Japanese demolition technology: భవనాలు కూల్చివేడయం ఒక పెద్ద ప్రహసనం. ముఖ్యంగా నగరాల్లో అయితే చుట్టూ ఉన్న అనేక కుటుంబాలు ప్రభావితం అవుతాయి. దుమ్మ, శబ్దం కారణంగా ప్రజలు ఇబ్బంది పడతారు. ఇక కూల్చివేతతో కొన్ని సందర్భాల్లో సమీపంలోని భవనాలు కూడా దెబ్బతినే ప్రమాదం ఉంది. కానీ, వీటికి పరిష్కారం కనిపెట్టింది టెక్నాలజీ దేశం జపాప్. దుమ్మ లేవకుండా.. శబ్దం రాకుండా తక్కువ సమయంలో భవనాలు కూల్చే సాంకేతికతను తీసుకువచ్చింది.
ఇన్‌విజబుల్ మెకానిజం..
జపాన్‌లో అమలులో ఉన్న ’ఇన్విజిబుల్ మెకానిజం’ పద్ధతి పట్టణ ప్రాంతాల్లో భవనాలను తొలగించడానికి విప్లవాత్మక మార్గం. ఇక్కడ ధూళి గాలిలో కలవదు, శబ్దాలు చుట్టూ వ్యాపించవు. 40 అంతస్తుల భవనాన్ని కేవలం ఆరు నెలల్లో పూర్తిగా తొలగించారు. ఈ ప్రక్రియ పర్యావరణానికి, పొరుగు నివాసులకు ఎటువంటి ఇబ్బంది కలిగించదు. ఇది రద్దీగా ఉండే నగరాల్లో అభివృద్ధి ప్రాజెక్టులకు ఆదర్శవంతం.
క్రమబద్ధమైన ప్రక్రియ..
ప్రక్రియ మొదలైనప్పుడు, భవనం చుట్టూ శబ్దాన్ని అడ్డుకునే రక్షణ పొరను ఏర్పాటు చేస్తారు. ఆ తర్వాత, పై అంతస్తు నుంచి క్రమంగా కింది మాళ్ల వరకు తొలగింపు చేస్తారు. హైడ్రాలిక్ జాక్‌లతో ఈ పొరను నెమ్మదిగా కిందకు తగ్గిస్తారు. ప్రతీ దశలో కచ్చితమైన ఇంజనీరింగ్, భవన భారాన్ని సమతుల్యం చేసే సాంకేతికత ఉపయోగిస్తారు. ఫలితంగా, భవనం క్రమంగా ’అదృశ్యమవుతుంది’. బయటి ప్రపంచానికి ఎటువంటి ఇబ్బందులు ఉండవు.
ఈ పద్ధతి పర్యావరణ హానులను తగ్గిస్తుంది. పొరుగు వ్యాపారాలు, నివాసాలకు భంగం కలగకుండా చేస్తుంది. సంప్రదాయ కూల్చివేతల్లో రోజులు, వారాలు పట్టే పని ఇక్కడ నెలల్లో పూర్తవుతుంది. జపాన్‌లోని భూకంపాలు, రద్దీ నగరాలు ఈ సాంకేతికతను పరిపూర్ణం చేశాయి. భారతదేశం వంటి దేశాల్లో దీన్ని అమలు చేస్తే, ముంబై, ఢిల్లీలో పాత భవనాల తొలగింపు సులభమవుతుంది.