Nobel Prize 2025: అగ్రరాజ్యాధినేత డొనాల్డ్ ట్రంప్.. తాను ఏం చెబితే ప్రపంచం అది చేయాలన్న భావనలో ఉన్నారు. ఈ క్రమంలోనే టారిఫ్ వార్‌కు తెరలేపారు. అమెరికా ఫస్ట్ నినాదంతో అధికారంలోకి వచ్చిన ఆయన.. ఇప్పుడు వ్యక్తిగత ప్రయోజనాలకే ప్రాధాన్యం ఇస్తున్నారు. ఈ క్రమంలోనే పాకిస్తాన్‌తో బిట్‌కాయిన్ వ్యాపారం చేస్తున్నారు. ఈ పిచ్చి ట్రంప్‌కు ఇప్పుడు నోబెల శాంతి బహుమతి పిచ్చి పట్టింది. అధికారంలోకి వచ్చిన వారం రోజుల్లో యుద్ధాలను ఆపేస్తానన్న ట్రంప్ ఏడాది కావొస్తున్నా ఏ యుద్ధం ఆపలేదు. కానీ ఆపానని సెల్ఫ్ డబ్బా కొట్టుకుంటున్నాడు. ఇదంతా ఎందుకంటే నోబెల్ శాంతి బహుమతి కోసమే. అయితే ఆయనకు ఈసారి ఆ ఛాన్స్ లేదన్న వాదన వినిపిస్తోంది.
‘‘శాంతి దూత’’గా మారాలని..
అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఎప్పటికప్పుడు తనను ప్రపంచ శాంతి సాధకుడిగా చిత్రీకరించేందుకు ప్రయత్నించారు. ఉత్తర కొరియా చర్చలు, మధ్యప్రాచ్య ఒప్పందాలు వంటి వాటిని తన కృషిగా చూపిస్తూ, నోబెల్ శాంతి పురస్కారం తనదే కావాలని బహిరంగంగా వ్యాఖ్యానించారు. ఇందుకోసం ఎన్నెన్నో ట్రిక్కులు వేశాడు. రష్యా అధ్యక్షుడు పుతిన్‌తోనూ సమావేశమయ్యారు. ఉక్రెయిన్ అధ్యక్షుడు వ్లాదిమిర్ జెలన్‌స్కీని అయితే బెదిరించడు. ఇక తాజాగా ఇజ్రాయల్–హమాజ్ మధ్య బలవంతంగా సీజ్‌ఫైర్‌కు ఒప్పించాడు. ఆపరేషన్ సిందూర్ తానే ఆపానని 40 సార్లు చెప్పుకున్నాడు.
పాకిస్తాన్–ఇజ్రాయెల్ సహా పలు దేశాల మద్దతు
గతంలో ట్రంప్‌ను నోబెల్ రేసులోకి తీసుకురావాలనే ప్రయత్నం పాకిస్తాన్, ఇజ్రాయెల్, కాంబోడియా వంటి దేశాలనుంచి జరిగింది. ఆయన నాయకత్వంలో కొన్ని తాత్కాలిక ఒప్పందాలు కుదిరినప్పటికీ, వాటి ఔట్‌కమ్ దీర్ఘకాలికంగా శాంతి దిశగా ముందుకు సాగలేదని నోబెల్ కమిటీ అంచనా వేసింది.
దరఖాస్తు లేదు
ఇదిలా ఉంటే 2025 నోబెల్ శాంతి బహుమతుల కోసం నామినేషన్లు ఫిబ్రవరి 1 లోపల ఇవ్వాలి. అయితే ట్రంప్ పేరిట దరఖాస్తు చేరకపోవడంతో ఈ ఏడాది పరిగణనలోకి తీసుకోవడం సాధ్యంకాలేదు. మద్దతు గల పూర్వ నామినేటర్లు కూడా ఈసారి పాల్గొనకపోవడమే కారణమని నార్వేజియన్ మీడియా సూచిస్తోంది.
నోబెల్ కమిటీ తీరుపై ప్రతిస్పందనలు
ట్రంప్ అనుచరులు, నోబెల్ సెలక్షన్ ప్రక్రియలో రాజకీయ పక్షపాతం ఉందని విమర్శిస్తున్నారు. అయితే నిపుణుల ప్రకారం, అవార్డుకు అర్హత పొందాలంటే శాంతి నిలుపుదలకు స్థిరమైన ప్రభావం చూపిన వ్యక్తిగత పాత్ర అవసరం, కేవలం ఒప్పందం ప్రారంభించినంత మాత్రాన సరిపోదు.
ట్రంప్ గతంలో నాటో, ఇరాన్ ఒప్పందం, ఉక్రెయిన్ సాయం విషయాల్లో తీసుకున్న నిర్ణయాలు విభిన్న దేశాల మధ్య విరోధాన్ని పెంచాయి. ఈ కారణంగా ఆయనను ‘‘శాంతిని సంక్లిష్టం చేసిన నేత’’గా పాశ్చాత్య విశ్లేషకులు అభివర్ణిస్తున్నారు. ఈ నేపథ్యంతో నోబెల్ శాంతి అవార్డు కల ఈసారి కూడా దూరంగానే మిగిలింది.