Prince George : బ్రిటన్ మహారాణి ‘క్వీన్ ఎలిజిబెత్2’ మరణం తర్వాత ఆమె వారసులంతా కలిసి అంత్యక్రియలను ఘనంగా నిర్వహించారు. రాణి కుమారుడు కొత్త మహారాజుగా కింగ్ చార్లెస్ బాధ్యతలు స్వీకరించాడు. అయితే ఈ వేడుకలను అంతా చూసిన చార్లెస్ మనవడికి పొగరు తలకెక్కింది. తాత చార్లెస్ తర్వాత రాజు మా నాన్నే అంటూ స్కూల్లో హల్ చల్ చేశాడట.. ఏకంగా తోటి విద్యార్థులను బెదిరింపులకు గురిచేసినట్టు బ్రిటన్ మీడియా కోడై కూస్తోంది. రాజులు, రాచరికాలు పోయినా.. ఈ పిల్లల్లో ఇంకా ఆ గర్వం, తలపొగరు ఉందంటే వారి ఇగో ఎంతగా వైఫైలో ఉందో అర్థం చేసుకోవచ్చు.

కింగ్ చార్లెస్-3 ప్రస్తుతం బ్రిటన్ మహారాజుగా బాధ్యతలు స్వీకరించాడు. ఈయన తర్వాత కుమారుడు విలియం బ్రిటిష్ సింహాసనానికి వారసత్వపు వరుసలో రాజు అవుతాడు. అయితే విలియం కుమారుడు అప్పుడే తమ నాన్న నెక్ట్స్ రాజు అవుతాడని బెదిరింపులకు పాల్పడడం అందరినీ ముక్కున వేలేసుకునేలా చేిసంది. అప్పుడే రాచరికం తలకెక్కిందా? అని అందరూ విమర్శలు గుప్పిస్తున్నారు..
విలియం కుమారుడు చదువుతున్న స్కూల్ లో తాజాగా తోటి విద్యార్థిని బెదిరించాడట.. ప్లేగ్రౌండ్ లో జరిగిన గొడవలో తోటి సహవిద్యార్థిని ప్రిన్స్ జార్జ్- విలియం మొదటి సంతానం నోరుపారేసుకున్నాడట.. “మా నాన్న రాజు అవుతాడు కాబట్టి మీరు జాగ్రత్తగా ఉండండి.” అంటూ తోటి విద్యార్థిని హెచ్చరించాడట.. ఈ విషయాన్ని ఇటీవల విడుదలైన కేటీ నికోల్ అనే రచయిత్రి రాసిన ‘ది న్యూ రాయల్స్ – క్వీన్ ఎలిజబెత్ లెగసీ అండ్ ది ఫ్యూచర్ ఆఫ్ ది క్రౌన్’ పుస్తకంలో పొందుపరిచారు.-
“ప్రిన్స్ విలియం -ప్రిన్సెస్ కేట్ తమ పిల్లలను అప్పుడే తాము రాజు అయిపోయినట్టు ఫోకస్ చేసినట్టున్నారు. వారసత్వంగా పొందబోయే పాత్ర గురించి అవగాహనతో పెంచుతున్నారు, కానీ వారు ఇలా ముందస్తుగా పిల్లలను పెంచడం సరికాదని” కేటీ నికోల్ అనే రచయిత విమర్శలు గుప్పించారు.
“జార్జ్ ఒక రోజు రాజు అవుతాడని అర్థం చేసుకున్నాడు. ఒక చిన్న పిల్లవాడు పాఠశాలలో స్నేహితుల ముందు ఇలా గొప్పలకు పోయాడు. ‘మా నాన్న రాజు అవుతాడు కాబట్టి మీరు జాగ్రత్తగా ఉండండి అని బెదిరించే స్థాయికి చేరాడు” అని పుస్తకంలో రాశారు..
కింగ్ చార్లెస్-3 పెద్ద మనవడు ప్రిన్స్ జార్జ్ స్కూల్లో ఈ మాట అన్నట్టుగా మీడియాలో వచ్చింది. ప్రిన్స్ జార్జ్ తండ్రి విలియం తర్వాత బ్రిటిష్ సింహాసనానికి వారసత్వపు వరుసలో రాజు అవుతాడని అతడు ధీమాగా ఉన్నాడు. ఈ సంఘటన దక్షిణ లండన్‌లోని యువ రాయల్ పాఠశాల ‘థామస్ బాటర్‌సీ’లో జరిగినట్లు తెలిసింది.. ఇలా ఇప్పుడే పిల్లల్లో వారసత్వాన్ని నిపండం.. బెదిరింపులకు దిగేలా ప్రోత్సహించడం చూసి.. రాజకుమారులకు అప్పుడే పొగరు తలకెక్కింది అని అందరూ విమర్శలు గుప్పిస్తున్న పరిస్థితి నెలకొంది.