Pakistan And Afghanistan: వారం రోజులుగా ఆఫ్గానిస్తాన్‌పై దాడులతో విరుచుకుపడుతున్న ఆఫ్గానిస్తాన్‌తో ఎట్టకేలకు కాల్పుల విరమణ ఒప్పందం జరిగింది. అస్థిరంగా ఉన్న పాక్–అఫ్గాన్ సరిహద్దుల్లో చివరికి శాంతి సంకేతాలు కనిపిస్తున్నాయి. ఖతార్ రాజధాని దోహాలో జరిగిన చర్చల తరువాత రెండు దేశాలు తక్షణ కాల్పుల విరమణకు అంగీకరించాయి. ఈ చర్చలకు ఖతార్, తుర్కియే మధ్యవర్తిత్వం వహించగా, ఇరుదేశాల రక్షణ మంత్రులు పాక్‌కు ఖ్వాజా మహ్మద్ అసఫ్, అఫ్గాన్‌కు ముల్లా మహ్మద్ యాకూబ్ నేతృత్వం వహించారు.
రక్తపాతం తరువాత శాంతి చర్చలు..
గత వారం నుంచి సరిహద్దుల్లో ఘర్షణలు ఉధృతమయ్యాయి. పాకిస్తాన్ చేసిన వైమానిక దాడులు అఫ్గాన్ భూభాగంలోని పాక్షికా ప్రావిన్స్‌లో ఉన్న దళాలపై దాడి చేయడం వల్ల పౌరులతో సహా పది మందికి పైగా మృతి చెందారని కాబూల్ ఆరోపించింది. మరోవైపు ఇస్లామాబాద్ మాత్రం ‘‘మిలిటెంట్ శిబిరాలపై మాత్రమే దాడి చేశాం’’ అని పేర్కొంది. ఈ ఘర్షణలు 2021లో తాలిబాన్ అధికారం చేపట్టిన తరువాత రెండు దేశాల మధ్య జరిగిన అత్యంత తీవ్రమైన సరిహద్దు ఉద్రిక్తతలుగా నిలిచాయి.
ఘర్షణ కారణం?
ఇస్లామాబాద్ తరఫు వాదన ప్రకారం, టీటీపీ(త్రెహీకే – ఇ – తాలబాన్ పాకిస్తాన్) ఉగ్రవాదులకు అఫ్గాన్ ఆశ్రయం లభిస్తోంది. వారు పాక్‌లో తరచూ దాడులు నిర్వహిస్తున్నారని ఆరోపిస్తోంది. అఫ్గాన్ ప్రభుత్వం మాత్రం ఈ ఆరోపణలను తిరస్కరిస్తూ, పాక్ తానే ఉగ్రవాదులను ఉపయోగించి ఇస్లామిక్ స్టేట్ సంబంధిత వర్గాలపై ఆధిపత్యం కాయముచేసుకోవాలనే ప్రయత్నం చేస్తోందని ప్రతివాదన చేసింది.
శాంతి కోసం మొదటి అడుగు..
దోహాలో జరిగిన రెండు దఫాల చర్చల్లో ఇరుదేశాలు తక్షణ కాల్పుల విరమణ మాత్రమే కాక, శాశ్వత శాంతి కోసం నిర్మాణాత్మక వ్యవస్థలను ఏర్పరచుకోవాలని నిర్ణయించుకున్నాయి. ఇస్తాంబుల్‌లో అక్టోబర్ 25న మరో సమావేశం జరిపి శాంతి ఒప్పందం స్థిరత్వం, అమలుకు సంబంధించిన వివరాలపై చర్చించనున్నట్టు పాక్ రక్షణ శాఖ ప్రకటించింది. ఈ ఒప్పందం తాత్కాలిక ఉపశమనమే అయినా, ప్రాంతీయ భద్రతకు ఇది ఒక కీలక పాయింట్‌గా నిలుస్తోంది. పాక్‌కు ఆర్థిక సంక్షోభం, అంతర్గత దాడుల నుంచి ఉపశమనం అవసరం. అఫ్గాన్ ప్రభుత్వానికి అంతర్జాతీయ వైరోధ్యాలనుంచి బయటపడేందుకు శాంతి మార్గం తప్ప వేరొకదీ లేదు.
దోహా ఒప్పందం పాక్–అఫ్గాన్ సంబంధాల పునరుద్ధరణకు తాత్కాలిక శాంతి వేదికగా నిలిచింది. ప్రతీ సారి మాదిరిగానే, ఈసారి కూడా టీటీపీ ఉగ్రవాదం ప్రధాన వివాద అంశంగా మిగిలింది. సరిహద్దు భద్రతా మెకానిజం స్థిరంగా అమలైతేనే శాంతి దీర్ఘకాలం నిలుస్తుందనే స్పష్టత ఉంది.