Asim Munir: అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ రెండోసారి బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి పాకిస్తాన్ ఆయన చుట్టూ ప్రదక్షిణ చేస్తోంది. ట్రంప్ ఏం చెబితే అది చేస్తూ ఆయన ప్రసన్న కోసం ప్రయత్నిస్తోంది. దీంతో ట్రంప్ కూడా ఐ లవ్ పాకిస్తాన్ అని ప్రశంసిచాడు. ఇక పాక్ ఆర్మీచీఫ్‌ను వైట్‌హౌస్‌కు పిలిచి మరీ లంచ్ ఏర్పాటు చేశాడు. అయితే అమెరికా ఎప్పుడు ఎలా ఉంటుందో పాకిస్తాన్‌కు ఆలస్యంగా అర్థమైంది. ఇప్పుడు పాకిస్తాన్‌ను పక్కన పడేశాడు. భారత్‌తో డీల్ చేసుకున్నాడు. పాకిస్తాన్‌ను టాయిలెట్ పేపర్‌గా వాడుకునానడు. తాజాగా పాకిస్తాన్ ఆర్మీచీఫ్ ఆసిమ్ మునీర్‌కు జర్మనీలోనూ ఘోర అవమానం ఎదురైంది. ఇజ్జత్ మొత్తం పోయింది.
ఏం జరిగింది?
జర్మనీలోని మ్యూనిచ్ సెక్యూరిటీ కాన్ఫరెన్స్‌లో పాల్గొన్న పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ఫీల్డ్ మార్షల్ అసిమ్ మునీర్ వెళ్లాడు. అక్కడ భద్రతా సిబ్బంది ప్రవేశ ద్వారం వద్ద ఆపారు. ఐడీ కార్డు చూపమని మహిళా అధికారి తప్పనిసరిగా చెప్పగా, ఆయన గుర్తింపు పత్రాన్ని పరిశీలించిన తర్వాతే ముందుకు వెళ్లనిచ్చారు. ఈ ఘటన సోషల్ మీడియాలో వైరల్‌గా మారి పాకిస్తాన్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
భద్రతా తనిఖీ వివరాలు
కాన్ఫరెన్స్ వేదికలోకి ప్రవేశిస్తున్నప్పుడు మునీర్ ఐడీ బ్యాడ్‌ను తిప్పమని అధికారి సూచించారు. పాక్ ఉన్నతాధికారి వివరాలు చెప్పినా, పూర్తి పరిశీలన తర్వాత అనుమతి లభించింది. ఇది సాధారణ భద్రతా ప్రోటోకాల్‌లో భాగమేనని, భారత్‌తోపాటు ఇతర దేశాల అధికారులు కూడా ఇలాంటి తనిఖీలు ఎదుర్కొన్నారని సమాచారం.
పాకిస్తాన్ అసంతృప్తి..
పాకిస్తాన్ దీన్ని ప్రోటోకాల్ ఉల్లంఘనగా భావించి అసంతృప్తి తెలిపింది. అయితే మాజీ సైనిక అధికారి ఆదిల్ రజా ఇది గౌరవ భంగం కాదని, అంతర్జాతీయంగా మునీర్‌కు గుర్తింపు తక్కువగా ఉండటమే కారణమని వాదించారు. ఈ ఘటన ఆయన అంతర్జాతీయ ప్రతిష్టకు మచ్చగా మారిందని పాక్ వర్గాలు ఆరోపిస్తున్నాయి.
ఈ సంఘటన పాకిస్తాన్ సైనిక నాయకత్వం అంతర్జాతీయ వేదికలపై ఎదుర్కొంటున్న సవాళ్లను హైలైట్ చేస్తుంది. సాధారణ భద్రతా చర్యలు కూడా దేశీయ రాజకీయంగా పెద్ద సంచలనానికి దారితీస్తున్నాయి. ఇది పాక్ సైన్యం ప్రపంచంలోని స్థితిని ప్రతిబింబిస్తూ, దౌత్య ప్రభావాన్ని పెంచుకోవాల్సిన అవసరాన్ని సూచిస్తుంది.
View this post on Instagram