Homeప్రవాస భారతీయులుMLC Jeevan Reddy: ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి చొరవ.. అమెరికా చిన్నారికి అత్యవసర వీసా.. ఎందుకు జారీ...

MLC Jeevan Reddy: ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి చొరవ.. అమెరికా చిన్నారికి అత్యవసర వీసా.. ఎందుకు జారీ చేశారు తెలుసా?

MLC Jeevan Reddy: తెలంగాణ రాష్ట్రం జగిత్యాల జిల్లా రాయికల్‌ మండలం కొత్తపేటకు చెందిన చింతలపెల్లి అఖలేందర్‌రెడ్డి ఉపాధి నిమిత్తం అమెరికాలో స్థిరపడ్డాడు. ఆయన భార్య కేతిరెడ్డి శ్రుతిరెడ్డి తండ్రి కోరుట్ల మండలం నాగులపేటకు చెందిన మోహన్‌రెడ్డి జూలై 5న రోడ్డు ప్రమాదంలో మృతిచెందాడు. తన తండ్రి అంత్యక్రియల కోసం కుంటుబ సభ్యులతో కలిసి ఈనెల 6న డల్లాస్‌ ఎయిర్‌పోర్టు నుంచి బయల్దేరారు. ఖత్తర్‌ ఎయిర్‌వేస్‌ సిబ్బంది ఆరు నెలల చిన్నా రికి యశ్నకు ఫ్లైట్‌ ఎక్కడానికి అనుమతించలేదు.

అమెరికా పౌరసత్వం ఉన్నా…
శ్రుతిరెడ్డి భారతీయురాలు.. అమెరికాలో జన్మించిన ఆమె కూతురు యశ్నకు అమెరికా పౌరసత్వం ఉన్నా.. భారతీయ మూలాలు ఉన్నవారికి ఓవర్సీస్‌ సిటిజన్‌ ఆఫ్‌ ఇండియా(ఓసీఈ) కార్డు లేదా ఇండియా విజిట్‌ వీసా ఉండాలి. ఈ ఆరు నెలల పాపకు ఈ ఆరు నెలల పాపకు ఈ రెండు లేకపోవడంఓత అక్కడ ఖత్తర్‌ ఎయిర్‌వేస్‌ సిబ్బంది ఫ్లైట్‌ ఎక్కడానికి అనుమతించడం లేదు.

ఎమ్మెల్సీ చొరవతో..
విషయం తెలుసుకున్న అఖలేందర్‌రెడ్డి తండ్రి కొత్తపేట మాజీ ఎంపీటీసీ చింతలపల్లి గంగారెడ్డి ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి దృష్టికి శనివారం(జూలై 6)న తీసుకెళ్లారు. వెంటనే స్పందించిన ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి తెలంగాణ ఎన్నారై అధికారి చిట్టిబాబు, టీపీసీసీ ఎన్నారై సెల్‌ కన్వీనర్‌ మంద భీంరెడ్డి సమన్వయంతో కేంద్రం హోం మంత్రిత్వ శాఖ, బ్యూరో ఆఫ్‌ ఇమిగ్రేషన్‌ అధికారులతో మాట్లాడారు. చిన్నారి యశ్నకు అత్యవసర వీసా ఇప్పించారు. దీంతో కుటుంబ సభ్యులు ఊపిరి పీల్చుకున్నారు. దీంతో ఆదివారం ఇండియా బయల్దేరారు. సోమవారం(జూలై 8న) నాగులపేటకు చేరుకున్నారు. మొహన్‌రెడ్డి అంత్యక్రియల్లో పాల్గొన్నారు.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.
Exit mobile version