Maldives: భారత్‌తో పెట్టుకుంటే అడుక్కు తినుడే.. మొన్న పాకిస్తాన్‌.. నేడు మాల్దీవులు!

భారత్‌.. శాంతి కామిక దేశం. యుద్ధాలతో ఎలాంటి ప్రయోజనం ఉండదని చర్చలతోనే అన్ని సమస్యలకు పరిష్కారం లభిస్తుందని భారత్‌ భావిస్తుంది. అందుకే ఎవరితోనూ భారత్‌ కయ్యానికి కాలు దువ్వదు. కానీ, మన దేశం జోలికి ఎవరైనా వస్తే ఊరుకోదు. పాకిస్తాన్, మాల్దీవులు మనతో పెట్టుకుని ఇప్పుడు అడుక్కుతినే పరిస్థితికి చేరుకున్నాయి.

Written By: Raj Shekar, Updated On : September 5, 2024 11:21 am

Maldives

Follow us on

Maldives: భారత్‌లో అలజడి సృష్టించేందుకు, భారత్‌పై ఆధిపత్యం చెలాయించేందుకు పాకిస్తాన్‌ గతంలో అనేక ప్రయత్నాలు చేసింది. ఉగ్రవాదులను ప్రోత్సహిస్తూ.. అనేక దాడులు చేయించింది. పాఠాన్‌కోట్‌ ఘటనతోపాటు అనేక భారీ ఎన్‌కౌంటర్లతో భారత్‌ సైన్యాన్ని దెబ్బతీయాలని చూసింది. దీంతో ఓపిక నశించిన బారత్‌ పాకిస్తాన్‌ను తీవ్రంగా దెబ్బకొట్టింది. ఆదేశంతోపాటు, ఉగ్రవాదులు ఆర్థిక మూలాలను దెబ్బతీసేలా మోదీ పెద్దనోట్ల రద్దుతో సంచలన నిర్ణయం తీసుకున్నారు. మోదీ నిర్ణయంపై మొదట్లో దేశ ప్రజలు ఇబ్బంది పడ్డారు. ఆర్థిక ఇబ్బందులు ఎదురయ్యాయి. విపక్షాలు మోదీ నిర్ణయాన్ని తప్పు పట్టాయి. కానీ దాని ఫలితాలు మనకన్నా మన దాయాది దేశం పాకిస్తాన్‌పై తీవ్ర ప్రభావం చూపాయి. పాకిస్తాన్‌ తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయింది. అప్పులు చేస్తేగానీ రోజు గడవని పరిస్థితి. ఇక ఆదేశంలో నిత్యావసర ధరలు భారీగా పెరిగాయి. ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. నిరుద్యోగం గణనీయంగా పెరిగింది. చైనా, ప్రపంచ బ్యాంకు ఇచ్చే అప్పులపైనే ఆధారపడుతోంది. ఇప్పుడు మాల్దీవులు కూడా పాకిస్తాన్‌ బాటలోనే పయనిస్తోంది. చైనా అండ చూసుకుని కామధేనువులాంటి భారత్‌ను దూరం చేసుకుంది. దీంతో క్రమంగా తీవ్ర ఆర్థిక సంక్షోభం దిశగా పయనిస్తోంది.

