు ముఫ్రీ నూర్‌ మెహ్సూద్‌ స్పందిస్తూ, తాను సురక్షితంగా ఉన్నానని తెలిపారు. పాక్‌ సైన్యం ఉద్దేశపూర్వకంగా ఈ తరహా వార్తలను వ్యాప్తి చేస్తోందని ఆయన వ్యాఖ్యానించారు. ఇది తాలిబాన్‌ అనుబంధ జాలాల్లో మరింత చర్చకు దారితీసింది. దాడులు ఆపకపోతే.. యుద్ధం తప్పదని హెచ్చరించారు. తాజాగా పరిణామాలను భారత్‌ కూడా నిశితంగా గమనిస్తోంది.

పాకిస్తాన్‌ దాడులు దక్షిణ ఆసియా భద్రతా సమీకరణంపై ప్రభావం చూపే అవకాశం ఉంది. పాక్‌ – ఫ్గాన్‌ తాలిబాన్‌ మధ్య బంధం గత సంవత్సరంలో క్షీణించగా, ఇప్పుడు అది రాజకీయ ఉద్రిక్తతగా మారింది. పాకిస్తాన్‌ అంతర్గత భద్రతను సవాల్‌ చేస్తోంది. ఈ నేపథ్యంలో ఇలాంటి దాడులు ప్రాంతీయ స్థిరత్వాన్ని మరింత సంక్లిష్టం చేసే అవకాశం ఉంది. ఈ పరిణామాలు ఇరు దేశాల సరిహద్దు రాజకీయాలను కూడా సంక్లిష్టం చేసే అవకాశం ఉంది.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version