Lububu Toy Craze: సాధారణంగా 30 సంవత్సరాల వయసు దాటిన వారు ఏదో ఒక సంస్థలో పనిచేస్తూ ఉంటారు. అప్పటికే పెళ్లి జరిగి ఉంటుంది కాబట్టి సంసార బాధ్యతలు మోస్తూ.. ఉద్యోగాలు చేస్తూ ఉంటారు. సాధారణంగా ఆ వయసులో రిస్క్ తీసుకోవడానికి ఎవరూ పెద్దగా ఇష్టపడరు. అప్పటికే వయసు ఒక స్థాయికి వచ్చేస్తుంది. దానికి తోడు బాధ్యతలు పెరిగిపోతాయి. అలాంటప్పుడు ప్రయోగాల జోలికి వెళ్లడానికి ఎవరూ ఇష్టపడరు. అయితే ఇతడు మాత్రం ప్రయోగం చేశాడు. తన జీవితం మీద ఎక్స్ పర్ మెంట్స్ చేశాడు. విజయమో వీర స్వర్గమో అనే విషయాన్ని పక్కన పెడితే.. ప్రయత్న లోపం లేకుండా చేసుకున్నాడు. చివరికి అనుకున్నది సాధించాడు. ప్రపంచం మొత్తాన్ని తన వైపు తిప్పుకున్నాడు.
పెద్ద పెద్ద వ్యాపారవేత్తలు రియల్ ఎస్టేట్, హాస్పిటిలాటి, కన్స్ట్రక్షన్ వంటి రంగాలలో పెట్టుబడులు పెడుతుంటారు. కానీ కొంతమంది విభిన్నంగా ఉండే వ్యాపారవేత్తలు మాత్రం ఊహకు అందని రంగాలలో పెట్టుబడులు పెడుతుంటారు. అందులో భారీగా లాభాలను కళ్ళజూస్తారు. ఇప్పుడు ఈ వ్యక్తి కూడా అటువంటి వాడే. ఇతడికి మొదటి నుంచి వ్యాపారం చేయడం అంటే చాలా ఇష్టం. కాకపోతే విభిన్నమైన రంగంలోకి రావాలని అనుకున్నాడు. దానికి తగ్గట్టుగానే డిఫరెంట్ ఫీల్డ్ లోకి వచ్చాడు. రావడమే కాదు అద్భుతమైన విజయాన్ని సాధించాడు. కళ్ళు చెదిరే లాభాలు సొంతం చేసుకున్నాడు. ఆ వ్యక్తి పేరు వాంగ్ నింగ్.. ఇతడిది చైనా. వయసు 35 సంవత్సరాలు. ఇతడు లుబుబు అనే బొమ్మను మార్కెట్లోకి ప్రవేశపెట్టాడు. అది సూపర్ సక్సెస్ కావడంతో ఒకసారి గా బిలియనీర్ అయిపోయాడు.
Also Read: ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన హోటల్ ఇది.. ఒక్కరోజు బస చేయాలంటే ఆస్తులమ్ముకోవాలి.. అప్పులూ చేయాలి!
ఒకే ఒక్క రోజులో 1.6 బిలియన్ డాలర్ల సంపాదనతో సరికొత్త రికార్డు సృష్టించాడు. ఫలితంగా చైనాలోనే యువ బిలినియర్ గా రికార్డు సృష్టించాడు. లుబుుబు బొమ్మ చైనా దేశస్థులను విపరీతంగా ఆకట్టుకున్నది. సోషల్ మీడియాలో ఈ బొమ్మకు విపరీతమైన ప్రచారం కల్పించడంతో చైనా దేశస్తులు దీనిని విపరీతంగా కొనడం మొదలుపెట్టారు. పెద్ద పెద్ద కళ్ళతో ఈ బొమ్మ చైనా సంస్కృతిని ప్రతిబింబించే విధంగా ఉంది.. దీంతో అక్కడి ప్రజలు ఈ బొమ్మను తమ సంస్కృతికి ప్రతిబింబంగా భావిస్తూ కొనుగోలు చేయడం ప్రారంభించారు. కేవలం చైనా మాత్రమే కాదు ప్రపంచ వ్యాప్తంగా కూడా ఈ బొమ్మకు విపరీతమైన క్రేజీ నెలకొంది.. వాంగ్ ఈ బొమ్మను తన సంస్థ అయిన పాప్ మార్ట్ ద్వారా విక్రయించడం మొదలుపెట్టాడు..
వాస్తవానికి 2010లోనే డిజైనర్ బొమ్మల వ్యాపారంలోకి వాంగ్ ప్రవేశించాడు. అంతకంటే ముందు అతడు మీడియా పరిశ్రమంలో ఉన్నాడు.. కళాత్మకమైన బొమ్మలను రూపొందించి.. భావోద్వేగ పాత్రల ద్వారా వాటిని తయారు చేసి రకరకాల బాక్సులలో అమ్మేవాడు. హాంగ్కాంగ్ దేశానికి చెందిన కళాకారుడు కాసింగ్ లంగ్ ద్వారా వాంగ్ లబుబు బొమ్మను రూపొందించాడు. పెద్ద పెద్ద కళ్ళతో అభమను తయారు చేయించాడు. అది చైనా పిల్లలను విపరీతంగా ఆకట్టుకున్నది. ఈ బొమ్మను అత్యంత ఆకర్షణీయంగా రూపొందించడంలో వాంగ్ విజయవంతం అయ్యాడు. దీంతో వాంగ్ తన నికర సంపదని కూడా పెంచుకున్నాడు. ప్రస్తుతం అతడి సంపద విలువ వేగంగా 22 బిలియన్ డాలర్లకు చేరుకుంది.
Also Read: ఒంటె ఒక్క కన్నీటి చుక్కకు ఎంతటి శక్తి ఉంటుందో తెలుసా? తాజా అధ్యయనంలో ఏం తేలిందంటే?
వాంగ్ సంస్థ పాప్ మార్ట్ 30 కి పైగా దేశాలలో 130 కి పైగా దుకాణాలను కలిగి ఉంది. ఈదుకాణాలలో లబుబు బొమ్మలను విక్రయిస్తున్నారు. అయితే ఈ బొమ్మలను కొనుగోలు చేయడానికి చిన్నారులు విపరీతమైన ఇష్టాన్ని చూపిస్తున్నారు. కేవలం ఆఫ్ లైన్లోనే కాకుండా.. ఆన్లైన్లో కూడా ఈ బొమ్మలను విక్రయిస్తున్నారు. కేవలం బొమ్మలు వ్యాపారం ద్వారా వాంగ్ ఏకంగా బిలియనీర్ అయిపోయాడు అంటే.. ఈ బొమ్మల మార్కెట్ ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు.