North Korea Involvement In Iran US Israel War: ఇరాన్, అమెరికా–ఇజ్రాయెల్ యుద్ధం మొదలై 18 రోజులైంది. ఇంతకాలం కొనసాగుతుందని ఎవరూ ఊహించలేదు. ఇంతలా ప్రతిఘటిస్తామని ఇరాన్, ఇంతకాలం యుద్ధం చేయాల్సి వస్తుందని అమెరికా కూడా అంచనా వేయలేదు. కానీ ఇరాన్ అమెరికాను భయపెడుతోంది. వ్యూహాత్మకంగా అమెరికాను దెబ్బతీస్తోంది. అమెరికాపై ఒత్తిడి తెస్తోంది. ఈ తరుణంలో హార్మూజ్ జలసంధి వద్ద నౌకలు నిలిచిపోయాయి. ఇలాంటి తరుణంలో యురోపియన్ యూనియన్ దేశాలకు చమురు సమస్య తలెత్తే ప్రమాదం ఉంది. ఈ క్రమంలో అమెరికా యుద్ధంతో తమతో కలిసి రావాలని నాటో దేశాలను కోరింది. అయినా ఎవరూ ముందుకు రావడం లేదు.
Also Read: 17 ఏళ్లు దాటింది.. రాజస్థాన్ ఈసారైనా రాజసాన్ని చూపుతుందా? బలాలేంటి?బలహీనతలేంటి?
ఉత్తరకొరియా రంగంలోకి..
ఈ వార్‌లోకి ఉత్తర కొరియా ఎంటర్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే యుద్ధం లక్ష్యం ఏమిటో ఎన్నాళ్లు కొనసాగుతుందో అమెరికా అంచనా వేయలేకపోతోంది. ఈ తరుణంలో ఉత్తర కొరియా రంగంలోకి దిగితే అమెరికాకు ఇబ్బందలు తప్పవు. ఎందుకంటే ఉత్తర కొరియా అణ్వాయుధ దేశం. దక్షిణ కొరియా అమెరికా మిత్ర దేశం దీనికి ఉత్తర కొరియాతో ఇబ్బందులు ఉన్నా అమెరికా ఆ దేశంపై దాడి చేయకపోవడానికి కారణం అణ్వాయుధమే.
సరికొత్త ఆయుధాలతో ఇరాన్..
యుద్ధం జరుగుతున్న వేళ ఇరాన్ ’డ్యాన్సింగ్ మిస్సైల్’ ప్రయోగం (10 వేల కి.మీ. రేంజ్, అర్బిటల్ ట్రాజెక్టరీ)తో కొత్త ఆయుధాలు ప్రదర్శించి అమెరికా ఆధిక్యతను సవాల్ చేస్తోంది. ట్రంప్ అనుకోని ఈ దీర్ఘయుద్ధం ఖర్గ్ ఐలాండ్ దాడులు (అమెరికా చమురు మౌలిక సదుపాయాలపై)తో మరింత తీవ్రమైంది.
ఇరాన్ ప్రతీకార దాడులు..
మరోవైపు ఇరాన్ సౌదీ అరేబియాలోని అమెరికా ఎయిర్ బేస్‌లో 5 ట్యాంకర్ షిప్‌లు ధ్వంసం చేసి యుద్ధ విమానాల ఇంధన సరఫరా (గాల్లో నింపుదల) ఆపేశారు. ఈ ఆకస్మిక దాడి అమెరికా ఆపరేషన్ ’ఎపిక్ ఫ్యూరీ’ను ఆపేసి, విమానాలు లక్ష్యాలకు చేరుకోలేకపోయాయి. ఐఆర్జీసీ 5 వేల బాంబుల దాడులకు ప్రతిఘటనగా ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు, మోజ్తాబా ఖమేనీపై బెదిరింకపత్రాలు జారీ చేసింది.
ప్రచార యుద్ధం..
ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు వీడియో ఒకటి తాజాగా వైరల్ అవుతోంది. అందుతో నెతన్యాహు కుడి చేరితికి ఆరు వేళ్లు ఉన్నట్లు గుర్తించారు. దానిని వైరల్ చేస్తున్నారు. ఇది పూర్తిగా ఏఐ వీడియో అని పేర్కొంటున్నారు. ఇరాన్ దాడిలో నెతన్యాహు మరణించాడని సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. బతికే ఉన్నాడని ఇజ్రాయెల్ తెలిపింది. తాజాగా మరో రెండు వీడియోలను విడుదల చేసింది. మరోవైపు అమెరికా ఇరాన్ కొత్త సుప్రీం లీడర్ మోజ్తాబా ఖమేనీని చంపుతామంటోంది. నెతన్యాహును చంపుతామని ఐఆర్జీసీ ప్రకటించింది.
నాటో మౌనం..
ట్రంప్ తాజాగా ‘ఇరాన్‌ను చితక్కొట్టాము’ అని ప్రకటించి నాటో సహాయం కోరాడు, కానీ ఎవరూ స్పందించలేదు – కొందరు ’రామని’ చెప్పారు. అమెరికా ట్రిలియన్ డాలర్ సైనిక బడ్జెట్‌కు ఉన్నప్పటికీ, 100 డ్రోన్ దాడికి 16 కోట్లక్షాలర్ల ఖర్చు అమెరికాపైఊ ఆర్థిక ఒత్తిడి సష్టిస్తోంది. ఈ ఒంటరితనం అమెరికా వ్యూహాన్ని మార్చేస్తోంది.
ఉత్తర కొరియా మద్దతుతో ఇరాన్ ఐఆర్జీసీ యుద్ధం దీర్ఘకాలం సాగేలా చూస్తున్నాయి. రష్యా, చైనా సహకారం (డ్రోన్లు, ఇంటెల్) పెరిగితే మహాయుద్ధంగా మారవచ్చు. రెండు–మూడు రోజుల్లో నాటో స్పందనలు కీలకం – ట్రంప్ ్ఖ–టర్న్ (యుద్ధ ముగింపు సూచనలు) శాంతి చర్చలకు దారి తీయవచ్చు.