చైనాకు అనుకూలంగా వ్యవహరిస్తూ..
గత ఏడాది మాల్దీవుల్లో కొత్త ప్రభుత్వం ఏర్పాటైన సంగతి తెలిసిందే. అయితే ప్రస్తుతం ఏర్పాటైన ప్రభుత్వం చైనాకు అనుకూలంగా వ్యవహరిస్తోంది. ఈ క్రమంలో లక్ష్యదీవుల్లో ప్రధాని మోదీ పర్యటించటం పెద్ద వివాదానికి దారితీసింది. మాల్దీవుల మంత్రులు ప్రధాని పర్యటనను తప్పుపడుతూ పోస్టులు పెట్టడంతో భారతీయ టూరిస్టులు ఆ దేశానికి వెళ్లడం మానేశారు. దీంతో పర్యాటకమే ప్రధాన ఆర్థికవనరైన మాల్దీవులపై ఇప్పుడు ఆ ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది. ఆర్థిక సమస్యను అధిగమించేందుకు తాజాగా మాల్దీవుల ఇస్లామిక్‌ బాండ్ల విక్రయం తీవ్రమైంది. 2026లో డాలర్‌–డినామినేటెడ్‌ సుకుక్‌ ఈ వారం రికార్డు కనిష్ఠ స్థాయి 70 సెంట్ల దిగువకు పడిపోయింది. దీంతో మాల్దీవుల నుంచి డిఫాల్ట్‌ ప్రమాదం పెరిగింది. జూన్‌ నుంచి రెండో ఫిచ్‌ డౌన్‌గ్రేడ్‌తోపాటు విదేశీ కరెన్సీ వ్యయాన్ని పరిమితం చేయడానికి బ్యాంక్‌ ఆఫ్‌ మాల్దీవ్స్‌ చేసిన ఇటీవలి ఎత్తుగడలు ఆఫ్‌లోడ్‌ హోల్డింగ్‌లను రేకెత్తించాయి. సుకుక్‌ రుణంలో 500 మిలియన్‌ డాలర్లు 2026లో మెచ్యూర్‌ అవుతున్నందున అందరి దృష్టి అక్టోబర్‌ 8న కూపన్‌ చెల్లింపుపైనే ఉంది.

భారత్‌తో చర్చలు..
జూన్‌లో స్థూల నిల్వలు 395 మిలియన్‌ డాలర్లు ఉన్నప్పటికీ.. వినియోగించదగిన నిల్వలు కేవలం 45 మిలియన్‌ డాలర్లు మాత్రమేనని తెలుస్తోంది. మాల్దీవుల మానిటరీ అథారిటీ భారతదేశంతో 400 మిలియన్‌ డాలర్ల కరెన్సీ మార్పిడికి చర్చలు జరుపుతోంది. అయితే ఫిచ్‌ రేటింగ్‌ డౌన్‌గ్రేడ్‌ చేయడం పెరుగుతున్న డిఫాల్ట్‌ ఆందోళనలను నొక్కి చెబుతోంది. నిల్వలు తగ్గినందున బ్యాంక్‌ వేసవి ప్రారంభంలో చాలా బాండ్లను విక్రయించినట్లు డాన్సేక్‌ బ్యాంక్‌లోని పోర్ట్‌ఫోలియో మేనేజర్‌ సోరెన్‌ మోర్చ్‌ పేర్కొన్నారు. ఇప్పుడు పరిస్థితులు దారుణంగా ఉన్నాయని ఆయన తెలిపారు. ముస్లిం దేశాలు మాల్దీవులను సుకుక్‌ బాండ్‌పై డిఫాల్ట్‌ చేయడానికి అనుమతిస్తాయా అనేది కీలకమైన ప్రశ్న అని అన్నారు.

పర్యాటక ఆదాయం పెరుగుతున్నా..
పర్యాటక ఆదాయాలు పెరుగుతున్నప్పటికీ.. మాల్దీవులు దిగుమతులతోపాటు డాలర్‌ పెగ్‌పై ఆధారపడి నిల్వలను పెంచుతూనే ఉంది. చైనా అనుకూలంగా ఉన్న ప్రస్తుత మాల్దీవుల అధ్యక్షుడు మొహమ్మద్‌ ముయిజ్జు నేతృత్వంలోని పాలక పీపుల్స్‌ నేషనల్‌ కాంగ్రెస్‌ ఈ ఏడాది ప్రారంభంలో పార్లమెంటరీ మెజారిటీని సాధించింది. దీని తర్వాత అక్కడి భౌగోళిక రాజకీయ దృశ్యాన్ని క్లిష్టతరం చేసిందని తెలుస్తోంది. అలాగే కొయిలీ ఫ్రాంటియర్‌ మార్కెట్స్‌కు చెందిన మసీజ్‌ వోజ్నికా వంటి కొంతమంది పెట్టుబడిదారులు జాగ్రత్తగా ఉన్నారనే వార్తలు ప్రస్తుతం వినిపిస్తున్నాయి.