Homeఅంతర్జాతీయంPakistan Iran Ceasefire Role: పాకిస్తాన్‌ కాపీ పేస్ట్‌.. నిజంగా క్రెడిట్‌ ఇవ్వాల్సిందేనా?

Pakistan Iran Ceasefire Role: పాకిస్తాన్‌ కాపీ పేస్ట్‌.. నిజంగా క్రెడిట్‌ ఇవ్వాల్సిందేనా?

Pakistan Iran Ceasefire Role: ఇరాన్‌–అమెరికా మధ్య రెండు వారాల సీజ్‌ఫైర్‌ ఒప్పందం కుదిరడంతో పాకిస్తాన్‌ ఇస్లామాబాద్‌ను చర్చల వేదికగా ముందుపెట్టుకుని సంతోషిస్తోంది. ఈ ఒప్పందానికి తామే కారణమని ప్రధాని షెహబాజ్‌ షరీఫ్‌ ట్విటర్‌లో ప్రకటించారు. రెండు దేశాల మధ్య యుద్ధ విరామం, తర్వాత చర్చలు ఇవన్నీ పాకిస్తాన్‌ ప్రభావంతో జరిగాయని వారి వాదన. కానీ ఈ ఆనందం వెనుక దాగిన వాస్తవాలు వేరుగా ఉన్నాయి.

పాకిస్తాన్‌ను ఎందుకు ఎంచుకుంది?
వాస్తవానికి ఈ సీజ్‌ఫైర్‌ పాకిస్తాన్‌ స్వయం ప్రయత్నంగా జరగలేదు. అమెరికా యుద్ధ భారం తగ్గించుకోవాలని, హర్మూజ్‌ పై పట్టు సాధించాలని కోరుకుంది. అందుకే ముందుగా సీజ్‌ఫైర్‌ ప్రతిపాదించి, మధ్యవర్తిగా ముస్లిం దేశాన్ని కోరింది. తుర్కియే, నాటో సభ్యత్వం కారణంగా ఇరాన్‌ తిరస్కరించడంతో అమెరికా పాకిస్తాన్‌ను ఎంపిక చేసింది. ఇది పాకిస్తాన్‌ స్వతంత్ర చర్య కాదు అమెరికా ఆదేశాల మేరకు నడిచిన పని. ఫలితంగా పాకిస్తాన్‌ క్రెడిట్‌ను తనవైపు ఆకర్షించుకుంటోందని భావిస్తోంది.

పాకిస్తాన్‌ పాలేరు రహస్యం
షెహబాజ్‌ షరీఫ్‌ ట్వీట్‌లో జరిగిన గజిబిజి తప్పు పాకిస్తాన్‌ పరిమితిని తెలియజేస్తుంది. కాపీ–పేస్ట్‌ సమయంలో ‘పాకిస్తాన్‌ ప్రధాని ఇవ్వాల్సిన స్టేట్‌మెంట్‌‘ అనే మాటలు తొలగించడం మర్చిపోయారు. ఇది స్పష్టంగా అమెరికా డ్రాఫ్ట్‌ను నేరుగా పోస్ట్‌ చేసినట్టు. అలాగే, అమెరికాకు రాసిన లేఖల్లో భాషా తప్పులు, ఇజ్రాయెల్‌ దాడులను ఖండిస్తూ ‘కండోమ్‌‘ అని రాయడ.అమెరికా భాషా శైలిని ప్రతిబింబిస్తున్నాయి. అంటే, అమెరికా ట్వీట్లు, స్టేట్‌మెంట్లు తయారు చేసి పాకిస్తాన్‌కు పంపుతోంది. వారు కేవలం పోస్ట్‌ చేస్తున్నారు.

దళారీ వ్యవహారం ప్రకటన
ఈ పరిస్థితి చూసి భారత విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్‌ ఇరాన్‌ విషయంలో దళారీగా వ్యవహరిస్తామని ప్రకటించారు. పాకిస్తాన్‌ మాత్రం అమెరికా ఆటలో దళారీగా ఆడుతోందని ఇది సూచిస్తోంది. పాకిస్తాన్‌ భాషా శైలి కూడా ఘాటుగా మారుతోంది. మెరికా పదాలు, టోన్‌ను అలాగే కాపీ చేస్తోంది. ఫలంగా, పాకిస్తాన్‌ స్వతంత్ర దిప్లొమసీ కాకుండా, అమెరికా ప్రాక్సీగా మారిపోతోంది.

పాకిస్తాన్‌ ఈ క్రెడిట్‌తో బొలెడు తప్పులు చేస్తోంది. అమెరికా లక్ష్యాలు సాధించుకున్న తర్వాత పాకిస్తాన్‌ను వదిలేస్తుంది. ఇరాన్‌తో సంబంధాలు దెబ్బతింటాయి, ప్రాంతీయ స్థిరత్వం క్షీణిస్తుంది. భారత్‌ వంటి దేశాలు దళారీ వ్యూహంతో ముందుండగా, పాకిస్తాన్‌ అమెరికా ఆటకూర్చోబాటులో పడి రాజకీయంగా బలహీనపడుతుంది. ఇది ప్రాంతీయ రాజకీయాల్లో కొత్త మలుపు తిరగొచ్చు.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular