YCP MP Candidates: సార్వత్రిక ఎన్నికలకు ఇంకా మూడున్నర సంవత్సరాల వ్యవధి ఉంది. మొన్నటి ఎన్నికల్లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ దారుణంగా ఓడిపోయింది. మూడు పార్టీల కూటమి చేతిలో ఓటమి చవిచూసింది. కేవలం నాలుగు పార్లమెంట్ స్థానాలకు మాత్రమే పరిమితం అయింది. 2019 ఎన్నికల్లో 22 స్థానాల్లో విజయం సాధించిన ఆ పార్టీ 18 స్థానాలను వదులుకుంది. అయితే 2029 ఎన్నికల్లో భారీగా ఎంపీ అభ్యర్థులను గెలిచి జాతీయస్థాయిలో సత్తా చాటాలని చూస్తోంది. అందులో భాగంగా బలమైన అభ్యర్థులను పోటీ చేయించాలని చూస్తున్నట్లు ప్రచారం సాగుతోంది. అయితే చాలా నియోజకవర్గాల్లో ఇతర పార్టీలకు చెందిన నేతలను సైతం ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. అనంతపురం నుంచి వచ్చే ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థిగా జేసీ దివాకర్ రెడ్డి కుమారుడు పవన్ రెడ్డిని రంగంలోకి దించనున్నట్లు సమాచారం. ప్రస్తుతం ఆయన టిడిపిలో కొనసాగుతున్నారు. మరోవైపు రాజమండ్రి ఎంపీ స్థానం నుంచి జీవి శ్రీ రాజ్ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. ఈయన మాజీ కేంద్రమంత్రి జీవీ హర్ష కుమార్ కుమారుడు. ప్రస్తుతం ఆ కుటుంబం కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతోంది. అయితే ఇది అధికారికంగా కాకపోయినా సోషల్ మీడియాలో వైసీపీ ఎంపీ అభ్యర్థులు వీరేనంటూ ఒక ప్రచారం మాత్రం సాగుతోంది. 25 పార్లమెంట్ స్థానాలకు సంబంధించి వైసీపీ అభ్యర్థుల జాబితా ఇదే అంటూ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. దానిని ఒకసారి పరిశీలిస్తే
* కర్నూలు బుట్టా రేణుక
* నంద్యాల బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి
* అనంతపురం జెసి పవన్ రెడ్డి
* కడప వైయస్ హర్ష రెడ్డి
* హిందూపురం దివ్య రెడ్డి
* చిత్తూరు వరప్రసాద్
* తిరుపతి గురుమూర్తి
* నెల్లూరు అనిల్ కుమార్ యాదవ్
* ఒంగోలు వైవి విక్రాంత్ రెడ్డి
* బాపట్ల ఆదిమూలపు సురేష్
* గుంటూరు మోదుగుల వేణుగోపాల్ రెడ్డి
* విజయవాడ కేశినేని నాని
* నరసరావుపేట ఉమా బాల
* మచిలీపట్నం సింహాద్రి రమేష్
* ఏలూరు కారుమూరి సునీల్ యాదవ్
* రాజమండ్రి జీవీ శ్రీరామ్
* కాకినాడ చలమశెట్టి సురేష్
* అమలాపురం చింతా అనురాధ
* అరకు తనుజరాణి
* విజయనగరం మజ్జి శ్రీనివాసరావు
* అనకాపల్లి ఎంవివి సత్యనారాయణ
* విశాఖ బొత్స ఝాన్సీ లక్ష్మి
* శ్రీకాకుళం పేడాడ తిలక్