America: అగ్రరాజ్యం అమెరికా(America)లో అక్రమ వలసదారులను వారి సొంద దేశాలకు పంపించే ప్రక్రియ కొనసాగుతోంది. సరైన ధ్రువీకరణ పత్రాలు లేనివారిని గుర్తిస్తున్న అక్కడి అధికారులు వారిని ప్రత్యేక సైనిక విమానాల్లో సొంత దేశాలకు తరలిస్తున్నారు. ఇప్పటికే వేల మందిని అమెరికా దాటించారు. భారత్‌కు కూడా ఇటీవలే 104 మందితో ఓ విమానం వచ్చింది. తాజాగా మరో రెండు విమానాలు రాబోతున్నాయి. అందులో తొలివిమానం సీ17 గ్లోబ్ మాస్టర్–3 119 మందితో శనివారం భారత్‌లో ల్యాండ్ కాబోతోంది. రాత్రి 10 గంటలకు అమృత్‌సర్(Amruthsar)కు చేరుకుంటుంది. ఇక రెండో విమానం ఆదివారం ల్యాండ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఈ విమానంలో ఎంతమంది వస్తున్నారన్న విషయం తెలియడంలేదు.
తొలి విమానంలో వీరు..
శనివారం ల్యాండ్ అయ్యే తొలి విమానం సీ17 గ్లోబ్ మాస్టర్–3లో 119 మంది భారత్‌కు చెందిన వలసదారులు ఉన్నారు. వీరిఓల 67 మంది పంజాబ్(Panjab)కు చెందినవారు. మిగతావారిలో హర్యాన 33, ఉత్తరప్రదేశ్ 3, గోవా 2, మహారాష్ట్ర 2, రాజస్తాన్ 2, హిమాచల్ ప్రదేశ్ 1, జమ్మూ కశ్మీర్ 1 ఉన్నట్లు గుర్తించారు.
ల్యాండింగ్ అక్కడే ఎందుకు..
వారం క్రితం 104 మందితో వచ్చిన అమెరికా విమానాన్ని అధికారులు అమృత్‌సర్‌లో లాండ్ చేయించారు. తాజాగా మరో విమానం కూడా అక్కడే ల్యాండ్ కానుంది. దీంతో పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్‌మాన్(Bhagavanth man) ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 119 మంది అక్రమ వలసదారుల్లో 67 మంది పంజాబ్‌కు చెందినవారని, అందుకే అమృతసర్‌లో ల్యాండ్ చేస్తున్నామని అధికారులు చెబుతున్నారన్నారు. అయితే మొదటి విమానంలో అహ్మదాబాద్(Abmadabad) వాళ్లు ఎక్కువగా ఉన్నారని, మరి దానిని కూడా అమృతసర్‌లోనే ఎందుకు ల్యాండ్ చేశారని ప్రశ్నిస్తున్నారు. ఢిల్లీలో ఎందుకు దించడం లేదని నిలదీశారు. పంజాబ్ ప్రతిష్టను దెబ్బతీసేందుకే కేంద్రం ఇలా ప్రయత్నిస్తోందని మండిపడ్డారు.