Nithyananda
Nithyananda : సనాతన ధర్మ పరిరక్షకుడిగా తనను తాను పేర్కొన్న నిత్యానంద.. ఎన్నడూ ఆ పని చేసిన దాఖలాలు లేవు. 45 సంవత్సరాల వయసు ఉన్న నిత్యానంద వ్యక్తిగత భోగాలకు మాత్రమే ప్రాధాన్యం ఇచ్చారనే ఆరోపణలు ఉన్నాయి. తన ఆశ్రమంలో ఉండే మహిళలపై అఘాయిత్యాలకు పాల్పడ్డాడని ఆరోపణలు కూడా నిత్యానంద పై ఉన్నాయి. తనకు శిష్యురాలిగా చేరిన సినీనటి రంజితను లోబర్చుకున్నారని.. ఆమెను తన మైకంలో ఉండేలాగా చేశారని నిత్యానంద పై అప్పట్లో ఆరోపణలు వినిపించిన సంగతి తెలిసిందే. అయితే ఈ ఆరోపణలను రంజిత ఖండించారు. తనకు తానుగానే నిత్యానంద వద్దకు వెళ్లానని.. సినిమా రంగ వదిలిపెట్టి దైవచింతనలో ఉన్నానని ఆమె స్పష్టం చేశారు అయినప్పటికీ వారిద్దరి మధ్య ఏదో ఉందని.. వారిద్దరూ కలిసి అక్రమాలకు పాల్పడుతున్నారని ఆరోపణలకు కొదవేమీ లేదు.
Also Read : నిత్యానంద స్వామి చనిపోయారా? ఇందులో నిజమెంత?
జీవ సమాధి అయ్యారా
సనాతన ధర్మ పరిరక్షకుడిగా చెప్పుకునే నిత్యానంద.. అనేక అక్రమాలకు పాల్పడ్డారని ఆరోపణలు వినిపించాయి. ఆయనపై కేసులు కూడా నమోదు అయ్యాయి. అయితే దేశం వదిలి పారిపోయిన అతను కైలాస దేశాన్ని ఏర్పాటు చేసినట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి. అందులో నివసించడానికి.. చాలామంది దగ్గర డబ్బులు వసూలు చేసినట్టు ఆరోపణలు వినిపించాయి.. కైలాస దేశానికి ప్రత్యేక కరెన్సీని రూపొందించినట్టు అప్పట్లో ప్రచారం జరిగింది. వివాదాస్పద మత గురువు అయినప్పటికీ.. నిత్యానందను చాలామంది ఆరాధించేవారు. ఆయన ఆశ్రమానికి భారీగా డబ్బులు ఇచ్చేవారు. సనాతన ధర్మ పరిరక్షణ కోసం నిత్యానంద తన జీవితాన్ని బలి చేశారని.. సజీవ సమాధి అయ్యారని.. మంగళవారం నిత్యానంద బంధువు ఒకరు మీడియాతో పేర్కొన్నారు. దీంతో నిన్నటి నుంచి దేశవ్యాప్తంగా నిత్యానంద గురించి చర్చ మొదలైంది. అయితే ఇప్పుడు తాజాగా జరుగుతున్న చర్చ ఏంటయ్యా అంటే.. నిత్యానంద చనిపోలేదట.. ఆయన బతికే ఉన్నారట.. ఒకవేళ నిత్యానంద గనక సజీవ సమాధి అయితే ఆ నాలుగు వేల కోట్లు ఎవరికి దక్కుతాయనేది ప్రశ్నగా మిగిలింది. నిత్యానందకు వందల కోట్ల విలువైన కైలాసద్వీపం ఉంది. మనదేశంలో బిడది.. తిరువన్నామలై.. అహ్మదాబాద్ ప్రాంతంలో విలువైన ఆశ్రమాలు ఉన్నాయి. వీటి విలువ 400 కోట్ల దాకా ఉంటుంది. ఒకవేళ నిత్యానంద సజీవ సమాధి అయితే.. ఆ ఆస్తులు అతడి శిష్యురాలు రంజితకే చెందుతాయని తెలుస్తోంది. రంజిత చాలా సంవత్సరాలుగా నిత్యానంద తోనే ఉంటున్నది. నిత్యానంద ఆశ్రమాల పర్యవేక్షణ మొత్తం ఆమె చూసుకుంటున్నది.. విదేశాల నుంచి వచ్చే విరాళాలు.. స్వదేశం నుంచి వచ్చే విరాళాలు కూడా ఆమె చూసుకుంటున్నది. డబ్బు విషయంలో నిత్యానంద రంజితను మినహా మిగతావారెవరినీ దగ్గరికి రానిచేవారు కాదు. దీంతో ఆశ్రమానికి సంబంధించిన ఆర్థిక వ్యవహారాలు మొత్తం రంజితకు మాత్రమే తెలుసు. దీంతో ఇప్పుడు ఆస్తులు మొత్తం ఆమెకే దక్కుతాయని తెలుస్తోంది. నిత్యానంద ఆశ్రమాల్లో ఆయన కుటుంబ సభ్యులు కూడా ఇతర వ్యవహారాలను పరిశీలిస్తున్న నేపథ్యంలో.. ఆస్తుల వివాదం ఏ మలుపు తీసుకుంటుందో చూడాల్సి ఉంది.
Also Read : నువ్వు తోపు స్వామీ.. తన ఆస్థాన ప్రేయసి రంజితను ఏకంగా దేశ ప్రధానిని చేసేసిన నిత్యానంద