US Job Cuts: అమెరికాలో ఉద్యోగాల కోత.. గూగుల్, అమెజాన్, టెస్లా ఎందుకు తొలగిస్తున్నాయి.. భారతీయుల్లో ఆందోళన!

అమెరికా అధ్యక్ష ఎన్నికలు త్వరలో జరుగబోతున్నాయి. ట్రంప్‌ అధ్యక్షుడిగా గెలిస్తే విదేశీ ఉద్యోగులను పంపిచేస్తాడని ప్రచారం జరుగుతోంది. దీంతో విదేశీయులు ఆందోళన చెందుతున్నారు. ఈ క్రమంలో దిగ్గజ కంపెనీలు ముందే.. ఉద్యోగుల కోత మొదలు పెట్టాయి.

Written By: Raj Shekar, Updated On : August 13, 2024 11:01 am

US Job Cuts

Follow us on

US Job Cuts: అమెరికాలో చదువు కోవాలని, అక్కడే ఉద్యోగం చేయాలని, డాలర్‌ డ్రీమ్‌ నెరవేర్చుకోవాలని భారతీయులు ఏటా వేల మంది అగ్రరాజ్యానికి క్యూ కడుతున్నారు. తల్లిదండ్రులు కూడా.. తమ పిల్లలను అమెరికా పంపించేందుకే ఆసక్తి చూపుతున్నారు. ఒకప్పుడు ధన వంతులకే పరిమితమైన అమెరికా చదువులు.. ఇప్పుడు మధ్య తరగతికి కూడా అందుబాటులోకి వచ్చింది. ప్రభుత్వ పథకాలు, బ్యాంకులు రుణాలు ఇస్తుండడంతో మిడిల్‌ క్లాస్‌ ఫ్యామిలీలు కూడా తమ పిల్లలను విదేశాల్లో చదివించేందుకు ముందుకు వస్తున్నారు. ఎక్కువ మంది అమెరికా ఫ్లైట్‌ ఎక్కించేస్తున్నారు. ఇప్పటికే అమెరికాలో 12 లక్షల మందికిపైగా భారతీయులు ఉన్నట్లు ఆ దేశ సెన్సెస్‌ చెబుతోంది. ఇదిలా ఉంటే.. అమెరికాలో మాంద్యం ఇంకా పూర్తిగా తొలగిపోలేదు. దీంతో ఆర్థిక భారం తగ్గించుకునేదుకు అక్కడి కంపెనీలు చర్యలు చేపట్టాయి. ఏడాదిగా ఈ ట్రెండ్‌ కొనసాగుతోంది. ప్రస్తుతం మాంద్యం భయాలు తొలగిపోతున్నా.. చిన్న చిన్న కంపెనీల నుంచి పెద్ద కంపెనీల వరకూ ఉద్యోగులను తగ్గించుకునేందుకు ప్రయత్నిస్తున్నాయి. దీంతో బడా కంపెనీల్లో పనిచేస్తున్న భారతీయులను ఈ ట్రెండ్‌ ఆందోళనకు గురిచేస్తోంది. భారతీయ ప్రతిభకు ప్రధాన ఉపాధి కల్పన సంస్థ అయిన టెక్‌ పరిశ్రమ ప్రత్యేకించి తీవ్రంగా దెబ్బతిన్నది. ఇ–కామర్స్, క్లౌడ్‌ సేవలలో కీలకమైన అమెజాన్, బై విత్‌ ప్రైమ్, ఆడిబుల్, ట్విచ్, అమెజాన్‌ వెబ్‌ సర్వీసెస్‌తో సహా దాని వివిధ విభాగాలలో భారీగా ఉద్యోగులను ఇప్పటికే తొలగించింది.

అన్ని విభాగాలపై ప్రభావం…
ఉద్యోగాల తొలగింపు ఐటీ ప్రొఫెషనల్స్‌కే కాదు. రిమోట్‌గా లేదా ఔట్‌సోర్సింగ్‌ పాత్రల్లో పనిచేస్తున్న భారతీయ ఉద్యోగులను కూడా ప్రభావితం చేస్తుంది. గూగుల్‌ మాతృ సంస్థ అయిన ఆల్ఫాబెట్, ముఖ్యంగా దాని ఎక్స్‌ ల్యాబ్, అడ్వర్టైజింగ్‌ సేల్స్‌ పిక్సెల్‌ మరియు ఫిట్‌బిట్‌ వంటి హార్డ్‌వేర్‌ విభాగాలలో ఉద్యోగాలను కూడా తగ్గించింది. మైక్రోసాఫ్ట్‌ తన గేమింగ్‌ సెక్టార్‌లో సుమారు 1,900 స్థానాలను తగ్గించింది, అయితే ఐబీఎం తొలగింపులను ప్లాన్‌ చేస్తుంది కానీ ఏఐ నిపుణుల నియామకంపై దృష్టి పెట్టింది. ఈ ప్రాంతాల్లో పనిచేస్తున్న చాలా మంది భారతీయులకు ఉద్యోగ అభద్రత పెరిగింది. దాదాపు 17,500 ఉద్యోగాలను తగ్గించాలన్న ఇంటెల్‌ నిర్ణయం, ఇది దాని గ్లోబల్‌ వర్క్‌ఫోర్స్‌లో 15%, మరొక ముఖ్యమైన దెబ్బ. ఇంటెల్‌ కార్యకలాపాలలో పాల్గొన్న భారతీయ ఇంజనీర్లు మరియు సాంకేతిక సిబ్బంది కంపెనీ తన తయారీ వ్యాపారాన్ని పునర్నిర్మించినందున అనిశ్చితిని ఎదుర్కోవచ్చు.

ఈ సంస్థలు కూడా..
ఈ బై, యూనిటీ సాఫ్ట్‌వేర్, డాక్యుసైన్, స్నాప్, అలెస్‌ఫోర్స్‌ సంస్థలు కూడా తమ సిబ్బందిని తగ్గిస్తున్నాయి. టెక్‌ దిగ్గజాలు పే పాల్, సిటీ గ్రూప్‌ వంటి ఆర్థిక సంస్థలు భారీ తొలగింపులను ప్లాన్‌ చేస్తున్నాయి. ఆటోమోటివ్‌ రంగంలో, తగ్గుతున్న అమ్మకాలు, పోటీ కారణంగా టెస్లా తన గ్లోబల్‌ వర్క్‌ఫోర్స్‌లో 10% పైగా తగ్గించాలని యోచిస్తోంది. వాల్‌మార్ట్, నైక్‌ వంటి చిల్లర వ్యాపారులు కూడా ఉద్యోగాలను తగ్గించుకుంటున్నారు. హెల్త్‌కేర్‌ తయారీ కంపెనీలు కూడా గణనీయమైన తగ్గింపులను చేస్తున్నాయి. సంబంధిత రంగాలలోని భారతీయ నిపుణులు ఉద్యోగ నష్టం లేదా అవకాశాలు తగ్గవచ్చు.