Khawaja Asif Controversial Comments: అప్పులు చేస్తేగానీ పూటగడవని స్థితిలో ఉన్న పాకిస్తాన్‌కు గల్ఫ్ యుద్ధం మరింత సమస్యగా మారింది. చమురు సంక్షోభంతో వీకెండ్లో లాక్డౌన్ విధిస్తోంది. మరోవైపు సౌదీ అరేబియా ఇచ్చిన అప్పులు తిరిగి ఇవ్వాలని ఒత్తిడి చేస్తోంది. మరోవైపు చైనా విద్యుత్ బిల్లుల బకాయిల కోసం ఒత్తిడి చేస్తున్నాయి. ఇక ఆఫ్గానిస్తాన్‌తో యుద్ధం.. ఖైబర్ ఫఖ్తూఖ్వా గొడవలు, బలూచిస్తాన్ తిరుగుబాటు పాకిస్తాన్‌ను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో పాక్ ప్రజల్లో పాలకులపై వ్యతిరేకత పెరుగుతోంది. ప్రజల దృష్టి మళ్లించేందుకు పాలకులు భారత్‌పై పిచ్చికూతలు కూస్తున్నారు. భారత్‌లోకి వచ్చి దాడి చేస్తామని పాకిస్తాన్ మంత్రి ఖవాజా ఆసిఫ్ తాజాగా చేసిన వ్యాఖ్యలు హాస్యాస్పదంగా మారాయి. దేశాన్ని నడపడానికి అప్పుల కోసం అల్లాడుతున్న పాకిస్తాన్‌కు, భారత్ వంటి అగ్రగామి దేశాన్ని ఎదుర్కొనే ఆర్థిక స్తోమత ఎక్కడుంది? ప్రస్తుతం పాకిస్తాన్ దివాలా తీసే పరిస్థితిలో ఉంది.
భారత్ ఆర్థికం, సైనిక శక్తిలో అగ్రగామి..
భారత్ ప్రస్తుతం ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థ. 5 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా ఎదిగి, సైనికంగా కూడా శక్తివంతంగా మారింది. అత్యాధునిక ఆయుధ సంపత్తి, టెక్నాలజీ పరంగా ఇండియా పాకిస్తాన్ కంటే ఎంతో ముందుంది. రాఫెల్ యుద్ధ విమానాలు, ఎస్–400 క్షిపణులు, అణు జలాంతర్గామిలు, స్వదేశీ విమాన వాహక నౌకలు భారత్ సామర్థ్యానికి నిదర్శనం.
బాలాకోట్, సిందూర్ ఆపరేషన్లు..
2019లో పుల్వామా ఉగ్రదాడి తర్వాత భారత్ చేపట్టిన బాలాకోట్ ఎయిర్ స్ట్రైక్, తాజాగా సిందూర్ ఆపరేషన్ పాకిస్తాన్‌కు గట్టి షాక్ ఇచ్చాయి. పాకిస్తాన్ భూభాగంలోకి చొచ్చుకువెళ్లి, ఉగ్రవాదుల స్థావరాలను ధ్వంసం చేసిన భారత్, తన సైనిక సామర్థ్యాన్ని చాటిచెప్పింది. పాతకాలపు యుద్ధతంత్రంతో, డ్రోన్ దాడులతో కయ్యానికి కాలు దువ్వితే, అది పాకిస్తాన్ పతనానికి నాంది అవుతుంది.
పాకిస్తాన్‌కు అంతర్గత, బాహ్య సవాళ్లు
పాకిస్తాన్ ప్రస్తుతం అనేక సవాళ్లను ఎదుర్కొంటోంది. ద్రవ్యోల్బణం 38 శాతం పెరిగింది. విదేశీ మారకాల రిజర్వులు 9 బిలియన్ డాలర్లకు పడిపోయాయి. బలూచిస్తాన్, ఖైబర్ పఖ్తూన్ఖ్వాలో తిరుగుబాట్లు, ఆఫ్ఘనిస్తాన్‌తో ఘర్షణలు పెరుగుతున్నాయి. సౌదీ అరేబియా 6.3 బిలియన్ డాలర్ల రుణం తిరిగి చెల్లించాలని డిమాండ్ చేస్తోంది. చైనా 220 మిలియన్ డాలర్ల బకాయిలు ఇవ్వాలని డిమాండ్ చేస్తోంది. మరోవైపు విదేశీ రాయబార కార్యాలయాలు మూతపడటం, అంతర్జాతీయంగా పాకిస్తాన్ ఒంటరిగా మారుతోంది.
యుద్ధం పాక్ పతనానికి నాంది
పాకిస్తాన్ యుద్ధం గురించి మాట్లాడటం కంటే, తన ఆర్థిక సంక్షోభం, అంతర్గత సమస్యలను పరిష్కరించుకోవడంపై దృష్టి పెట్టాలి. భారత్‌తో యుద్ధానికి దిగితే, అది పాకిస్తాన్ పతనానికి నాంది అవుతుంది. బాలాకోట్, సిందూర్ ఆపరేషన్లు ఇందుకు నిదర్శనం. ఆధునిక యుద్ధతంత్రం, సాంకేతికత, ఆర్థిక శక్తితో భారత్ ఎంతో ముందుంది. పాతకాలపు యుద్ధతంత్రంతో కయ్యానికి కాలు దువ్వితే, పాకిస్తాన్ మరింత సంక్షోభంలో చిక్కుకుంటుంది.
