NASA Chief: అమెరికా నూతన అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టేందుకు రిపబ్లికన్ పార్టీ నేత డొనాల్డ్ ట్రంప్ సిద్ధమవుతున్నారు. అధికార బదిలీకి మరో రెండు నెలల సమయం ఉంది. దీంతో ఈలోగా తన కేబినెట్లో పదవులు, వైట్‌హౌస్ కార్యవర్గంలో పదవుల నియామకంపై దృష్టి పెడుతున్నారు. ఇప్పటికే పలువురు విధేయులను కీలక పదవులకు ఎంపిక చేశారు. ఇందులో భారత మూలాలు ఉన్నవారు కూడా ఉన్నారు. ఇక ప్రపంచ కుబేరుడు, టెస్లా, ఎక్స్ సీఈవో ఎలాన్ మస్క్‌ను డోజ్(డిజార్ట్‌మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫీషియన్సీ) కో చైర్మన్‌గా నియమించారు. మరో కో చైర్మాన్గా భారతీయ మూలాలు ఉన్న వివేక్ రామస్వామిని నియమించారు. ఇక పలువురికి కీలక బాధ్యతలు ఇవ్వాలని నిర్ణయించారు. ఈ క్రమంలో తాజాగా మరో కీలక పోస్టును భర్తీ చేశారు. అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా చీఫ్‌గా ఎలాన్ మస్క్ స్నేహితుడిని నియమించారు.
ప్రపంచంలో అగ్రగామి…
అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ నాసా. దీనికి ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు ఉంది. ప్రపంచంలోనే అతిపెద్ద అంతరిక్ష పరిశోధన సంస్థ కూడా ఇదే. ఈ సంస్థకు తదుపరి చీఫ్‌గా బిలియనీర్, ప్రైవేటు వ్యోమగామి జేర్డ్ ఐజాక్‌మెన్‌ను నామినేట్ చేశారు. ఈయన స్పేస్ ఎక్స్ అధినేత ఎలాన్ మస్క్‌కు వ్యాపార సహచరుడు. రాబోయే 30 ఏళ్లలో అంగారకుడిపై మానవులు జీవించాలని లక్ష్యంగా పెట్టుకున్న మస్క్.. ఈమేరకు నాసా సహకారం తీసుకునేందుకు ఎన్నికల సమయంలో ట్రంప్ గెలుపు కోసం పనిచేశారు. తర్వాత ట్రంప్ ప్రభుత్వంలో కీలక పోస్టు దక్కించుకున్నారు. ఇప్పుడు నాసా చీఫ్‌గా తన వ్యాపార సహచరుడిని నియమించేలా చేశారు.
ట్రంప్ ట్వీట్..
వ్యాపార వేత్త, పైలట్, వ్యోమగామి అయిన జేర్డ్ ఐకాన్మెన్ను నేషనల్ ఏరోనాటిక్స్ అండ్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్(నాసా) అడ్మినిస్ట్రేటర్‌గా నామినేట్ చేసినందుకు సంతోషంగా ఉంది అని ట్రంప్ తన సొంత సోషల్ మీడియా ట్రూత్‌లో పోస్టు చేశారు. జేర్డ్ నాయకత్వంలో నాసా మరింత పురోగమిస్తుందని తెలిపారు. స్పేస్ సైన్స్, టెక్నాలజీలో సరికొత్త లక్ష్యాలను చేరుకుంటుందని విశ్వసిస్తున్నట్లు పేర్కొన్నారు.
ఎవరీ జేర్డ్ ఐజాక్‌మెన్..
షిఫ్ట్ 4 పేమెంట్స్ కంపెనీ సీఈవోగా ఉన్న 41 ఏళ్ల జార్డ్ ఐజాక్‌మెన్ తన 16వ ఏటనే ఈ కంపెనీని ప్రారంభించారు. ప్రభుత్వం, రాజకీయాలతో పెద్దగా పరిచయాలు లేవు. రెండుసార్లు అంతరిక్షంలోకి వెళ్లి వచ్చారు. అంతరిక్షంలో స్పేస్‌వాక్ చేసిన తొలి ప్రైవేటు వ్యోమగామిగా గుర్తింపు పొందారు. ఈ ఏడాది సెప్టెంబర్‌లో స్పేస్ ఎక్స్ సంస్థ పొలారిస్ డాన్ ప్రాజెక్టు కింద ఫాల్కన్–9 రాకెట్లో నలుగురు వ్యోమగాములు నింగిలోకి పంపి చరిత్ర సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ నలుగురిలో ఒకరు ఐజాక్‌మెన్. ఆయన అంతరిక్షంలో క్యాప్సుల్ నుంచి బయటకు వచ్చి స్పేస్‌వాక్ చేశారు.
స్పేస్ ఎక్స్‌లో కీలకంగా..
జార్డ్ ఐజాక్‌మెన్ స్పేస్ ఎక్స్‌లో కీలక పాత్ర పోషిస్తున్నాడు. 2021లో ఈ కంపెనీని స్థాపించి ఇన్షిరేషన్ 4 ఆర్బిటాల్ మిషన్‌కు సొంతంగా 200 మిలియన్ డాలర్లు ఇచ్చారు. ఈ ప్రాజెక్టుకు కమాండర్‌గా వ్యవహరించారు.
Raj Sekhar is a senior content writer with good knoledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.
Read MoreWeb Title: Nasa chief jared isaacman has been selected as the next chief of nasa trump announced
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com