Nikki Haley Son: ఒళ్ళు వంచితే ఏ పని అయినా చేయవచ్చు.. కష్టపడే సామర్ధ్య ఉంటే ఎన్ని డబ్బులయినా సంపాదించవచ్చు. ఒళ్ళు వంచే సామర్థ్యం ఉన్నప్పటికీ బద్ధకం ఉంటే ఏ పనీ చేయాలనిపించదు. పైగా అన్ని కూడా కాళ్ల దగ్గరికి రావాలనిపిస్తుంది.. చెమట చుక్క చిందించకుండా ఉండాలనిపిస్తుంది. బహుశా ఈ అలవాట్లు అమెరికన్ లకు ఉన్నాయి కాబట్టి.. ఆ దేశానికి వలసలు పెరిగిపోతున్నాయి. ప్రపంచ ఆర్థిక ముఖచిత్రాన్ని అమెరికా ప్రభావితం చేస్తోంది కాబట్టి.. పైగా అమెరికా డాలర్ కు విపరీతమైన విలువ ఉంటుంది కాబట్టి ప్రపంచ వ్యాప్తంగా యువత అమెరికా వెళ్లాలి అనుకుంటారు. అక్కడ ఉన్నత ఉద్యోగాలు చేసి ఆర్థికంగా స్థిరపడాలని భావిస్తుంటారు. అమెరికాకు ప్రపంచ దేశాల నుంచి వలసలు ఉన్న నేపథ్యంలో.. అక్కడ స్థానికులకు ఉపాధి అవకాశాలు లభించడం లేదని ప్రచారం జరుగుతోంది. కాకపోతే విదేశీయుల మాదిరిగా అమెరికా ప్రజలు పనిచేయరు. పైగా వేతనాల విషయంలో కూడా అమెరికా దేశస్తులు బెట్టు చేస్తుంటారు. అక్కడ చట్టాల ప్రకారం వేతనాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తుంటారు.
అమెరికా ప్రజల కోరికలు అలా ఉంటాయి కాబట్టే అక్కడ కంపెనీలు విదేశీ ఉద్యోగులకు ఎక్కువ అవకాశాలు కల్పిస్తుంటాయి. పైగా విదేశీయులు తక్కువ వేతనాలకు పనిచేస్తుంటారు. ఇలా తక్కువ వేతనాలకు పని చేసేవారిలో భారతీయులు ముందు వరుసలో ఉంటారు. ఐటి, సైన్స్ అండ్ టెక్నాలజీ, ఫార్మా, బయోటెక్నాలజీ, రీసెర్చ్, ఎలక్ట్రానిక్స్, ఆటోమొబైల్, యుటిలిటీ ఇలా అన్ని రంగాలలో భారతీయులు కష్టపడి పనిచేసి.. తాము పని చేస్తున్న కంపెనీలకు లాభాలతో పాటు వారు కూడా సొంతంగా ఆర్థిక స్థిరత్వాన్ని సంపాదిస్తుంటారు. అందువల్లే అమెరికా కంపెనీలు భారతీయులకు ఎక్కువగా అవకాశాలు ఇస్తుంటాయి. ప్రస్తుతం గూగుల్, అడోబ్, మైక్రోసాఫ్ట్ వంటి పేరు పొందిన కంపెనీలకు సీఈవోలుగా భారతీయులు కొనసాగుతున్నారు. దీనిని బట్టి భారతీయులకు అమెరికాలో ఏ స్థాయిలో విలువ ఉందో అర్థం చేసుకోవచ్చు.
ఇటీవల కాలంలో ట్రంప్ అమెరికా అధ్యక్షుడు అయిన తర్వాత.. అమెరికా దేశస్థులకు అవకాశాలు అనే నినాదాన్ని తెరపైకి తీసుకొచ్చారు. అంతేకాదు వీసా నిబంధనలను కూడా అత్యంత కఠిన తరం చేశారు. ఈ నేపథ్యంలో అమెరికావ్యాప్తంగా నిరసనలు వ్యక్తం అవుతున్నాయి. ట్రంప్ వ్యవహార శైలి పట్ల తీవ్రస్థాయిలో మండిపడుతున్నాయి. ఇది ఇలా ఉంటే అమెరికాలోకి సామూహికంగా వలసలు పెరిగిపోతున్నాయని రిపబ్లికన్ నేత నిక్కీ హేలి కుమారుడు నలిన్ హెలి ఒక ట్వీట్ చేశారు. అది ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా చర్చకు దారితీస్తోంది. వలసల వల్ల అమెరికా పౌరులకు ఉద్యోగాలు లభించడం లేదని అతడు ఆ ట్వీట్ లో పేర్కొన్నాడు. దానికి బ్రిటిష్ అమెరికన్ జర్నలిస్ట్ మెహది హాసన్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. “మీ తాత కూడా ఇండియా నుంచి వచ్చారు.. అప్పుడు మీరు కూడా ఇండియాకు వెళ్లి పోవాల్సి ఉంటుంది. అలా వెళ్ళిపోతే మీరు అమెరికా పౌరుడు కాలేరు. ఇప్పుడు మీరు మాట్లాడుతున్న మాటలు పలాయన వాదాన్ని రుజువు చేస్తున్నాయని” హసన్ పేర్కొన్నారు. హసన్ స్ట్రాంగ్ రిప్లై ఇవ్వడంతో నలిన్ కు మాట్లాడే అవకాశం లేకుండా పోయింది.