Australia : చాయ్ వ్యాపారం మనదేశంలో వేలకోట్లకు ఎదిగింది. ఇప్పుడు కార్పొరేట్ రూపును సంతరించుకుంది. పెద్ద పెద్ద కంపెనీలు చాయ్ తయారీ రంగంలోకి అడుగుపెట్టాయి. రకరకాల పేర్లతో కార్యకలాపాలు సాగిస్తున్నాయి. రకరకాల చాయ్ లను దేశ ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చాయి. శిరోభారాన్ని మాత్రమే కాదు, నాలుకకు కొత్త రుచులను అందిస్తున్నాయి.. మామూలు చాయ్ నుంచి మొదలుపెడితే మ్యాంగో చాయ్ వరకు రుచి చూపిస్తున్నాయి. వినియోదారులు కూడా కొత్త కొత్త రుచులను కోరుకుంటున్న నేపథ్యంలో..చాయ్ వ్యాపారం అంతకంతకు విస్తరిస్తోంది. చాయ్ వ్యాపారంలో ఐఐటీ గ్రాడ్యుయేట్లు కూడా ఎంటర్ అవుతున్నారంటే దీని వ్యాపారం ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. పెట్టుబడిదారులు కూడా ఇందులో భారీగా ఇన్వెస్ట్ చేస్తున్నారు. చాయ్ చుట్టూ వేలకోట్ల వ్యాపారం జరుగుతోంది. టాటా నుంచి మొదలుపెడితే బ్రూక్ బాండ్ వరకు ఎన్నో కంపెనీలు వ్యాపారాలు సాగిస్తున్నాయి. అస్సాం, కేరళ, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల్లో లక్షలాది ఎకరాలలో తేయాకు తోటలు సాగవుతున్నాయి. ఇవి దేశ అవసరాలు మాత్రమే కాకుండా ఇతర దేశాలకు కూడా ఎగుమతి చేస్తున్నాయి.
సెలబ్రిటీలుగా మారుతున్నారు..
చాయ్ తయారుచేసిన వ్యక్తులు సెలబ్రిటీలుగా మారుతున్నారు. ప్రధాని నరేంద్ర మోడీ ఈ విధానానికి శ్రీకారం చుట్టగా.. దానిని మిగతావారు కొనసాగిస్తున్నారు. తాజాగా డాలి అనే చాయ్ తయారు చేసే వ్యక్తి సెలబ్రిటీ అయిపోయాడు. ఆయన టీ తయారు చేసే విధానం విచిత్రంగా ఉంటుంది. ఇటీవల ముకేశ్ అంబానీ కుమారుడు వివాహానికి బిల్ గేట్స్ హాజరయ్యారు. దానికంటే ముందు డాలి అనే చాయ్ మాస్టర్ ను కలిశారు. అతనితో కలిసి చాయ్ తాగారు. అతడు చాయ్ తయారుచేసిన విధానానికి ఫిదా అయ్యారు. డాలి సెలబ్రిటీ కావడంతో సోషల్ మీడియాలో మీమ్స్ సందడి చేస్తున్నాయి. “పేరుపొందిన విద్యాసంస్థల్లో చదవడం కాదు.. సెంటర్లో చాయ్ బండి పెట్టుకుంటే చాలు.. జీవితం సెటిల్ అవుతుంది. సోషల్ మీడియాలో పేరు తెచ్చుకుంటే చాలు.. సెలబ్రిటీ హోదా వస్తుందని” నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.
ఇక మన దేశానికి చెందిన ఓ వ్యక్తి ఉన్నత చదువుల నిమిత్తం ఆస్ట్రేలియా వెళ్ళాడు. అక్కడ ఉద్యోగం చేయకుండా చాయ్ దుకాణం పెట్టాడు. అతడు చాయ్ తయారు చేసే విధానం అందరికీ నచ్చింది. అతడు తయారు చేసే అల్లం చాయ్ కి అక్కడ ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్ ఉంది. అతడికి విపరీతమైన గిరాకీ ఉంది. దీంతో ఓవర్ నైట్ సెలబ్రిటీ అయిపోయాడు. ఏడాదికి 5.2 కోట్లు సంపాదిస్తున్నాడు. దీంతో అతడు ఒకసారిగా సోషల్ మీడియా సెన్సేషన్ అయ్యాడు. అతనిపై నెటిజన్లు మీమ్స్ రూపొందిస్తూ షేక్ చేస్తున్నారు.
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
Read MoreWeb Title: Left his education in australi half way to start a tea business there now earning 5 2 per year
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com