Nepal Protests: దేశం మీద దేశ ప్రజలకు ప్రేమ ఉండాలి. ముఖ్యంగా యువతరానికి బాధ్యత ఉండాలి. ఉడుకు నెత్తురు, ఉక్కు కండరాలున్న యువతకు దేశం బాగు గురించి సోయి ఉండాలి. అలాకాకుండా వయసు వేడిలో ఉద్రేకానికి గురై.. ఇష్టానుసారంగా ప్రవర్తిస్తే అంతిమంగా అది దేశం మీద ప్రభావం చూపిస్తుంది.
డ్రాగన్ దేశంలో యువత కష్టపడి పనిచేస్తుంది. అందువల్లే ఆదేశం ఆర్థికంగా అమెరికాను సైతం ఢీకొట్టగలిగే స్థాయికి ఎదిగింది. జర్మనీలో యువత కొత్త ఆవిష్కరణలవైపు ప్రయాణం చేస్తూ ఉంటుంది. అందువల్లే ప్రపంచ ఆటోమొబైల్ రాజధానిగా జర్మనీ కొనసాగుతోంది. జపాన్ యువత స్వయం ప్రతిపత్తి వైపు దృష్టిసారిస్తూ ఉంటుంది. అందువల్లే ఆ దేశంలో సరికొత్త ఆవిష్కరణలు వెలుగులోకి వస్తుంటాయి. ఈ మూడు దేశాలు మాత్రమే కాదు ప్రపంచంలో అనేక దేశాలలో కూడా యువత సన్మార్గం వైపు ప్రయాణం చేస్తూ ఉంటుంది. అందువల్లే ఆ దేశాలు ఆర్థికంగా బలంగా ఉన్నాయి. సామాజికంగా దృఢంగా ఉన్నాయి. అంతేతప్ప నిత్యం అల్లర్లతో.. అడ్డగోలు వ్యవహారాలతో పరువు తీసుకోవడం లేదు. కానీ నేపాల్ దేశం యువత మాత్రం అవినీతిని అంతం చేయాలి అనే ఉద్దేశంతో ఉద్యమాలు చేసినప్పటికీ.. చివరికి తమ పరువు తామే తీసుకున్నారు.
అవినీతి, ఆశ్రిత పక్షపాతం, అడ్డగోలు వ్యవహారాలతో ప్రభుత్వ పెద్దల పట్ల నేపాల్ యువత ఆగ్రహం పెంచుకుంది. వారి ప్రభుత్వాన్ని కూలదోసే దాకా.. వారిని దేశ సరిహద్దులకు తరిమి తరిమి కొట్టేదాకా నిద్రపోలేదు. ఇంతవరకు బాగానే ఉన్నప్పటికీ ఆ తర్వాత జనరేషన్ జెడ్ తరం వ్యవహరించిన తీరు ఇబ్బందికరంగా మారింది.. చిత్ర విచిత్రమైన చేష్టలకు పాల్పడుతూ.. దారుణాలకు ఒడిగడుతూ అక్కడి యువత చేసిన పనులు ఇబ్బంది కలిగిస్తున్నాయి. ఆ సంఘటనకు సంబంధించిన వీడియోలు సామాజిక మాధ్యమాలలో సందడి చేస్తున్నాయి. అక్కడి యువత వ్యవహరిస్తున్న తీరు పట్ల ప్రపంచ వ్యాప్తంగా ఆగ్రహం వ్యక్తం అవుతుంది. వాస్తవానికి నియంత ప్రభుత్వాన్ని గద్దె దించామని గొప్పగా చెప్పుకుంటున్న నేపాల్ యువత.. వారు కూడా నియంతల మాదిరిగానే ప్రవర్తిస్తున్నారని నెటిజన్లు విమర్శిస్తున్నారు.
Now I understand why Nepal ranks 92nd in the Happiness Index !! pic.twitter.com/arhmDVEH2q
— Dr Poornima (@PoornimaNimo) September 12, 2025