JF 17 Thunder Pakistan: పాకిస్తాన్ ఆర్థిక సంక్షోభంలో మునిగి తేలుతోంది. ఐఎంఎఫ్ రీస్ట్రక్చరింగ్ ప్రోగ్రామ్, చైనా రుణాలతో పాటు తాజాగా సౌదీ అరేబియా నుంచి భారీ మొత్తం అప్పు స్వీకరించింది. ఇది కేవలం తాత్కాలిక ఊపిరి. ఎందుకంటే మునుపటి రుణాలు చెల్లించలేకపోతోంది. సౌదీ వంటి మిత్రదేశాలు ఎప్పుడూ సహాయం చేస్తున్నా, ఇది స్థిరమైన పరిష్కారం కాదు. విశ్లేషకుల ప్రకారం, పాకిస్తాన్ విదేశీ రుణాలు 100 బిలియన్ డాలర్లు మించాయి, జీడీపీకి 80%కి పైగా అప్పులే.
అప్పు తీర్చేందుకు జేఎఫ్–17 థండర్ అమ్మకం..
సౌదీ అప్పు చెల్లింపు సమయం దగ్గరపడగా, పాకిస్తాన్ సమగ్ర సైనిక ఒప్పందాన్ని ఉపయోగించి చైనా–పాక్ జాయింట్ వెంచర్ జేఎఫ్–17 ఫైటర్ జెట్‌లను అప్పుకింద ఇవ్వాలని ప్రతిపాదించింది. 42% చైనా, 58% పాక్ తయారీలో ఈ విమానాలు ఆపరేషన్ సిందూర్‌లో భారత సైన్యానికి ఎదుర్కొనలేకపోయాయి. సౌదీతో ’మా సైనికులు మీ దేశంలో, మీ సైనికులు మా దేశంలో పనిచేయడానికి సులభం’ అని చెప్పినా, ఈ ఫైటర్ జెట్‌ల వైఫలయ్యాన్ని దాచిపెట్టారు. ఇది అప్పు తీర్చే తాకట్టు వ్యూహం.
ఎగుమతికీ ఒప్పందాలు..
ఆర్థిక ఒత్తిడితో పాకిస్తాన్ జేఎఫ్–17లను అమ్మకాలకు మొగ్గు చూపుతోంది. అజర్‌బైజాన్, నైజీరియా, మయన్మార్‌కు ఇప్పటికే 1.5 బిలియన్ డాలర్ల ఆర్డర్లు. తాజాగా సూడాన్ ప్రభుత్వానికి, దానితో పోరాడే ఆర్‌ఎస్‌ఎఫ్ తిరుగుబాటుదారులకు రెండింటికీ జెట్‌లు అమ్ముతోంది. లిబియాలో ఖలీఫా హఫ్తార్ వంటి వార్‌లార్డ్‌కు కూడా సరఫరా. సౌదీ, యూఏఈ, ఇరాన్, ఇండోనేషియా, బంగ్లాదేశ్‌కు ప్లాన్. ఇది నైతికతకు విరుద్ధం – అంతర్యుద్ధాలను ఉపయోగించుకుని డబ్బు సంపాదించాలనుకుని పాకిస్తాన్ భావిస్తోంది.
భారత్, ఆఫ్గాన్ ఒత్తిడి మధ్యలో..
భారత్‌తో ఆపరేషన్ సిందూర్ దెబ్బ, ఆఫ్గానిస్తాన్‌తో సరిహద్దు ఉద్రిక్తతల మధ్య పాకిస్తాన్ సైనిక ఆస్తులను పంపిణీ చేస్తోంది. సౌదీతో సైనిక ఒప్పందం ఉంటే, యూఏఈతో కూడా చేతులు కలిపింది – యెమెన్ విషయంలో రెండు మిత్రదేశాల మధ్య గొడవల సమయంలో. ఇది డైప్లమసీ రిస్క్: ఆయుధ ఎక్స్‌పోర్ట్‌లు పొదుపు పెంచుతూ, ఆర్థిక స్థిరత్వాన్ని దెబ్బతీస్తాయి.
జేఎఫ్–17లు విఫలమైనా అమ్మకాలు, ఆస్తి జమలు దీర్ఘకాలిక పరిష్కారం కావు. ఆఫ్గాన్, భారత్ ఒత్తిడులు, అంతర్జాతీయ మార్కెట్‌లో నమ్మకం క్షీణతలతో ఆర్థికం మరింత గర్భిణీ. స్థిరమైన సంస్కరణలు రాకపోతే, పూర్తి కుంగిపోవచ్చు అని నిపుణులు హెచ్చరిస్తున్నారు.