Melania Documentary: మెలానియా ట్రంప్.. ప్రపంచానికి పరిచయం అక్కరలేని పేరు. అగ్రరాజ్యాధినేత డొనాల్డ్ ట్రంప్ సతీమని మెలానియా. అమెరికా ఫస్ట్ లేడీ. ట్రంప్‌కు, మెలానియాకు మధ్య వయసులో చాలా తేడా ఉంటుంది. అందంగా ఉండే మెలానియా ఇటీవల సినిమారంగంవైపు మళ్లింది. తాజాగా ఆమె ఒక డాక్యుమెంటరీని రూపొందించింది. ప్రస్తుతం వెనెజువెలా, గ్రీన్లాండ్ వివాదం నడుస్తున్న సమయంలో మెలానికి తన డాక్యుమెంటరీ రిలీజ్ డేట్ ఫిక్స్ చేసింది. మరో ఏడు రోజుల్లో థియేటర్లలోకి రాబోతోంది అని డొనాల్డ్ ట్రంప్ ఎక్స్ వేదికగా డాక్యుమెంటరీపై వీడియో పోస్టు చేసి హైప్ తెచ్చారు.
20 రోజుల్లో నిర్మాణం..
జీవితంలో ఒక ముఖ్యమైన అధ్యాయాన్ని ఆవిష్కరిస్తున్న ‘మెలానియా..హిస్టరీకి ఇరవై రోజులు‘ డాక్యుమెంటరీ రాబోయే రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ చిత్రం జనవరి 30, 2026న థియేటర్లలో విడుదల కానుంది. ప్రపంచవ్యాప్తంగా ఏడు రోజుల కౌంట్‌డౌన్ ప్రారంభమైంది – ఇది కేవలం ఒక డాక్యుమెంటరీ కాదు, ముఖ్యమైన చారిత్రక ఘట్టం వెనుక దాగి ఉన్న వాస్తవాలను, భావోద్వేగాలను, నిర్ణయాలను ప్రత్యక్షంగా చూపించే అరుదైన అవకాశం. అని ట్రంప్ ఎక్స్‌లో పోస్టు చేసిన వీడియోలో చూపించారు.
ఇందులో ఏముంటుంది?
ఈ డాక్యుమెంటరీ డొనాల్డ్ ట్రంప్ రెండవసారి అధ్యక్ష పదవి ప్రారంభోత్సవానికి ముందు 20 రోజుల కాలాన్ని కేంద్రంగా చేసుకుంది. ఈ సమయంలో మెలానియా ట్రంప్ ప్రథమ మహిళగా ఎలాంటి బాధ్యతలు నిర్వహించారు? ఇనాగురేషన్ వేడుకల సన్నాహాలు, వైట్ హౌస్ బదిలీ ప్రక్రియ, కుటుంబాన్ని తిరిగి వాషింగ్టన్కు తరలించడం వంటి సంక్లిష్టమైన అంశాలను ఆమె ఎలా సమన్వయం చేశారో ఇది వివరిస్తుంది. ఈ చిత్రంలో అత్యంత ముఖ్యమైన అంశం – అపూర్వమైన ప్రవేశం. మెలానియా ట్రంప్ తన జీవితంలోకి, నిర్ణయాల్లోకి, భావోద్వేగాల్లోకి ప్రేక్షకులను నేరుగా తీసుకెళ్తారు. ఇది సాధారణ డాక్యుమెంటరీల కంటే భిన్నంగా, ఒక ప్రథమ మహిళ దృక్కోణం నుంచి చారిత్రక సంఘటనను చూపిస్తుందని తెలుస్తోంది.
ఎందుకు ఇది ముఖ్యమైనది?
ఒక వ్యక్తి రెండోసారి అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన తర్వాత, ఆ కుటుంబం మళ్లీ వైట్ హౌస్‌లోకి అడుగుపెట్టిన ఆ క్షణాలు అమెరికా చరిత్రలో అరుదైనవి. ఈ 20 రోజులు రాజకీయాలు, వ్యక్తిగత జీవితం, కుటుంబ బాధ్యతల మధ్య సమతుల్యతను తెలియజేస్తాయి. సాధారణంగా మీడియాలో కనిపించని ఆలోచనలు, సంభాషణలు, ఒత్తిడి నిండిన నిమిషాలు ఇక్కడ బయటపడతాయి. మెలానియా దృక్పథం, ఆమె సౌమ్యత, శైలి, నిశ్శబ్ద శక్తి ఈ చిత్రంలో ప్రతిబింబిస్తాయి. ఇది ఆమెను కేవలం ‘ప్రథమ మహిళ‘గా కాకుండా, ఒక వ్యక్తిగా, తల్లిగా, భార్యగా చూపిస్తుంది.
జనవరి 30న థియేటర్లలో విడుదల అయ్యే ఈ డాక్యుమెంటరీ ప్రపంచవ్యాప్తంగా శ్రద్ధ ఆకర్షిస్తోంది. ఇది రాజకీయాలు, వ్యక్తిగత జీవితం మధ్య ఉండే సూక్ష్మమైన సమతుల్యతను, ఒక మహిళ ఎదుర్కొన్న సవాళ్లను, ఆమె తీసుకున్న నిర్ణయాలను అర్థం చేసుకోవడానికి అవకాశం కల్పిస్తుంది. ఈ ఏడు రోజుల కౌంట్‌డౌన్ ప్రతి నిమిషం ఉత్కంఠగా మారుతోంది.
COUNTDOWN: 7 Days until the World will witness an unforgettable, behind-the-scenes, look at one of the most important events of our time.
MELANIA: TWENTY DAYS TO HISTORY:https://t.co/rjwd5Appkv pic.twitter.com/AHD0rn1M7C
— Donald J. Trump (@realDonaldTrump) January 23, 2026