Kim jong un : ప్రపంచ దేశాల ఆంక్షలు.. దేశంలో దుర్భర దారిద్రం.. నియంత పరిపాలన.. ఎదురు ప్రశ్నించే అవకాశం లేదు.. ప్రతిపక్షాలకు చోటు లేదు. అధికార పక్షాన్ని ఎదిరిస్తే బతుకులేదు.. దీనికి తోడు అణు బాంబులు.. ప్రపంచం నుంచి సహకారం లేక.. నరకం చూస్తోంది. ఆసియాలో బంగ్లాదేశ్, పాకిస్తాన్, శ్రీలంక తర్వాత అంతటి స్థాయిలో అటువంటి ఆర్థికంగా ఇబ్బందులు పడుతోంది. అయితే ఇటీవల కాలంలో ఉత్తర కొరియా అధ్యక్షుడికి కాస్త బుద్ధి వచ్చినట్టుంది. అందువల్లే యుద్ధం, బాంబులు, ఆయుధాలు అని కాకుండా అభివృద్ధి వైపు దృష్టి సారిస్తున్నాడు. అంతేకాదు తన దేశానికి పర్యాటకంగా గుర్తింపు తీసుకురావాలని ప్రయత్నాలు చేస్తున్నాడు. ఇందులో భాగంగానే ఓసారి కొత్త ప్రణాళికకు శ్రీకారం చుట్టాడు. దానిని అమలులో పెట్టి.. మొత్తానికి పూర్తి చేశాడు.. అంతేకాదు వచ్చే నెల నుంచి ప్రపంచ వ్యాప్తంగా పర్యాటకులు తమ దేశాన్ని సందర్శించవచ్చని.. వారికి ద్వారాలు తెరిచే ఉంటాయని స్పష్టం చేశాడు.
ఉత్తరకొరియాలోని వోన్సాన్ – కల్మా ప్రాంతంలో కోస్టల్ జోన్ ఏర్పాటు చేసింది. పర్యాటకుల కోసం విశాలమైన హోటళ్లు, రిసార్టులు, స్పా లు ఏర్పాటు చేసింది. అందులో అద్భుతమైన సౌకర్యాలు కల్పించింది. పర్యాటకులు సముద్రంలో ఇత కొట్టవచ్చు. క్రీడల్లో పాల్గొనవచ్చు. వినోద కార్యక్రమాలలో పాలుపంచుకోవచ్చు. టూరిస్ట్ ల కోసం ప్రపంచ వ్యాప్తంగా లభించే ఆహార పదార్థాలను రెస్టారెంట్లలో అందుబాటులో ఉంచారు. ఈ పర్యటక స్థలాన్ని ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్ ఇటీవల సందర్శించారు.. ఆ తర్వాత అధికారికంగా జరిగిన వేడుకలు ఈ కోస్టల్ హబ్ ను ప్రారంభించారని కొరియన్ సెంట్రల్ న్యూస్ ఏజెన్సీ వెల్లడించింది..” ఈ కోస్టల్ ఏరియా నిర్మాణం ఈ సంవత్సరం మనం సాధించిన గొప్ప విజయాలలో ఒకటి. పర్యటకాన్ని అభివృద్ధి చేయాలనే విధానాన్ని బలోపేతం చేస్తుంది. ఇది అత్యంత గర్వకారణమైన మొదటి అడుగని” కిమ్ వ్యాఖ్యానించినట్టు కొరియన్ సెంట్రల్ న్యూస్ ఏజెన్సీ వెల్లడించింది.
ఈ బీచ్ ప్రాంతం జూలై 1 నుంచి పర్యాటకులతో అందుబాటులోకి వస్తుంది. అయితే విదేశీ పర్యాటకులకు ఎప్పటినుంచి ప్రవేశం లభిస్తుంది అనే విషయంపై ఉత్తరకొరియా క్లారిటీ ఇవ్వలేదు. అయితే ఈ ప్రాంతాన్ని ముందుగా రష్యన్ అధికారులు సందర్శిస్తారని తెలుస్తోంది.. ఉత్తరకొరియా పరిమిత బడ్జెట్ ద్వారానే దీనిని నిర్మించింది. దీనిని మరింత స్థాయిలో అభివృద్ధి చేయాలంటే ఉత్తర కొరియాకు భారీగా నగదు అవసరం ఉంది. అలాంటప్పుడు ఆ నగదును సమకూర్చుకోవాలంటే కచ్చితంగా ఉత్తరకొరియాకు చైనా, ఇతర విదేశీ పర్యాటకులు అవసరం ఉంది. వోన్సాన్ – కల్మా జోన్ ను అత్యంత ప్రముఖమైన ప్రాజెక్టుగా ఉత్తరకొరియా భావిస్తున్నది. అందువల్లే దీనిని గొప్పగా అభివృద్ధి చేసింది.
ఉత్తరకొరియా ఈ కోస్టల్ ప్రాజెక్టు నిర్మించిన నేపథ్యంలో భారతదేశం తన వైఖరి మార్చుకుంది. ఉత్తరకొరియాలో తన తదుపరి రాయబారిని నియమించింది.. పరాగ్వే ప్రాంతంలో భారత రాయబార కార్యాలయంలో అలియావతి ని లాంగ్ కు మెర్ ను డెమోక్రటిక్ పీపుల్ రిపబ్లిక్ ఆఫ్ కొరియన్ దేశానికి తదుపరి రాయబారిగా భారతదేశం నియమించింది.