Homeఅంతర్జాతీయంMaulana Fazlur Rehman: ఆపరేషన్‌ సిందూర్‌లో తప్పులేదు.. పాక్‌ నేత రెహ్మాన్‌ సంచలన కామెంట్స్

Maulana Fazlur Rehman: ఆపరేషన్‌ సిందూర్‌లో తప్పులేదు.. పాక్‌ నేత రెహ్మాన్‌ సంచలన కామెంట్స్

Maulana Fazlur Rehman: భారత్‌తో తరచూ కయ్యానికి కాలుదువ్వుతోంది పాకిస్తాన్‌. ఆ దేశ ప్రధాని షెహబాజ్‌ షరీఫ్, ఫీల్డ్‌ మార్షల్‌ ఆసిమ్‌ మునీర్‌ తరచూ భారత్‌ను బెదిరించే వ్యాఖ్యలు చేస్తున్నారు. ఏడాది కాలంగా అమెరికా అండ చూసుకుని రెచ్చిపోతున్నారు. ఇక భారత్‌ కూడా పాకిస్తాన్‌పై ఆపరేషన్‌ సిందూర్‌ 2.0 మొదలు పెడతామని హెచ్చరిస్తోంది. ఈ క్రమంలో పాకిస్తాన్‌ రాజకీయ నాయకుడు మౌలానా ఫజ్లూర్‌ రెహ్మాన్‌ తన దేశ సైనిక చర్యలను గట్టిగా విమర్శించారు. జమియత్‌ ఉలేమా ఈ ఇస్లాం ఎఫ్‌ చీఫ్‌గా, ఆఫ్ఘనిస్తాన్‌పై పాక్‌ దళాలు చేసిన దాడుల్లో సివిలియన్ల మరణాలకు దిగ్భ్రాంతి చెప్పారు. ఆ తర్వాత భారత్‌ను లక్ష్యంగా చేసుకుని, పొరుగు దేశంపై దాడి చేయడంలో ఏమి తప్పు ఉందని ప్రత్యేకంగా ప్రశ్నించారు. ఇది పాక్‌ విభేదాలను బహిర్గతం చేస్తోంది.

ఆపరేషన్‌ సింధూర్‌కు మద్దతు..
ఈ ఏడాది మే 7న భారత సైన్యం చేపట్టిన ’ఆపరేషన్‌ సింధూర్‌’కు రెహ్మాన్‌ మద్దతు తెలిపారు.ఏప్రిల్‌ 22న లష్కర్‌–ఎ–తౌహీద్‌ ఉగ్రవాదులు 26 మంది భారతీయులను హత్య చేసిన ప్రతీకారంగా, బహావల్పూర్, మురీద్కే, పీవోకేలోని తొమ్మిది శిబిరాలపై క్షిపణి దాడులు జరిగాయి. పాక్‌ నాయకుడు ఈ ఘటనను బహిరంగంగా చర్చించడం అసాధారణం, ఎందుకంటే ఇది దేశీయ రక్షణ విధానాలను సవాలు చేస్తుంది.

రెహ్మాన్‌ వాదనలో ఉద్దేశాలు
ఆఫ్ఘన్‌ దాడులు తప్పు అయితే భారత చర్యలు సరైనవేనా అనే రెహ్మాన్‌ లాజిక్‌ ఇప్పుడు చర్చనీయాంశమైంది. జేయూఐ–ఎఫ్‌ పార్టీ ఆఫ్ఘన్‌తో మతపరమైన సంబంధాలను బలోపేతం చేసుకోవాలని కోరుకుంటుంది. పాక్‌ సైన్యంతో పొరుగు విభేదాలు కూడా దీనికి కారణం. భారత దాడులను సమానం చేయడం ద్వారా, అంతర్జాతీయ ఒత్తిడిని పెంచి స్వంత దేశంలోని ఆధిపత్యాన్ని బలపరచాలని ఉద్దేశం. ఈ వ్యాఖ్యలు రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలను మరింత జటిలం చేస్తాయి. భారత్‌ ఉగ్రవాద శిబిరాలపై దాడి చేయడం స్వరక్షణగా భావిస్తుంది, ఇది పీవోకే, బాలాకోట్‌ వంటి మునుపటి ఘటనలను గుర్తు చేస్తూ, అంతర్జాతీయ మీడియాల్లో చర్చనీయాంశమవుతుంది. పాక్‌ ప్రభుత్వం ఈ మాటలకు స్పందన ఇవ్వాల్సి వస్తుంది.

రెహ్మాన్‌ మాటలు పాక్‌ రాజకీయాల్లో విభజనలను పెంచుతాయి. భారత్‌కు ఇది ఉగ్రవాద వ్యతిరేక చర్యలకు నైతిక మద్దతుగా మారవచ్చు. దీర్ఘకాలంలో ఆఫ్ఘన్‌–పాక్‌ సంబంధాలు దెబ్బతింటాయి, భారత్‌పై దౌత్య ఒత్తిడి తగ్గవచ్చు. మొత్తంగా ఈ వాదనలు ప్రాంతీయ భద్రతను మార్చేస్తాయి.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version