One Big Beautiful Bill: అమెరికా అధ్యక్షుడిగా రెండోసారి భాధ్యతలు చేపట్టిన డొనాల్డ్ ట్రంప్ తీసుకుంటున్న అనాలోచిత నిర్ణయాలు ఇటు అమెరికన్లను, అటు అమెరికాలోని విదేశీయులను టెన్షన్ పెడుతున్నాయి. ప్రధానంగా విదేశీయులను వెళ్లగొట్టాలన్న ఉద్దేశంతో ట్రంప్ తీసుకుంటున్న నిర్ణయాలు ఆందోళన కలిగిస్తున్నాయి. దీంతో డాలర్ డ్రీమ్ చెందిరిపోతోంది. తాజాగా ట్రంప్ ప్రభుత్వం తీసుకొచ్చిన ’వన్ బిగ్ బ్యూటిఫుల్ బిల్ యాక్ట్’ (ఓబీబీబీఏ) 2025 జూలై 4న చట్టంగా మారింది. ఈ చట్టం పన్ను కోతలు, వ్యయ నియంత్రణ, ఇమిగ్రేషన్ సంస్కరణల ద్వారా ఆర్థిక స్థిరత్వాన్ని సాధించాలనే లక్ష్యంతో రూపొందించబడింది. అయితే, ఈ చట్టం నాన్–ఇమిగ్రెంట్ వీసా దరఖాస్తుదారులపై, ముఖ్యంగా విదేశీ విద్యార్థులు, సాంకేతిక నిపుణులు, టూరిస్టులు, శరణార్థులపై అదనపు ఆర్థిక భారం పడనుంది.
ఏంటీ ‘వన్ బిగ్ బ్యూటిఫుల్ బిల్’?
’వన్ బిగ్ బ్యూటిఫుల్ బిల్ యాక్ట్’ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆధ్వర్యంలో రూపొందించిన బడ్జెట్ రీకన్సిలియేషన్ బిల్, ఇది 2025లో హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్, సెనెట్‌లో ఆమోదం పొందింది. ఈ చట్టం ఇమిగ్రేషన్ వ్యవస్థలో సంస్కరణలు, సరిహద్దు భద్రతా చర్యలు, సామాజిక సంక్షేమ కార్యక్రమాలపై నియంత్రణలను కలిగి ఉంది. దీని ద్వారా ఇమిగ్రేషన్ సేవల కర్చులను అమెరికన్ పన్ను చెల్లింపుదారుల నుంచి వీసా దరఖాస్తుదారులకు మళ్లించే ప్రయత్నం జరిగింది.
కొత్త ‘వీసా ఇంటిగ్రిటీ ఫీజు’..
డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఆఫ్ హోమ్‌ల్యాండ్ సెక్యూరిటీ 2026 నుంచి నాన్–ఇమిగ్రెంట్ వీసా దరఖాస్తుదారుల నుంచి తప్పనిసరిగా 250 డాలర్లు వీసా ఇంటిగ్రిటీ ఫీజు’ వసూలు చేయనుంది. ఈ రుసుము వీసా జారీ సమయంలో చెల్లించాల్సి ఉంటుంది. వినియోగదారుల ధరల సూచీ ఆధారంగా ఏటా పెరగనుంది. నిర్దిష్ట పరిస్థితుల్లో మినహాయింపులు ఇవ్వవచ్చు, కానీ ఫీజు రద్దు లేదా తగ్గింపు అవకాశం లేదు. వీసా ఇంటిగ్రిటీ ఫీజు రీఫండ్ కొన్ని షరతులకు లోబడి మాత్రమే అందుబాటులో ఉంటుంది. వీసా దారుడు అనధికార ఉపాధి లేదా వీసా గడువు దాటకుండా నిబంధనలను పాటించాలి. గడువు ముగిసే 5 రోజుల ముందు అమెరికాను వీడాలి.
Also Read: ఫాస్టాగ్ తో ప్రభుత్వానికి కాసుల వర్షం.. టోల్ వసూలు ఎన్ని వేల కోట్లు వచ్చాయో తెలుసా ?
ఇతర రుసుముల పెరుగుదల..
వీసా ఇంటిగ్రిటీ ఫీజుతోపాటు, ఈ చట్టం ద్వారా ఇతర రుసుములు కూడా పెరగనున్నాయి, ఇవి వీసా దరఖాస్తు ప్రక్రియను మరింత ఖరీదైనవిగా చేస్తాయి. నాన్–ఇమిగ్రెంట్లు ప్రతి ప్రవేశంలో ఐ–94 రికార్డ్ కోసం 24 డాలర్లు చెల్లించాలి. ఈ రుసుము తరచూ ప్రయాణించే çహెచ్–1బీఉద్యోగులకు అదనపు భారం. వీసా వైవర్ ప్రోగ్రామ్ కింద ప్రయాణించే వారికి రుసుము పెరుగుదల. అసైలం దరఖాస్తుల కోసం వెయ్యి డాలర్లు, పెండింగ్‌లో ఉన్న కేసులకు ఏటా 100 డాలర్ల రుసుము చెల్లించాలి.
వివిధ వర్గాలపై ప్రభావం
ఈ చట్టం విదేశీ విద్యార్థులు, సాంకేతిక నిపుణులు, టూరిస్టులు, మరియు శరణార్థులపై గణనీయమైన ఆర్థిక ఒత్తిడిని తెస్తుంది. ఎఫ్–1 వీసా దరఖాస్తుదారులు వీసా ఇంటిగ్రిటీ ఫీజుతోపాటు ఇతర రుసుములను భరించాలి, దీనివల్ల చదువు ఖర్చులు పెరుగుతాయి. విద్యా సంస్థలు, రిక్రూటర్లు విద్యార్థుల ఆర్థిక సామర్థ్యంపై ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. çహెచ్–1బీ వీసా దారులు తరచూ ప్రయాణించే వారికి ఐ–94 ఫీజు (24 డాలర్లు ప్రతి ప్రవేశం), వీసా ఇంటిగ్రిటీ ఫీజు అదనపు ఖర్చుగా మారనుంది. యజమానులు కూడా ఈ రుసుముల వల్ల ప్రభావితమవుతారు, దీనివల్ల వారు విదేశీ ఉద్యోగుల నియామకంపై పునరాలోచన చేయవచ్చు. బి1/బి2 వీసా దరఖాస్తుదారులు కొత్త రుసుముల వల్ల ప్రయాణ ఖర్చుల పెరుగుదలను ఎదుర్కోవాలి.
Also Read: భారతదేశానికి India అనే పేరు ఇలా వచ్చింది…
భారతీయులపై ప్రభావం..
భారతదేశం నుంచి అమెరికాకు వెళ్లే విద్యార్థులు, సాంకేతిక నిపుణులు, టూరిస్టుల సంఖ్య గణనీయంగా ఉంది. ఈ చట్టం వారిపై నేరుగా ప్రభావం చూపనుంది. హెచ్–1 వీసా దరఖాస్తులపై అదనపు 250 డాలర్ల రుసుము చదువు ఖర్చులను పెంచుతుంది. ఐ–94 రుసుము (24 డాలర్లు ప్రతి ప్రవేశం), వీసా ఇంటిగ్రిటీ ఫీజు ఆర్థిక భారాన్ని పెంచుతాయి. భారతదేశం నుండి అసైలం దరఖాస్తులు 2021–23 మధ్య 855% పెరిగాయి, కొత్త రుసుములు ఈ ప్రక్రియను కష్టతరం చేస్తాయి.