North Korea : ఉత్తర కొరియా తూర్పు ఆసియాలోని ఒక దేశం . ఇది కొరియన్ ద్వీపకల్పం యొక్క ఉత్తర భాగంలో ఉంది. చైనా, రష్యాకు ఉత్తరానయాలు (అమ్నోక్) మరియు టుమెన్ నదుల వద్ద మరియు దక్షిణ కొరియాకు దక్షిణాన కొరియన్ డిమిలిటరైజ్డ్ జోన్ వద్ద సరిహద్దులుగా ఉంది. ప్యోంగ్యాంగ్ ఉత్తర కొరియా రాజధాని. ఉత్తర కొరియా నిరంకుశ నియంతృత్వం మరియు కిమ్ కుటుంబం చుట్టూ వ్యక్తిత్వం యొక్క సమగ్ర ఆరాధనతో ఉంది. అధికారికంగా, ఉత్తర కొరియా ఒక ‘స్వతంత్ర సోషలిస్ట్ రాజ్యం. ఇది ప్రజాస్వామ్య ఎన్నికలను నిర్వహిస్తుంది. అయితే, బయటి పరిశీలకులు సోవియట్ యూనియన్‌లో ఎన్నికల మాదిరిగానే ఎన్నికలను అన్యాయమైన, పోటీలేని ముందుగా నిర్ణయించినవిగా అభివర్ణించారు . వర్కర్స్ పార్టీ ఆఫ్ కొరియా ఉత్తర కొరియా అధికార పార్టీ. రాజ్యాంగంలోని ఆర్టికల్ 3 ప్రకారం, కిమిల్‌సుంగిజం–కిమ్‌జోంగిలిజం ఉత్తర కొరియా యొక్క అధికారిక భావజాలం. ఉత్పాదక సాధనాలు రాష్ట్ర యాజమాన్యంలోని సంస్థలు మరియు సామూహిక వ్యవసాయ క్షేత్రాల ద్వారా రాష్ట్ర ఆధీనంలో ఉంటాయి. తాజాగా ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్ కఠిన నిర్ణయం తీసుకున్నారు. దేశంలో వరదలను నియంత్రించడంలో విఫలమయ్యారని 30 మంది ప్రభుత్వ అధికారులకు మరణశిక్ష విధించారట.
ఏం జరిగిందంటే..
ఉత్తరకొరియా ఇటీవల భారీ వర్షాలు, వరదలతో అతలాకుతలమైన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే విపత్తు నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన అధికారులపై కఠిన చర్యలకు సిద్ధమయ్యారు. దాదాపు 30 మంది ప్రభుత్వ అధికారులకు మరణశిక్ష అమలు చేయాలని కిమ్ ఆదేశించినట్లు తెలుస్తోంది. ఈ మేరకు అంతర్జాతీయ మీడియా కథనాలు వెల్లడించాయి. అవినీతి, విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించారన్న కారణంతో 20–30 మంది ప్రభుత్వ అధికారులకు గత నెల మరణశిక్ష విధించినట్లు దక్షిణకొరియా మీడియా తొలుత ఓ కథనంలో వెల్లడించింది. ఆ తర్వాత కొద్ది రోజులకే వీరికి మరణశిక్షను అమలు చేసినట్లు తెలిసిందని ఆ కథనంలో పేర్కొంది. అయితే, శిక్ష అమలు వార్తలపై ఎలాంటి అధికారిక స్పష్టత లేదు.
పార్టీ సెక్రెటరీకీ మరణ శిక్ష..
ఇదిలా ఉంటే.. చాగాంగ్ ప్రావిన్స్ ప్రొవిన్షియల్ పార్టీ కమిటీ సెక్రటరీ కాంగ్ బాంగ్ హూన్ కూడా శిక్ష పడిన వారిలో ఉన్నట్లు తెలుస్తోంది. విపత్తు సమయంలో అధ్యక్షుడు కిమ్ ఓ అత్యవసర సమావేశం ఏర్పాటు చేశారు. అందులో హూన్ను విధుల నుంచి తొలగిస్తూ ఆదేశాలు జారీ చేశారు. దీంతో ఆయనకు శిక్ష పడి ఉండొచ్చని సదరు కథనాలు పేర్కొన్నాయి.
జూలై ఆగస్టులో వర్షాలు..
గత జులై–ఆగస్టు మధ్య ఉత్తరకొరియాలో గత కొన్ని రోజులుగా భారీ వర్షాలు కురిశాయి. దీంతో వరదలు, బురదచరియలు సంభవించి అనేక ఊర్లు కొట్టుకుపోయాయి. ఈ విపత్తులో దాదాపు 4 వేల మంది ప్రాణాలు కోల్పోగా.. వేలాది మంది నిరాశ్రయులయ్యారు. వరదల సమయంలో స్వయంగా కిమ్ రంగంలోకి దిగి విపత్తు ప్రదేశాలను పర్యటించారు. మోకాలిలోతు నీటిలో కిమ్ కారు డ్రైవ్ చేసుకుంటూ వెళ్లడం.. బోటులో వెళ్లి సహాయక చర్యలను పర్యవేక్షించిన దృశ్యాలు అప్పట్లో వైరల్ అయ్యాయి.
శిక్షలు సాధారణమే..
ఇదిలా ఉండగా.. కిమ్ రాజ్యంలో ఇలాంటి శిక్షలు సాధారణమే. 2019లో అప్పటి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో కిమ్ జరిపిన చర్చలను సరిగా సమన్వయం చేయనందుకుగానూ ఉత్తరకొరియా అణు రాయబారి కిమ్ హోక్ చోలకు మరణదండన అమలు చేశారు.