https://oktelugu.com/

Mata Hari : అందాన్ని ఎరవేసింది.. నృత్యంతో మైమరపించి.. గూఢచర్యంలో ఆరితేరిన అందగత్తె.. నియంత హిట్లర్‌కు నమ్మిన బంటు..! 

ప్రపంచంలో ఎంతో పేరుగాంచిన గూఢచారిగా నిలిచింది మాతా హారీ.. తన గూఢచర్య విద్యలతో ప్రపంచాన్నే నివ్వెరపోయేలా చేసింది. హిట్లర్‌ దగ్గర గూఢచారిగా పనిచేసిన మాతా హారీ యూరప్‌ను ఒక కుదుపు కుదిపింది. హిట్లర్‌కు గూఢచారిగా పనిచేసిందన్న ఆరోపణలతో ఆమెను హత్య చేశారు.

Written By: , Updated On : July 21, 2023 / 07:34 PM IST
Follow us on

Mata Hari : గూఢచర్యం.. నాటికాలంలో సాంకేతిక పరిజ్ఞానం లేకపోవడంతో శత్రుదేశాల రహస్యాలను తెలుసుకునేందుకు రాజులు గూఢచారులను నియమించుకునేవారు. ఇతర పనులు చేసుకుంటూనే శత్రుదేశాల రహస్యాలు సేకరించేవారు. ఇప్పుడు హనీట్రాప్‌కూడా దాదాపు ఇలాంటిదే. అయితే ప్రపంచంలో ఎంతో పేరుగాంచిన గూఢచారిగా నిలిచింది మాతా హారీ.. తన గూఢచర్య విద్యలతో ప్రపంచాన్నే నివ్వెరపోయేలా చేసింది. హిట్లర్‌ దగ్గర గూఢచారిగా పనిచేసిన మాతా హారీ యూరప్‌ను ఒక కుదుపు కుదిపింది. హిట్లర్‌కు గూఢచారిగా పనిచేసిందన్న ఆరోపణలతో ఆమెను హత్య చేశారు. ఆమె గూఢచార విద్యలో ఆరితేరినదే కాకుండా అందగత్తె, డ్యాన్సర్‌.
నెదర్లాండ్‌లో పుట్టిన మాతాహారీ.. 
1876లో నెదర్లాండ్‌లోజన్మించిన మాతాహారి అసలు పేరు గెర్ర్‌టూడ్‌ మార్గరెట్‌ జెలె. గూఢచర్యం ఆమె వృత్తి. మాతాహారీకి పలు దేశాల సైన్యాధికారులతో, మంత్రులతో సన్నిహిత సంబంధాలు ఉండేవి. తన అపరిమితమైన కోరికలను తీర్చుకునేందుకు ఆమె 1905లో ఫ్రాన్స్‌ రాజధాని పారిస్‌ చేరుకుంది. ఆమె తన అందచందాలను ఎరగా వేసి కొద్దికాలంలోనే అధికారులకు సన్నిహితురాలిగా మారిపోయింది. ఆమె నృత్యం వారిని కట్టిపడేసేది. మైమరపింపజేసేంది. తన నృత్య కార్యక్రమాల కోసం ఆమె యూరప్‌ అంతా పర్యటించేది.

నృత్యం మాటున గూఢచర్యం.. 
మొదటి ప్రపంచయుద్ధం ప్రారంభమయ్యేవరకూ ఆమె ఒక డాన్సర్, స్ట్రిప్పర్‌గానే ఉంది. మాతా హారీ నృత్యాన్ని చూసేందుకు దేశాధినేతలు, సైన్యాధ్యక్షులు, రాజకీయ అతిరథమహారథులు వచ్చేవారు. వారితో తనకు ఏర్పడిన సాన్నిహిత్యాన్నే ఆసరాగా చేసుకున్న ఆమె ఇతరుల రహస్యాలను మరొకరికి చేరవేసే పని మొదలుపెట్టింది. హిట్లర్‌ కోసం, ఫ్రాన్స్‌ కోసం ఆమె గూఢచర్యం చేసేదని చెబుతుంటారు.
హత్య తర్వాత రహస్య పత్రాలు.. 
మాతాహారీ హత్య అనంతరం 70వ దశకంలో జర్మనీకి సంబంధించిన అనేక రహస్య పత్రాలు బయటపడ్డాయి. మాతాహారీ జర్మనీకి గూఢచర్యం చేసినట్లు వాటి ద్వారా వెల్లడయ్యింది. గూఢచర్యం చేస్తున్నదన్న ఆరోపపణల మేరకు ఆమెను 1917లో అరెస్టు చేశారు. అయితే కోర్టులో ఆమె గూఢచారి అని నిరూపణ కాలేదు. ఆమె డాన్సర్‌ మాత్రమేనని కోర్టు తీర్పుచెప్పింది. అయితే ఆ తరువాత ఆమెపై వచ్చిన ఆరోపణలు నిజమని తేలడంతో ఆమె కళ్లకు గంతలు కట్టి తుపాకీతో కాల్చి చంపారు.