Homeఅంతర్జాతీయంPakistan: మ్యాప్‌ మారడంతో అమెరికా కాళ్లు పట్టుకున్న పాకిస్తాన్‌

Pakistan: మ్యాప్‌ మారడంతో అమెరికా కాళ్లు పట్టుకున్న పాకిస్తాన్‌

Pakistan: ఏడాది చర్చల తర్వాత.. భారత్‌–అమెరికా వాణిజ్య ఒప్పందం కుదిరింది. దానికి ముందు అమెరికా దిగొచ్చి.. భారత్‌పై విధించిన టారిఫ్‌లు 50 శాతం నుంచి 18 శాతానికి తగ్గించింది. తర్వాత మధ్యంతర వాణిజ్య ఒప్పందం చేసుకుంది. ఈ సందర్భంగా అమెరికా వాణిజ్య ప్రతినిధి అమెరికా, భారత్‌ ఒప్పందం వివరాలు ఎక్స్‌లో పోస్టు చేస్తూ… భారత మ్యాప్‌ కూడా జత చేశాడు. ఈ మ్యాప్‌ పాకిస్తాన్‌ను కలవరపెట్టింది. పాకిస్తాన్‌ కాళ్లు పట్టుకుని వారం తర్వాత మ్యాప్‌లో మార్పులు చేయించుకుంది. ఇది అమెరికా ద్వంద్వ విధానాన్ని బయటపెట్టింది.

మ్యాప్‌ వివాద నేపథ్యం
భారత్‌–అమెరికా మధ్య ఇటీవల కుదిరిన వాణిజ్య ఒప్పందం సమయంలో అమెరికా వాణిజ్య ప్రతినిధి ఎక్స్‌లో భారత మ్యాప్‌ను పోస్ట్‌ చేశారు. ఇందులో పూర్తి జమ్మూ కశ్మీర్, లడఖ్‌తో పాక్‌ ఆక్రమిత ప్రాంతాలు (పీవోకే), అక్సాయ్‌ చిన్‌ను భారత భూభాగంగా చూపించారు. 1947లో మహారాజా హరి సింగ్‌ సంతకం చేసిన సరిహద్దులకు అనుగుణంగా ఉండటం వల్ల పాకిస్తాన్‌ నాయకులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు.

అమెరికా కాళ్లు పట్టుకున్న పాకిస్తాన్‌..
మ్యాప్‌ పోస్ట్‌ అవ్వగానే పాకిస్తాన్‌ అధికారి తాహిర్‌ అంద్రాబి అమెరికాను సంప్రదించారు. బతిమిలాడి, కాళ్లు పట్టుకుని, దండం పెట్టి పీవోకే తమ ఆధీనంలో ఉందని, మ్యాప్‌ మార్చాలని వేడుకున్నారు. దీంతో వారం తర్వాత అమెరికా ఆ పోస్ట్‌ తొలగించి, పాకిస్తాన్‌ వైపు మ్యాప్‌ను సవరించడంతో పాక్‌ సంతృప్తి చెందింది.

అమెరికా ద్వంద్వ విధానం
అమెరికా భారత్‌తో పాత మ్యాప్‌ను కొనసాగిస్తూ, పాకిస్తాన్‌వైపు కశ్మీర్‌ను విభజిత ప్రాంతంగా, పీవోకేను డాటెడ్‌ లైన్‌తో చూపించింది. యూరప్, అంతర్జాతీయ సంస్థలు కూడా ఇలాంటి ద్వంద్వ చిత్రణలు పాటిస్తున్నాయి. ఇది దౌత్య బ్యాలెన్సింగ్‌ను సూచిస్తుంది.

పాక్‌ హాకీ జట్టుకు అవమానం..
ఇదిలా ఉంటే ఇటీవల పాకిస్తాన్‌ హాకీ జట్టు ఆస్ట్రేలియాలో ఎఫ్‌ఐహెచ్‌ లీగ్‌ ఆడేందుకు వెళ్లింది. జాతీయ జట్టును పంపిన పాకిస్తాన్‌ ఆస్ట్రేలియా రాజధాని కాన్‌బెరాలో హోటల్‌ రూంలు బుక్‌ చేయలేదు. మేనేజర్‌ను కూడా పంపించలేదు. దీంతో పాకిస్తాన్‌ క్రీడాకారులు గంటల పాటు రోడ్డుపై ఉండాల్సి వచ్చింది. చివరకు రెండు రూములకు డబ్బులు చెల్లించి అందులో సర్దుకోవాలని సూచించింది. ఇటువంటి అంతర్గత సమస్యలు పరిష్కరించుకోవడం కంటే కశ్మీర్‌ విషయంలో ఆందోళన చెందటం పాకిస్తాన్‌ స్థానిక ప్రయోజనాలను పట్టించుకోవడం లేదని అర్థమవుతోంది.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version