Pak Defence Minister Khawaja Asif: పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్ చేపట్టిన ఆపరేషన్ సిందూర్ నుంచి పాకిస్తాన్ ఇంకా కోలుకోలేదు. భారత వైమానిక దాడులకు ధ్వంసమైన ఎయిర్ బేస్‌లకు ప్యాచ్ వర్క్‌లు చేసుకుని కవర్ చేసింది. తామే విజయం సాధించామన్నట్లు సంబురాలు చేసుకుంటోంది. మరోవైపు కుక్కతోక వంకర అన్నట్లుగా గుజరాత్ తీరంలో సైనిక కార్యకలాపాలు పెంచింది. నిఘా వర్గాల హెచ్చరికతో భారత సైనికాధికారి ఉపేంద్ర ద్వివేది తీవ్ర వార్నింగ్ ఇచ్చారు. ఆపరేషన్ 2.0తో భూమిపై పాకిస్తాన్ లేకుండా చేస్తామని హెచ్చరించారు. ఈ క్రమంలో తాజాగా పాకిస్తాన్ రక్షణ మంత్రి ఆసిమ్ ఖవాజా నోరు పారేసుకున్నారు. భవిష్యత్‌లో సైనిక ఘర్షణ జరిగితే తమ యుద్ధ విమానాల శిథిలాల కింద భారత్ సమాధి అవుతుందని రెచ్చిపోయాడు. ఆపరేషన్ సిందూర్‌లో భారత్ 0–6 స్కోర్‌తో ఓడిపోయిందని పేర్కొన్నారు. ఆయన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ సూరాయి.
ఆపరేషన్ సిందూర్ 2.0 మొదలు పెడితే మటాషే..
భారత్ ‘ఆపరేషన్ సిందూర్ 2.0‘ ప్రారంభిస్తే, పాకిస్తాన్‌కు సైనిక, ఆర్థిక, దౌత్య రంగాల్లో తీవ్రమైన దుష్పరిణామాలు తప్పవు.
పాకిస్తాన్ సైనిక పరిమితులు
– పాకిస్తాన్ సైనిక సామగ్రి పెద్ద మొత్తంలో పాతబడిపోయింది, వీటిలో కొంత చైనా, పశ్చిమ దేశాల కొనుగోళ్లపై ఆధారపడి ఉంటుంది.
– యుద్ధ విమానాలు, మిసైల్ వ్యవస్థలు, రాడార్ సాంకేతికతలో భారత్‌కి ఉన్న ఆధిక్యం, పాకిస్తాన్‌కి గణనీయమైన ముప్పు.
– ఇంధనం, స్పేర్ పార్ట్స్ సరఫరా కొరత తక్షణమే ఆపరేషన్లపై ప్రభావం చూపే అవకాశం ఉంది.
ఆర్థిక విధ్వంసం
– విదేశీ మారక ద్రవ్య నిల్వలు ఇప్పటికే సంక్షోభంలో ఉన్నాయి.
– ఆపరేషన్ సిందూర్ 2.0లో సమగ్ర వైమానిక దాడులు, సరిహద్దు లక్ష్యాల విధ్వంసం పాకిస్తాన్ పారిశ్రామిక మౌలిక వసతులను దుర్భరం చేసే అవకాశం.
– పెట్టుబడిదారుల అనిశ్చితితో విదేశీ పెట్టుబడులు పూర్తిగా నిలిచిపోవచ్చు.
Also Read: బ్యాటింగ్ చేయలేదు.. ఫీల్డింగ్ వల్ల కాదు.. ఈమె పాక్ జట్టు లో పీమేల్ రౌఫ్!
దౌత్య ఒత్తిడి
– భారత్‌పై ఉగ్రవాద దాడులు నిరూపితమైతే, పాకిస్తాన్‌పై అమెరికా, యూరప్, గల్ఫ్ కీలక దేశాలు సైతం కఠిన ఆర్థిక, రాజకీయ ఆంక్షలు విధించే అవకాశం.
– ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ మళ్లీ పాకిస్తాన్‌ను బ్లాక్ లిస్ట్ చేసే ప్రమాదం ఉంటుంది.
– చైనా కూడా బహిరంగ మద్దతు ఇవ్వడంలో జాగ్రత్తగా వ్యవహరించే పరిస్థితి రావచ్చు, ఎందుకంటే సీపీఈసీ ప్రాజెక్టులు అస్థిరమవుతాయి.
– ‘సర్జికల్ స్ట్రైక్‘ స్థాయిని మించి ప్రధాన పట్టణాల వైపు ప్రవేశించే అవకాశం.
– పాకిస్తాన్ లోపలి ఉగ్రవాద కేంద్రాలపై డైరెక్ట్ అటాక్స్ జరిగే అవకాశాలు కూడా ఉన్నాయి.
ఆపరేషన్ సిందూర్ 2.0 మొదలైన పరిస్థితిలో పాకిస్తాన్ సైనికంగానే కాకుండా ఆర్థిక, దౌత్య, అంతర్గత రాజకీయ రంగాల్లో తీవ్ర విచ్ఛిన్నానికి గురయ్యే ప్రమాదం ఉంది. ద్వివేది చెప్పినట్లు ప్రపంచ పటం నుంచి మాయం అవుతుంది. భారత్ శక్తివంతమైన సైనిక, అంతర్జాతీయ మద్దతుతో ముందుకు సాగే అవకాశం పాకిస్తాన్ భవిష్యత్తు భూమండలంపై ఉండదు.