NTR: సినిమా ఇండస్ట్రీలో వారసత్వం ఉంటే సరిపోదు. నటన పట్ల ఆసక్తి ఉండి ఎలాంటి పాత్రనైనా సరే అలవోకగా చేయగలిగే కెపాసిటి ఉన్నవాళ్లు మాత్రమే నటులుగా రాణిస్తారు. వాళ్లకు మాత్రమే ఎక్కువ అవకాశాలు వస్తాయి. చాలామంది దర్శకులు వాళ్ళ కోసమే సపరేటుగా కథలను రాసుకుంటారు. ఇక ఇలాంటి కోవకు చెందిన వాడే జూనియర్ ఎన్టీఆర్ నటనలో వైవిధ్యాన్ని కనబరుస్తూ ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకుంటూ వస్తున్న ఎన్టీఆర్ సినిమాల సక్సెస్ ల విషయంలో మాత్రం కొంతవరకు వెనుకబడిపోతున్నాడు. ఇప్పటి వరకు ఆయన వరుసగా 7 విజయాలను అందుకున్నప్పటికి అందులో ఒకటి కూడా బ్లాక్ బస్టర్ అయి ఇండస్ట్రీ హిట్ గా కన్వర్ట్ కాలేకపోవడం అనేది జూనియర్ ఎన్టీఆర్ కి విపరీతమైన మైనస్ గా మారింది… ఇండియాలో తమ తోటి హీరోలందరు వేల కోట్లలో కలెక్షన్స్ ను కొల్లగొడుతుంటే జూనియర్ ఎన్టీఆర్ మాత్రం దేవర సినిమాతో కేవలం 500 కోట్ల కలెక్షన్స్ ను మాత్రమే రాబట్టాడు.
ఇక ‘వార్ 2’ సినిమా గురించి మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆ సినిమాని చేసినందుకు జూనియర్ ఎన్టీఆర్ సైతం చాలావరకు ఇబ్బందులను ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇక సోలో హీరోగా కేవలం 500 కోట్ల మార్కెట్ మాత్రమే కలిగి ఉన్న ఎన్టీఆర్ ఇప్పుడు ప్రశాంత్ నీల్ తో చేస్తున్న సినిమాతో ఎంతటి కలెక్షన్స్ రాబడతాడు అనేది చర్చనీయంశంగా మారింది.
ఇప్పటివరకు 1000 కోట్ల కలెక్షన్స్ ను కొల్లగొట్టిన జూనియర్ ఎన్టీఆర్ ఇకమీదట చేయబోతున్న సినిమాల విషయంలో అది సాధ్యమవుతుందా? లేదా అనే విషయంలో కూడా క్లారిటీ రావాల్సిన అవసరమైతే ఉంది. ఇక జూనియర్ ఎన్టీఆర్ లాంటి నటుడు ఈ మధ్యకాలంలో చేస్తున్న సినిమాల విషయంలో స్పెషల్ కేర్ తీసుకుంటున్నప్పటికి ఆయన ఎందుకని ఒక సినిమాని భారీ హిట్ గా మార్చలేకపోతున్నాడు.
మొన్న వచ్చిన హీరోలు సైతం భారీ సక్సెస్ ను సాధించి వందల కోట్ల కలెక్షన్స్ ని కాపాడుతుంటే జూనియర్ ఎన్టీఆర్ మాత్రం కలెక్షన్స్ ని రాబట్టడం లో కొంతవరకు వెనుకబడిపోతున్నాడు… సక్సెస్ ఫుల్ టాక్ వచ్చినా కూడా కలెక్షన్స్ మాత్రం పెద్దగా రావడం లేదు. దానికి గల కారణం ఏంటి అనేది తెలుసుకుంటే తప్ప జూనియర్ ఎన్టీఆర్ భారీ విజయాన్ని సాధించలేడు…