Missile Hits Anchor: పశ్చిమాసియాలో అత్యంత కీలక దేశమైన ఇరాన్ లో పరిస్థితులు అంతకంతకూ దారుణంగా మారుతున్నాయి. ఇజ్రాయిల్ దాడుల మీద దాడులు చేస్తుండడంతో అక్కడ ఏ క్షణం ఏం జరుగుతుందో అర్థం కాని పరిస్థితి ఏర్పడింది.
ఇటీవల ఇజ్రాయిల్ ఇరాన్ మీద దాడులు మొదలుపెట్టింది. దానికి ప్రతిగా ఇరాన్ కూడా బీభత్సంగా దాడులు చేయడం ప్రారంభించింది. మిసైల్స్ వదలడంతో ఇజ్రాయిల్ లోనూ భారీగా నష్టం చోటుచేసుకుంది. దీంతో తమ దేశ ప్రజలకు రహస్య బంకర్లలో ఇజ్రాయిల్ దేశం ఆవాసం కల్పిస్తోంది. దీనికి సంబంధించిన వీడియోలు సామాజిక మాధ్యమాలలో తెగ సందడి చేస్తున్నాయి.. ఇజ్రాయిల్ కూడా ఇరాన్ రాజధానిపై బాంబుల వర్షం కురిపించింది. ఇప్పటికీ కురిపిస్తూనే ఉంది. నష్టం గురించి ప్రాథమికంగా అంచనా అయితే రాలేదు గానీ.. ఆ నష్టం తీవ్ర స్థాయిలో ఉందని తెలుస్తోంది. ముఖ్యంగా ఇరాన్ లో తమ సీక్రెట్ గూడచారి వ్యవస్థ ద్వారా అత్యంత కీలకమైన ఆపరేషన్లు చేపట్టిన ఇజ్రాయిల్.. భారీగా నష్టాన్ని చేకూర్చే పనులు చేసింది. ఇప్పటికే ఇరాన్ అణు శాస్త్రవేత్తలను అనుమానాస్పద దాడి ద్వారా చంపేసినట్టు తెలుస్తోంది. చనిపోయిన శాస్త్రవేత్తల బృందంలో ఆరుగురు దాకా ఉన్నారని సమాచారం. ఇరాన్ ప్రభుత్వంలో పెద్దలను లక్ష్యంగా చేసుకొని ఇజ్రాయిల్ చేసిన దాడిలో చాలామంది ప్రాణాలు కోల్పోయారని తెలుస్తోంది.
Also Read: Iran Womens: ఇరాన్ తీరే అంత: మహిళలు వారి దృష్టిలో కట్టు బానిసలు.. వారితో ఏమేం చేస్తారో తెలుసా?
మిస్సైల్ పక్క భవనంలో పడింది
శత్రుదేశం చేస్తున్న దాడి వల్ల ఇస్లాం మతాన్ని ఆచరించే దేశంలో పరిస్థితి దారుణంగా మారిపోయింది. ఇస్లాం దేశ రాజధానిలో పెద్ద పెద్ద భవంతులు మొత్తం నేలమట్టమయ్యాయి. కాంక్రీట్ వ్యర్ధాలతో నగరం మొత్తం స్మశానాన్ని తలపిస్తోంది.. ఇక తాజాగా శత్రుదేశం చేసిన దాడుల్లో ఇస్లాం దేశంలోని ప్రభుత్వ న్యూస్ ఛానల్ భవనం ధ్వంసం అయింది.. శత్రుదేశం ప్రయోగించిన మిస్సైల్ ప్రభుత్వ న్యూస్ స్టూడియో భవనాన్ని ఢీ కొట్టింది. మిస్సైల్ తాకిడికి భవనం మొత్తం ఒక్కసారిగా కంపించిపోయింది. విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. అప్పటిదాకా వార్తలు చదువుతున్న న్యూస్ యాంకర్ ఒక్కసారిగా వణికిపోయింది. ఆ తర్వాత అక్కడ నుంచి ఆమె పారిపోయింది. మరోవైపు ఇస్లాం దేశంలో ఉన్న శత్రుదేశానికి సంబంధించిన రహస్య ఏజెంట్ల కోసం అక్కడి పోలీసులు ముమ్మరంగా వెతుకుతున్నారు. ఇందులో ఇద్దరు ఏజెంట్లను పట్టుకున్నారు. అయితే వారిద్దరు కూడా సజీవంగా ఉన్నారు. వారి వద్ద నుంచి భారీగా ఆయుధాలను పోలీసుల స్వాధీనం చేసుకున్నారు.. వారిని ప్రత్యేక జైలుకు తరలించి.. విచారిస్తున్నారు.. వారి ప్రణాళిక ఏమిటి, ఎక్కడెక్కడ బాంబులు అమర్చారు, ఏ ప్రాంతాలలో విధ్వంసానికి రూపకల్పన చేశారు, అనే దిశగా విచారణ సాగిస్తున్నారు. ఇటీవల రహస్య ఏజెంట్ల వల్లే శత్రుదేశం అత్యంత రహస్యమైన ఆపరేషన్లను ఇస్లాం దేశంలో చేపట్టింది. మిసైల్స్ ప్రయోగించకుండా, ఎటువంటి ఫైటర్ జెట్లు వాడకుండా పెను విధ్వంసాన్ని సృష్టించింది. వాస్తవానికి ఈ పరిణామాన్ని ఇస్లాం దేశం ఊహించలేదు. ఇస్లాం మతాన్ని ఆచరించే దేశం మేల్కొనే లోపే భారీగా నష్టం చోటుచేసుకుందని అంతర్జాతీయ మీడియాలో వార్తలు వస్తున్నాయి.